జగన్మోహనరెడ్డి గారి జనరంజక పాలనకు జనామోదం !!* --- మంత్రి శ్రీ జోగి రమేష్


మచిలీపట్నం : 23 జూలై (ప్రజా అమరావతి);


*జగన్మోహనరెడ్డి గారి  జనరంజక  పాలనకు జనామోదం !!*

   --- మంత్రి శ్రీ జోగి రమేష్ రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి పథకాలు ఒకవైపు, సంక్షేమ పథకాలు మరోవైపు ప్రజల్లోకి తీసుకెళ్తూ ప్రభుత్వం జోడు గుర్రాల స్వారీ చేస్తోందని, ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి  జనరంజక పాలనకు జనామోదం మెండుగా ఉందని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ తేల్చి చెప్పారు.   


        కృష్ణాజిల్లా పెడన నియోజకవర్గంలో పెడన టౌన్ పరిధిలో 22 వ వార్డు, 23 వ వార్డు వైఎస్సార్ కాలనీలో శనివారం వర్షం చిరుజల్లులు  వివిధ లబ్ధిదారుల హర్షం సాక్షిగా  రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ శనివారం ఉదయం 8 గంటల సమయంలో ప్రజల ముంగిటకు వెళ్లారు రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 

 "గడప గడపకు మన ప్రభుత్వం" కార్యక్రమంలో భాగంగా పర్యటిస్తున్న ప్రజా ప్రతినిధులకు, అధికారులకు ప్రతి ఇంటి వద్ద ప్రజల నుంచి ప్రేమపూర్వక స్వాగతం లభిస్తోంది. 

 

        సామాన్యునికి ఇక ప్రభుత్వ పథకాలు మరింత సులభతరంగా అందే అవకాశాలు ప్రస్తుత ప్రభుత్వంలో దక్కడం, వాటి అమలుతీరు గూర్చి వాకబు చేస్తూ తమ ఇంటి చేరువగా రావడంతో స్థానికులు  సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. పార్టీలకు అతీతంగా అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందాలని ముఖ్యమంత్రి మహోన్నత సంకల్పానికి , మీకు మా ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయని పెద్ద ఎత్తున ప్రజలు దీవిస్తున్నారు.

        

             తొలుత పెడన 22 వ వార్డు బ్రహ్మపురం,  వైఎస్సార్ కాలనీ  ( 23 వ వార్డు ) లో తదితరుల ప్రతి ఇంటికి మంత్రి జోగి రమేష్ వెళ్లి వాకా భద్రమ్మ, బొప్పె గౌరమ్మ, నల్లా అక్క నాగమ్మ, యెర్రా శ్యామలాంబ, రుద్రాక్షుల సూరమ్మ, గుమ్మళ్ల అమ్మాజీ, వాసా సురేఖ తదితరులను పలకరిస్తూ, సంక్షేమ పథకాలు ఏమేమి అందుతున్నాయో తెలుసుకుంటూ, ప్రజల కష్టాలను ఓపిగ్గా వింటూ  మంత్రి జోగి రమేష్ ముందుకు నడిచారు .


        కొలుకుల ధనలక్ష్మి అనే మహిళ మంత్రి జోగి రమేష్ కు , ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపింది. తన భర్త కొలుకుల జ్ఞాన ఉదయేశ్వర్ 24 ఏళ్ళ క్రితం చనిపోయారని,  కుమార్తె గీతా మాధురి,  కుమారుడు బాలనేత్రితో పుట్టింటికి వచ్చి తన తల్లి సోమేశ్వరమ్మ  వద్ద మగ్గం పని చేస్తూ జీవనం  కొనసాగిస్తున్నట్లు చెప్పి, తనకు నెల నెల వితంతు పింఛన్ ఇంటికి వచ్చి వాలింటీర్లు అందిస్తున్నారని, తన కష్టార్జితంకు తోడు ప్రభుత్వ సహాయం తమ జీవన స్థితిగతులను మార్చివేసిందని సంతృప్తి వ్యక్తం చేశారు.  తన కూతుర్ని ఎం.కామ్ చదివించానని అన్నారు. ఆ తర్వాత  కుమార్త పెళ్లి ఎలా చేయాలో అని నిత్యం దిగులుచెందుతూ ఉండేదాన్నని ఆ పరిస్థితులలో తనకు నేతన్న నేస్తం 72 వేల రూపాయలు, చేయూత 37, 500 రూపాయలు, ఆసరా 18, 700,  డ్వాక్రా  పావలా వడ్డీ సొమ్ము  అందడంతో తానూ దాచుకొన్న డబ్బు, జగనన్న అందించిన ఆర్ధిక సహాయంతో కూతురు పెళ్లి ఘనంగా చేశానని తనను ఆదుకున్న ఈ ప్రభుత్వానికి సదా రుణపడి ఉంటానని ధనలక్షి తన విశ్వాసాన్ని ప్రకటించింది. అనంతరం పలువురు వంటరి మహిళలు మంత్రిని కలిసి తమ కష్టాన్నిచెప్పుకొన్నారు. తమకు ఆర్థిక స్తోమత్తు లేకపోవడంతో జగనన్న కాలనీలో ఇళ్ల స్థలాలు మంజూరైన వాటిని నిర్మించుకోలేని పరిస్థితులలో ఉన్నామని మంత్రి దృష్టికి తీసుకువచ్చారు.  ఈ విషయమై స్పందించిన ఆయన హోసింగ్ ఏ ఈ , మునిసిపల్ కమీషనర్ , రెవిన్యూ సిబ్బందిని పిలిపించి మీ అధికారులంతా చక్కని సమన్వయంతో వంటరి మహిళలను ఒక గ్రూప్ గా ఏర్పరచి వారికి గృహాలను నిర్మించి ఇవ్వాలని మంత్రి జోగి రమేష్ ఆదేశించారు. అలాగే, బట్టా వీర పైడయ్య అనే స్థానికుడు మంత్రికి తన ఆరోగ్య సమస్యను తెలిపాడు. గుండె జబ్బు, నరాల వ్యాధితో కొంతకాలంగా బాధ పడుతున్నట్లు తనకు మెరుగైన వైద్యం అందించాలని అభ్యర్ధించారు. స్పందించిన మంత్రి జోగి రమేష్ తన వ్యక్తిగత కార్యదర్శి శ్రీనివాస్ ను పిలిచి వీర పైడయ్య వివరాలు తీసుకోవాలని నిపుణుడైన కార్డియాలజిస్ట్ , న్యూరాలజిస్ట్ వద్ద చికిత్స చేయిద్దామని సూచించారు. పిచ్చుక బాబురావు అనే నేత కార్మికుడు మంత్రి వద్ద తన బాధలను చెప్పుకొన్నారు. తన భార్య మాలతి అనారోగ్యం కారణంగా చనిపోయిందని ఆమెకు సేవ చేస్తూ తన కుమార్తె నాగ పైడేశ్వరి ఇంటర్ తప్పిందని తన కుటుంబాన్ని ఆదుకోవాలని అబ్యర్ధించారు. బూసం వీర భోగేశ్వరావు అనే మరో నేత కార్మికుడు మంత్రికి తన ఇబ్బందిని చెప్పుకొన్నారు. తన వయస్సు ప్రస్తుతం 62 సంవత్సరాలని తన తొమ్మిదవ ఏట నుంచి నేత పని చేస్తున్నానని ప్రభుత్వం ఇంత పెద్ద ఎత్తున పేదలకు సహాయం చేయడం తానెన్నడూ చూడలేదని తనకు పింఛన్ వస్తుందని, ఇంటి స్థలం సైతం మంజూరైందని ఇంత మేలు చేసిన ముఖ్యమంత్రికు , మీకు నా కృతఙ్ఞతలు మనస్ఫూర్తిగా తెలియచేస్తున్నట్లు తెలిపారు.            

           

         ఈ కార్యక్రమంలో  పెడన మునిసిపల్ ఛైర్మెన్ బళ్ళా జ్ఞాన లింగ జ్యోత్స్నా రాణి,  23 వ వార్డు  కౌన్సిలర్ ఉమ్మి ట తనూజ  3 వ వార్డు కౌన్సిలర్  బళ్ళా గంగయ్య, పెడన తహసీల్దార్ మధుసూదన రావు, పెడన మునిసిపల్ కమీషనర్ ఎం. అంజయ్య, పెడన మునిసిపాలిటీ ఫ్లోర్ లీడర్ కటకం ప్రసాద్, కటకం నాగకుమారి, హోసింగ్  డి ఈ   ఏ శ్రీనివాసరావు , హ్యాండ్లూమ్, టెక్స్టైల్ డెవలోప్మెంట్ అధికారి  కె. సూరిబాబు,  మాజీ ఎంపిపి రాజులపాటి అచ్యుతరావు,మార్కెట్ యార్డ్ వైస్ ఛైర్మెన్  మెరుగుమాల వీర వెంకటేశ్వరరావు, 17 వ వార్డు కౌన్సిలర్ మెట్ల గోపి ప్రసాద్, వైస్సార్ సీపీ పెడన పట్టణ అధ్యక్షులు బండారు మల్లిఖార్జునరావు, ఆహార సలహా కమిటీ ఛైర్మెన్ హనీఫ్ ఖాన్, మండల సర్పంచుల సంఘం అధ్యక్షుడు దాన భైరవ లింగం స్థానిక ప్రజా ప్రతినిధులు , వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ,కార్యకర్తలు,వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది, ఏఎన్ఎంలు  తదితరులు పాల్గొన్నారు. 

             

Comments