నేడు (29.07.2021, శుక్రవారం) వరసగా మూడో ఏడాది వైఎస్సార్‌ కాపు నేస్తం


అమరావతి (ప్రజా అమరావతి);


*నేడు (29.07.2021, శుక్రవారం) వరసగా మూడో ఏడాది వైఎస్సార్‌ కాపు నేస్తం*


*కాకినాడ జిల్లా గొల్లప్రోలులో కంప్యూటర్‌ బటన్‌ నొక్కి నేరుగా లబ్దిదారుల ఖాతాల్లో జమ చేయనున్న సీఎం శ్రీ వైఎస్‌ జగన్‌*


*రాష్ట్రవ్యాప్తంగా కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాలకు చెందిన అర్హులైన 3,38,792 మంది పేద అక్కచెల్లెమ్మలకు రూ. 508.18 కోట్ల ఆర్ధిక సాయం*


*మ్యానిఫెస్టోలో ఇచ్చిన మాట ప్రకారం కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాల పేద అక్కచెల్లెమ్మల ఆర్ధికాభివృద్ది, జీవన ప్రమాణాలు పెంచడమే లక్ష్యంగా వరసగా మూడో ఏడాది వైఎస్సార్‌ కాపు నేస్తం*


*ప్రభుత్వ పథకాల్లో ఎక్కడా వివక్ష, అవినీతికి తావులేకుండా అర్హత ఉంటే చాలు...పథకం వర్తించేలా అమలుచేస్తున్న ప్రభుత్వం. కులం, మతం, రాజకీయాలు, పార్టీలు చూడమంటూ సీఎం శ్రీ వైఎస్‌ జగన్‌ ప్రతీ సమావేశంలోనూ చెబుతున్నారు, అదే ఆచరిస్తున్నారు*. 


*వైఎస్సార్‌ కాపు నేస్తం ద్వారా 45 నుంచి 60 ఏళ్ళ లోపు ఉన్న కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాలకు చెందిన పేద అక్కచెల్లెమ్మలకు ఏటా రూ. 15 వేల చొప్పున 5 ఏళ్ళలో మొత్తం రూ. 75,000 ఆర్దిక సాయం అందిస్తున్న శ్రీ వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం*


*అర్హులైన పేద కాపు అక్కచెల్లెమ్మలకు నేడు అందిస్తున్న రూ. 508.18 కోట్లతో కలిపి ఇప్పటివరకు కేవలం వైఎస్సార్‌ కాపు నేస్తం క్రింద అందించిన మొత్తం లబ్ధి రూ. 1,491.93 కోట్లు. తద్వారా ఒక్కో పేద కాపు అక్క,చెల్లెమ్మకు ఈ మూడేళ్ళలో అందించిన ఆర్ధిక సాయం అక్షరాలా రూ. 45,000*


*గత ప్రభుత్వ హయాంలో కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాలకు వివిధ రూపాల్లో ఇచ్చింది సగటున ఏడాదికి కేవలం రూ. 400 కోట్లు కూడా లేని దుస్ధితి, కానీ శ్రీ వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం మూడేళ్ళలోనే వివిధ పథకాల ద్వారా 70,94,881 మంది కాపు కులాల అక్కచెల్లెమ్మలకు, అన్నదమ్ములకు దాదాపు 27 రెట్లు ఎక్కువగా అంటే మొత్తం రూ. 32,296.37 కోట్ల లబ్ది చేకూర్చింది*


*ఆర్ధికంగా, సామాజికంగా, రాజకీయంగా కాపుల బలోపేతం కోసం విశేష కృషి, సామాజిక సమతుల్యత పాటిస్తూ కాపులకు ఒక డిప్యూటీ సీఎంతో సహా, ఏకంగా 4 మంత్రి పదవులు కేటాయింపు*


*అన్ని నామినేటెడ్‌ పదవులు, స్ధానిక సంస్ధలలో కాపు వర్గాలకు తగు ప్రాధాన్యత*


*మ్యానిఫెస్టోలో ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ కాపుల సంక్షేమం కోసం ఇప్పటివరకూ కేవలం మూడేళ్ళలో రూ. 32,296 కోట్ల లబ్ధి చేకూర్చిన శ్రీ వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం*


*కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాల సంక్షేమం కోసం వివిధ పథకాల ద్వారా అందించిన లబ్ధి*


*డైరెక్ట్‌ బెనిఫిట్‌ ట్రాన్స్‌ఫర్‌ (డీబీటీ) ద్వారా మూడేళ్ళలో లబ్ధిపొందిన లబ్ధిదారుల వివరాలు – లబ్ధిదారుల సంఖ్య 57,69,237 మందికి గాను అందిన లబ్ధి రూ. 16,256.44 కోట్లు. నాన్‌ డీబీటీ ద్వారా మూడేళ్ళలో లబ్ధిపొందిన లబ్ధిదారుల వివరాలు – లబ్ధిదారుల సంఖ్య 13,25,644 మందికి గాను అందిన లబ్ధి రూ. 16,039.93 కోట్లు. మొత్తం డీబీటీ, నాన్‌ డీబీటీ కలిపి లబ్ధిదారుల సంఖ్య 70,94,881 కు గాను రూ. 32,296.37 కోట్ల లబ్ధి*.


*గత ప్రభుత్వ ఐదేళ్ల పాలనలో అనేక పథకాలు అమలుచేయకపోగా, చేసినవి కూడా చాలీచాలని విధంగా అరకొర సాయం, కోటాలు, కోతలతో వీలైనంతమందికి ఎగ్గొట్టిన వైనం*.

Comments