రానున్న రోజుల్లో నెల్లూరు జిల్లా ముఖచిత్రం సమూలంగా మారుతుంది

 

నెల్లూరు జూలై 21 (ప్రజా అమరావతి);విభజిత ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో విశాఖపట్నం తర్వాత నెల్లూరుకు మాత్రమే పారిశ్రామికంగా అభివృద్ధి చెందడానికి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని, రానున్న రోజుల్లో నెల్లూరు జిల్లా ముఖచిత్రం సమూలంగా మారుతుంద


ని రాష్ట్ర పరిశ్రమలు, మౌలిక సదుపాయాలు, ఐ టి  శాఖామాత్యులు శ్రీ గుడివాడ అమర్ నాథ్ అన్నారు. 


గురువారం ఉదయం నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని ఆటోనగర్లో మౌలిక సదుపాయాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాష్ట  వ్యవసాయ శాఖా మాత్యులు శ్రీ కాకాణి  గోవర్ధన్ రెడ్డి తో కలసి పరిశ్రమల శాఖ మంత్రి పాల్గొన్నారు. 22 కోట్ల రూపాయల నిధులతో ఆటోనగర్ లో సిమెంటు రోడ్లు, డ్రైనేజీ కాలువల నిర్మాణ పనులను ప్రారంభోత్సవం చేసే శిలాఫలకంను మంత్రి అమర్ నాధ్  ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటుచేసిన బహిరంగ సభలో మంత్రి అమర్నాథ్ మాట్లాడుతూ, నియోజకవర్గ అభివృద్దే ధ్యేయంగా పనిచేస్తూ, నిత్యం ప్రజలతో మమేకమవుతూ, ప్రజా సమస్యలపై పోరాడే  శ్రీ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నెల్లూరు రూరల్ నియోజకవర్గ శాసనసభ్యులు గా ఉండటం ఇక్కడి ప్రజల అదృష్టమన్నారు. ఎన్నో ఏళ్ల క్రితం ఏర్పడినప్పటికీ, మౌలిక వసతులు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఆటోనగర్ కు ఒకేసారి 22 కోట్ల రూపాయల నిధులు సాధించటం మామూలు విషయం కాదన్నారు. అయిలా నిధుల విషయంలో కార్మికులు చెల్లించాల్సిన వాటా 35 శాతం నుండి 15 శాతం వరకూ తగ్గించేలా తగు చర్యలు తీసుకుంటామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతుందన్నారు. నెల్లూరు జిల్లా ప్రజల దశాబ్దాల కల అయినటువంటి రామాయపట్నం పోర్టును నిన్ననే గౌరవ ముఖ్యమంత్రి చేతుల మీదగా శంకుస్థాపన జరిగిందని, రాబోవు మూడు సంవత్సరాల్లో ఆ ప్రాంతం పారిశ్రామికంగా అభివృద్ధి చెంది ఘనమైన వృద్ధి సాధిస్తుందన్నారు. అదేవిధంగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మాత్యులు శ్రీ కాకాణి గోవర్ధన్ రెడ్డి నుండి తాను ఎంతో నేర్చుకున్నానని, గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు శాసనసభలో చేసిన ప్రసంగాలు, వ్యవహరించే తీరు తనకు మార్గదర్శకమన్నారు.


ఈ సందర్భంగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మాత్యులు శ్రీ కాకాణి గోవర్ధన్ రెడ్డి  మాట్లాడుతూ ఆటోనగర్ ప్రాంతంలో ఎన్నో ఏళ్లుగా సరైన మౌలిక వసతులు లేక కార్మికులు, ప్రజలు ఇబ్బందులు పడ్డారని, అధికారంలోకి వచ్చిన వెంటనే నిధుల కోసం పోరాడి 22 కోట్ల రూపాయలు సాధించి రోడ్లు డ్రైనేజీ పనులు పూర్తిచేయడం ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి కే  సాధ్యమ న్నారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి స్ఫూర్తి ప్రదాత  శ్రీధర్ రెడ్డి గారని అన్నారు. సమస్యలను గుర్తించి, నిధుల కోసం పోరాటం చేసే వ్యక్తి శ్రీధర్ రెడ్డి గారని వారి సేవలను కొనియాడారు. కరోనా కష్టకాలంలో కార్మిక కుటుంబాలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా వారికి ఆర్థికంగా అండగా నిలిచిన వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారని అన్నారు. అధికారంలో ఉన్నప్పుడు రైతులను మోసం చేసి, ఇప్పుడు రైతు దగా పేరు తో సభలు పెట్టడం ప్రతిపక్ష పార్టీ కే చెల్లిందన్నారు.


ఈ కార్యక్రమానికి సభాధ్యక్షత వహించిన నెల్లూరు రూరల్ శాసనసభ్యులు శ్రీ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ 46 ఏళ్ల క్రితం ఏర్పడి, 15 వేల కుటుంబాలకు జీవనాధారమైన ఆటోనగర్ అభివృద్ధికి తన సాయశక్తులా కృషి చేస్తానన్నారు. దివంగత మంత్రి శ్రీ మేకపాటి గౌతమ్ రెడ్డి ఎంతో సహాయ సహకారాలు అందించారని గుర్తు చేసుకున్నారు. ఆటోనగర్లో విశ్రాంతి భవనం పార్టు నిర్మాణానికి తన సొంత నిధులు 5 లక్షలు అందిస్తానని, కార్మిక సోదరులందరూ ముందుకు వచ్చి తమ వంతు కృషి చేయాలన్నారు. ప్రస్తుత వ్యవసాయ మార్కెటింగ్ శాఖ మంత్రి శ్రీ గోవర్ధన్ రెడ్డి 12 కోట్ల నిధులు మంజూరు చేశారని, త్వరలోనే ఆయా పనులు ప్రారంభిస్తామని మంత్రికి తమ  కృతజ్ఞతలన్నారు.


ఈ కార్యక్రమంలో శాసన మండలి సభ్యులు బల్లి కళ్యాణ్ చక్రవర్తి, నెల్లూరు నగర మేయర్ శ్రీమతి స్రవంతి జయ కిషోర్, జిల్లా జాయింట్ కలెక్టర్ రోణంకి కూర్మనాథ్, నెల్లూరు మున్సిపల్ కమిషనర్ జాహ్నవి, స్థానిక కార్పొరేటర్ డాక్టర్ సత్తార్, ఆటోనగర్ కార్మిక నాయకులు తదితరులు పాల్గొన్నారుComments