రామచంద్రపురం (ప్రజా అమరావతి);
గోదావరి వరద ముంపుకు గురైన మత్స్యకార కుటుంబాలకు నిత్యా వసరవసర సరుకులు పంపిణీ చేసిన రాష్ట్ర బీసీ సంక్షేమం సినిమాటోగ్రఫీ సమాచార పౌర సంబంధాల శాఖ మాత్యులు చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ:-
రామచంద్రపురం నియోజకవర్గం కె గంగవరం మండలం కోటిపల్లి గ్రామంలో ముంపుకు గురైన మత్స్యకార కుటుంబాలకు బియ్యం కందిపప్పు మంచి నూనె మొదలైన నిత్యావసర సరుకులు ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ముంపు బాధిత కుటుంబాలకు మంత్రివర్యులు నేరుగా నాటు పడవ ద్వారా ఇంటింటికి వెళ్లి స్వయంగా నిత్యా వసర సరుకులు అందించారు ఈ సందర్భంగా ఆయన మత్స్యకార కుటుంబాల యోగక్షేమాలను అడిగి తెలుసుకుని నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా మీకు అండగా ఆసరాగా ఉంటుందని భరోసాని కల్పించారు. గోదావరి వరద ముంపు తగ్గే వరకు ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాల
ని ప్రభుత్వం యంత్రాంగం సూచనలు పరిగణన లో తీసుకుని స్వచ్ఛందంగా సహకరించాలని ఆయన సూచించారు. ముంపు బాధితుల సౌకర్యార్థం 24 గంటలు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి పూర్తిగా సహకారం అందించడంతోపాటు పునారావాసం కల్పిస్తుందని ముంపు బాధిత కుటుంబాల వారు ప్రభుత్వ యంత్రాంగం కల్పించిన సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన విన్నవించారు .వైద్యులు సూచనల పరిగణనలోకి తీసుకొని సీజనల్ వ్యాధులు ప్రబలకుండా సురక్షితంగా ఉండాలని ముంపు బాధితులకు సూచించారు. ఈ సందర్భంగా స్థానికంగా ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంపు ను సందర్శించి అందించే వైద్య సేవలు గురించి ఆరా తీశారు. ఈ సందర్భంగా మంత్రివర్యులు మాట్లాడుతూ అధికార యంత్రాంగం వరదల నేపథ్యంలో పూర్తి సమన్వయంతో పనిచేసి పౌర జీవనానికి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఒకవైపు పునరావాస కార్యక్రమాలు చేపట్టీ, మరో వైపు ప్రాణ ఆస్తి నష్టాలకు తావు లేకుండా అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో వైద్యనాథ్ శర్మ, ఎంపిడిఓ శ్రీనివాస్, గ్రామ సర్పంచ్ బేబీ సత్తిబాబు, జడ్పిటిసి శ్రీ వరలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.
addComments
Post a Comment