నరసరావుపేటలో అట్టహాసంగా 76వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

 నరసరావుపేటలో అట్టహాసంగా 76వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు పల్నాడు జిల్లా, 15 ఆగస్టు,  (ప్రజా అమరావతి) : పల్నాడు జిల్లా డీ.ఎస్.ఏ క్రీడా స్టేడియంలో 76 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. ఆగస్టు 15 స్వతంత్ర దినోత్సవ వేడుకలకు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ, జిల్లా ఇన్ చార్జి మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు ముఖ్యఅతిథిగా హాజరై జాతీయ జెండాను ఎగురవేశారు. జిల్లా కలెక్టర్ శివ శంకర్ లోతేటి, జిల్లా ఎస్పీ రవిశంకర్ రెడ్డిలు వేడుకలను వైభవంగా నిర్వహించడంలో విశేషంగా కృషి చేశారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక వాహనంపై రాష్ట్రమంత్రి వెంకట నాగేశ్వరరావు, జిల్లా కలెక్టర్ శివశంకర్ లోతేటి, జిల్లా ఎస్పీ రవిశంకర్ రెడ్డి లు పోలీస్ గౌరవ వందనం స్వీకరించడంతోపాటు స్టాల్స్ ను సందర్శించారు. సందర్భంగా జిల్లా ఇన్చార్జి మంత్రి వెంకట నాగేశ్వరరావు జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వ అమలు చేస్తున్న సంక్షేమ పథకాల వివరాలపై ప్రత్యేక సందేశం అందించారు. జాతీయ ప్రత్యేక వర్ణంలో ఉన్న బెలూన్లను ఆకాశంలోనికి  ఎగురవేశారు. కార్యక్రమంలో భాగంగా స్వాతంత్రం కోసం పల్నాడు జిల్లా నుంచి పోరాటం చేసిన స్వాతంత్ర్య సమర యోధుల కుటుంబాలు, దేశ రక్షణ లో ప్రాణాలర్పించిన ఆర్మీ అధికారి, సిపాయిల కుటుంబ సభ్యులను పరామర్శించి ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో భాగంగా స్వాతంత్ర సమరయోధుల చరిత్ర తెలిపే శకటాలు, రాష్ట్ర ప్రభుత్వ అమలు చేస్తున్న సంక్షేమ పథకాల శకటాల ప్రదర్శన అతిధులు, సందర్శకులను విశేషంగా ఆకట్టు కున్నాయి. జిల్లా ప్రగతి ఉట్టిపడేలా శతకాల రూపకల్పన చేసిన తీరు, ప్రదర్శన ఆకర్షింప చేసింది. వ్యవసాయ అనుబంధ శాఖలు, వైయస్సార్ సంచార పశు ఆరోగ్య సేవ, పౌరసరఫరాలు -ప్రజా పంపిణీ వ్యవస్థ, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, గ్రామీణ నీటి సరఫరా, పారిశుధ్యం, విద్యాశాఖ విభాగంలో (నాడు-నేడు), గ్రామ వార్డు సచివాలయాల వ్యవస్థ, వైద్య ఆరోగ్యశాఖ, గృహ నిర్మాణ సంస్థ, పరిశ్రమలు, వాణిజ్యం, ఎగుమతులు, ప్రోత్సాహకాలు శకటాలను జిల్లా అధికారులు ప్రదర్శించారు. అనంతరం జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలలో నాదెండ్ల మండలం చీకటి వారి పాలెం, ఏపీ మోడల్ స్కూల్ విద్యార్థులు పల్నాడు థీమ్ సాంగ్ కు అత్యద్భుతమైన నృత్య ప్రదర్శన చేశారు. నెమలి పూడి జడ్పీ పి హై స్కూల్ విద్యార్థులు, నరసరావుపేట సెయింట్ జోసెఫ్ స్కూల్ విద్యార్థులు, వినుకొండ గీతం స్కూల్ విద్యార్థులు, నాదెండ్ల మండలం కేజీబీవీ స్కూల్ విద్యార్థినీలు, నరసరావుపేట లింగం గుంట్ల శంకర భారతి పురం హైస్కూల్ విద్యార్థులు చేసిన నృత్య ప్రదర్శనలు అందరినీ విశేషంగా ఆకట్టుకొని, ఆలోచింపచేసాయి. కార్యక్రమం అనంతరం నూతన జిల్లా ఏర్పాటు తర్వాత పల్నాడు జిల్లా అభివృద్ధికి విశేషంగా కృషిచేసి సేవలందించిన పలువురు జిల్లా అధికారులు, సిబ్బందికి ప్రశంసా పత్రాలను రాష్ట్ర పౌరసరఫరాల శాఖ, జిల్లా ఇన్చార్జి మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు, జిల్లా కలెక్టర్ శివ శంకర్ లో తేటి, జిల్లా ఎస్పీ రవిశంకర్ రెడ్డి, నరసరావుపేట నియోజకవర్గం శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, గురజాల నియోజకవర్గ శాసనసభ్యులు కాసు మహేష్ రెడ్డిలు అందజేశారు. ఆజాది కా అమృత్ మహోత్సవం సందర్భంగా 75 సంవత్సరాల స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పూర్తి చేసుకున్న సందర్భంగా ఆగస్టు 1 నుండి 15 వరకు జరిగిన పలు కార్యక్రమాలు, పోటీలను జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. విజేతలకు ఈ సందర్భంగా ప్రశంసాపత్రాలను అనంతరం వేడుకల సమీపంలో ఏర్పాటు చేసిన ప్రభుత్వ స్టాళ్లను రాష్ట్ర మంత్రి, జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ, జిల్లాజాయింట్ కలెక్టర్, నరసరావుపేట నియోజకవర్గ శాసనసభ్యులు, గురజాల నియోజకవర్గ శాసనసభ్యులు సందర్శించారు. వేడుకల్లో సాంస్కృతిక కార్యక్రమాలలో అద్భుత ప్రతిభ కనబరిచిన ఆయా స్కూళ్ల విద్యార్థిని విద్యార్థులకు బహుమతులు, ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా పోలీస్ శాఖ, ప్రభుత్వ శాఖలకు సంబంధించిన జిల్లా అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. Comments