రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పర్యటనకు ఏర్పాట్లు పూర్తి.

 రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పర్యటనకు ఏర్పాట్లు పూర్తి.


 ఏర్పాట్లను పరిశీలించిన ముఖ్యమంత్రి ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ తలశిల రఘురాం, జిల్లా కలెక్టర్ బసంత్ కుమార్, ఎంపీ గోరంట్ల మాధవ్, ఎమ్మెల్యే శంకర నారాయణ, వ్యవసాయ శాఖ స్పెషల్ కమీషనర్ హరికిరణ్ తదితరులు..


చెన్నేకొత్తపల్లి (శ్రీ సత్యసాయి జిల్లా), జూన్ 13 (ప్రజా అమరావతి):


రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ నెల 14వ తేదీ మంగళవారం శ్రీ సత్యసాయి జిల్లాలోని చెన్నేకొత్తపల్లి మండలంలో పర్యటించనున్న నేపథ్యంలో అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగిందని ముఖ్యమంత్రి ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ తలశిల రఘురాం, జిల్లా కలెక్టర్ బసంత్ కుమార్ లు పేర్కొన్నారు. సోమవారం సాయంత్రం చెన్నేకొత్తపల్లి మండల కేంద్రంలో ఈనెల 14వతేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పర్యటించనున్న నేపథ్యంలో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్, ప్రధాన వేదిక వద్ద ఏర్పాట్లను ముఖ్యమంత్రి ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ తలశిల రఘురాం, జిల్లా కలెక్టర్ బసంత్ కుమార్, ఎంపీ గోరంట్ల మాధవ్, ఎమ్మెల్యే శంకర నారాయణ, వ్యవసాయ శాఖ స్పెషల్ కమీషనర్ హరికిరణ్ తదితరులు పరిశీలించారు.


ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పర్యటన ఈ నెల 14వ తేదీ మంగళవారం ఉదయం 10:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:45 గంట వరకు చెన్నేకొత్తపల్లి మండలంలో కొనసాగనుందని, ఇందుకోసం పకడ్బందీగా ఏర్పాట్లు చేపట్టినట్లు తెలిపారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో హెలీప్యాడ్, బహిరంగ సభ వద్ద అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగిందన్నారు. హెలీప్యాడ్ నుంచి బహిరంగ సభ వద్దకు వచ్చే దారిలో అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రధాన వేదికపై రైతుల అనుభవాలను తెలుసుకుని వారితో ఇంటరాక్ట్ కావడం, పంటల బీమా మెగా చెక్ పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి గారు పాల్గొంటారని, ఇందుకోసం అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆదేశించారు. ముఖ్యమంత్రి ప్రయత్నంలో పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ముఖ్యమంత్రి పర్యటన విజయవంతం చేసేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇంచార్జి జాయింట్ కలెక్టర్ నవీన్, ధర్మవరం ఆర్డీఓ వరప్రసాద్, వివిధ శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.Comments