శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి


 శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి


(ప్రజా అమరావతి):  

    ఆషాడ మాసం సంధర్భంగా దేవస్థానం నందు శ్రీ అమ్మవారికి పవిత్ర సారె సమర్పించు కార్యక్రమంలో భాగంగా  ఈరోజు ఆలయ అన్నదాన విభాగపు సిబ్బంది, ఆర్యవైశ్య సంఘం, విజయవాడ వారి బృందం 300 మంది, జి.చంద్రశేఖర్ గారి బృందం 250 మంది, అపరాజిత సేవా బృందం 200 మంది, ఎన్. రత్నం గారి బృందం 101 మంది, E. రమణ గారి బృందం 80 మంది మరియు వివిధ ప్రాంతాలకు చెందిన పలు బృందముల వారు శ్రీ కనకదుర్గ అమ్మవారికి సారె సమర్పించుటకు విశేషముగా విచ్చేసిన సందర్భంగా వారందరికీ ఆలయ అధికారులు స్వాగతం పలికి ప్రత్యేక క్యూలైన్ ద్వారా శ్రీ అమ్మవారి దర్శనం ఏర్పాటు చేయడం జరిగినది.


 అనంతరం మహామండపం 6వ అంతస్తు నందు దేవస్థానం వారు ఏర్పాటు చేసిన అమ్మవారి ఉత్సవ విగ్రహం వద్ద పూజలు నిర్వహింపజేసి, అందరికీ ఆశీర్వాదం అందజేయడం జరిగినది.

Comments