శ్రీవారి అభిషేక సేవతో పులకించిన నెల్లూరు భక్తజనం

   నెల్లూరు,  ఆగ‌స్టు 19 (ప్రజా అమరావతి);


శ్రీవారి అభిషేక సేవతో పులకించిన నెల్లూరు భక్తజనం
నెల్లూరులో ఎసి సుబ్బారెడ్డి  స్టేడియంలో  టిటిడి నిర్వహిస్తున్న  శ్రీవేంకటేశ్వర వైభవోత్సవాల్లో నాల్గవ రోజైన శుక్రవారం శ్రీవారికి  అభిషేక సేవ నిర్వహించారు . స్వామి వారికి జరిగే  అభిషేక సేవ చూసిన భక్తులు పులకించిపోయారు. 


        శ్రీవారి నమూనా ఆలయంలో ఉదయం 6 గంటలకు సుప్రభాతం, ఉదయం 6.30 నుంచి 7.30 గంటల వరకు తోమాలసేవ, కొలువు, ఉదయం 7.30 నుంచి 8.15 గంటల వరకు అర్చన, ఉదయం 8.15 నుంచి 8.30 గంటల వరకు నివేదన, శాత్తుమొర నిర్వహించారు. ఉదయం 8.30 నుంచి 10 గంటల వరకు అభిషేకం నిర్వహించారు .


అభిషేకం ప్రాశస్యం 


తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారి మూలమూర్తికి ప్రతి శుక్రవారం తెల్లవారుజామున అభిషేకం జరుపుతారు .

    భగవద్రామానుజుల వారు శ్రీ స్వామివారి వక్షఃస్థలంలో ''బంగారు అలమేలుమంగ'' ప్రతిమను అలంకరించిన శుక్రవారం నాటితో మొదలుపెట్టి ప్రతి శుక్రవారం అభిషేకం జరిగేట్టు ఏర్పాటుచేశారట. పునుగు, కస్తూరి, జవ్వాది తదితర సుగంధ పరిమళాలతో కూడిన పవిత్రజలాలతో సుమారు గంట పాటు అభిషేకం జరుగుతుంది .

ఆ తర్వాత పసుపుతో శ్రీవారి వక్షఃస్థలమ్మీది మహాలక్ష్మికి కూడా అభిషేకం చేస్తారు .

శ్రీనివాసుని యథాతథమైన రూపాన్ని వక్షఃస్థల లక్ష్మితో కలిసి ఈ శుక్రవారాభిషేక సమయంలో మాత్రమే దర్శించేందుకు వీలవుతుంది. స్వామి వారి భక్తులు జీవితంలో ఒక్కసారైనా అభిషేకం చూసి తరించాలనుకుంటారు . ఇలాంటి భక్తుల కోరిక తీరుస్తూ నెల్లూరులో స్వామివారికి అభిషేకం జరిపారు . అభిషేకానంతరం భక్తులందరి మీద తీర్థాన్ని సంప్రోక్షించడంతో అభిషేక దర్శనం ముగిసింది.


     అనంతరం ఉదయం 10 నుంచి 10.30 గంటల వరకు రెండో నివేదన, ఉదయం 10.30 నుంచి  భక్తులకు సర్వదర్శనం కల్పించారు. 


     ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ కాకాణి గోవర్ధన్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, టిటిడి బోర్డు సభ్యులు డా.చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, న్యూఢిల్లీ స్థానిక సలహా మండలి అధ్యక్షురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి, కలెక్టర్ శ్రీ చక్రధర్ బాబు, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే శ్రీ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, తిరుమల శ్రీవారి ఆలయ ప్రధానార్చకుల్లో ఒకరైన శ్రీ వేణుగోపాల దీక్షితులు, ఆగమ సలహాదారు శ్రీ మోహనరంగాచార్యులు, అన్నమాచార్య ప్రాజెక్టు సంచాలకులు డా. ఆకెళ్ల విభీషణశర్మ, ఎవిఎస్వో శ్రీ నారాయణ, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.Comments
Popular posts
అర్హులైన వారందరికీ వర్తించేలా వైయస్సార్‌ కళ్యాణమస్తు, వైయస్సార్‌ షాదీ తోఫా.
Image
శరన్నవరాత్రి మహోత్సవాల్లో ఆరవ రోజున శ్రీ కనకదుర్గమ్మ వారు శ్రీ మహాలక్ష్మి గా దర్శనమిస్తారు.
Image
శరన్నవరాత్రి మహోత్సవాల్లో ఏడవ రోజున శ్రీ కనక దుర్గమ్మ వారు శ్రీ సరస్వతి దేవి అలంకారంలో దర్శనం ఇస్తారు.
Image
అక్టోబరు 25న ఇ–క్రాపింగ్‌ జాబితాలు సచివాలయాల్లో ప్రదర్శన, షెడ్యూల్‌ వివరించిన సీఎం.
Image
భోగాపురం గ్రీన్‌ఫీల్డ్‌ అంతర్జాతీయ విమానాశ్రయం అభివృద్ధికి సహకరించాలని కేంద్ర మంత్రిని కోరిన ముఖ్యమంత్రి.
Image