ఆప్కోస్ లో నియామకాలు పారదర్శకం.. నకిలీ అపాయింట్ మెంట్ ఆర్డర్లు చూసి యువత మోసపోవద్దు

 


విజయవాడ (ప్రజా అమరావతి);


*ఆప్కోస్ లో నియామకాలు పారదర్శకం.. నకిలీ అపాయింట్ మెంట్ ఆర్డర్లు చూసి యువత మోసపోవద్దు* 

- *ఆప్కోస్ ఎండీ జి. వాసుదేవరావు*.


నిరుద్యోగ యువతను టార్గెట్ చేసి కొందరు మోసగాళ్లు ఆప్కోస్ పేరుతో నకిలీ అపాయింట్‌మెంట్ ఆర్డర్లు ఇచ్చి డబ్బులు వసూలు చేస్తున్నారని, అలాంటి మోసగాళ్లపై యువత అప్రమత్తంగా ఉండాలని ఆప్కోస్ మేనేజింగ్ డైరెక్టర్ జి. వాసుదేవరావు మంగళవారం ఒక ప్రకటనలో కోరారు. 

అనంతపురం జిల్లాలో ఈ తరహా మోసానికి పాల్పడిన ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారన్నారు. విజయనగరం, కడప, కర్నూలు ప్రాంతాల్లో కూడా నకిలీ లేఖలు తమ దృష్టికి వచ్చాయని, రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద రాకెట్ నడుస్తున్నట్లు కనిపిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆప్కోస్ నియామకాలు అత్యంత పారదర్శకంగా జిల్లా స్థాయిలో జిల్లా కలెక్టర్ల ద్వారా మాత్రమే జరుగుతాయన్నారు. అటువంటి నియామకాలలో దళారీలు గానీ, ఇతర వ్యక్తుల ప్రమేయం గానీ ఏమీ ఉండదని తెలిపారు. డబ్బు చెల్లిస్తే ఔట్‌సోర్సింగ్ లో అపాయింట్‌మెంట్ ఇస్తామని వాగ్దానం చేసే ఏ వ్యక్తిని యువత నమ్మవద్దని, అలాంటి వారిపట్ల అప్రమత్తంగా ఉండాలని కోరారు. నకిలీ నియామక పత్రాలను నమ్మితే ఆర్థికంగా నష్టపోవాల్సివస్తుంది కాబట్టి సంబంధిత ప్రక్రియ ఎంతవరకు సరిగ్గా ఉందో సరిచూసుకొని ముందుకు సాగాలని ఆయన పేర్కొన్నారు. Comments