విజయవాడ,రాజమహేంద్రవరం నగరాలు సుందరీకరణపై సిఎస్ సమీక్ష

 విజయవాడ,రాజమహేంద్రవరం నగరాలు సుందరీకరణపై సిఎస్ సమీక్ష


అమరావతి,జూలై 1 (ప్రజా అమరావతి):పైలెట్ ప్రాజెక్టుగా విజయవాడ,రాజమహేంద్రవరం నగరాల పరిధిలో సాలిడ్ మరియు లిక్విడ్ వేస్ట్ ల నిర్వహణ,కాలువల సుందరీకరణ అంశాలపై శుక్రవారం అమరావతి సచివాలయం మొదటి బ్లాకు సిఎస్ సమావేశ మందిరంలో సిఎస్ డా.సమీర్ శర్మ సంబంధిత అధికారులతో సమీంచారు.ఈసందర్భంగా ఈరెండు నగరాల పరిధిలో సిటీ బ్యూటిఫికేషన్ అంశాలకు సంబంధించి పలు విషయాలను అధికారులతో ఆయన సమీక్షించారు.అలాగే వివిధ కాలువల సుందరీకరణ పనులకు సంబంధించి చర్చించారు.

ఈసమావేశంలో రాష్ట్ర పురపాలక శాఖ కమీషనర్ మరియు డైరెక్టర్ ప్రవీణ్ కుమార్,క్లీన్ కృష్ణా గోదావరి సంస్థ ఎండి కె.భాస్కర్ పాల్గొనగా వీడియో లింగ్ ద్వారా టిఆర్అండ్బి మరియు ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి యంటి.కృష్ణబాబు,స్వచ్చాంధ్రప్రదేశ్ ఎండి సంపత్ కుమార్ ఇతర అధికారులు పాల్గొన్నారు.

      

Comments