వైసిపి నేతలు పొలం ఆక్రమించారు...న్యాయం జరిగేలా సాయం చెయ్యండి.

 

*వైసిపి నేతలు పొలం ఆక్రమించారు...న్యాయం జరిగేలా సాయం చెయ్యండి.*

*చంద్రబాబును కలిసి రాయచోటి నియోజకవర్గానికి చెందిన వ్యక్తి విన్నపం*

అమరావతి (ప్రజా అమరావతి): అన్నమయ్య జిల్లా లక్కిరెడ్డి పల్లి మండలం పందిళ్ల పల్లి గ్రామానికి చెందిన కొమ్మెర గంగాధర అనే వ్యక్తి మాజీ సిఎం చంద్రబాబు నాయుడును పార్టీ కేంద్ర కార్యాలయంలో కలిశారు. రాయచోటి నియోజకవర్గానికి చెందిన గంగాధర తన 3 ఎకరాల 55 సెంట్ల  భూమిని వైసిపి నేతలు ఆక్రమించారని చంద్రబాబుకు వివరించారు. భూమి తమకు ఉచితంగా రాసి ఇచ్చేయాలని స్థానిక వైసిపి నేత ఆర్ రాజేంధర్ రెడ్డి తనను తీవ్రంగా బెదిరించారని...తాను అంగీకరించకపోవడంతో తనపై పలు మార్లు దాడి చేశారని చెప్పారు. దాడి కారణంగా తాను అసుపత్రి పాలయ్యానని...పోలీసులు కనీసం కేసు కూడా తీసుకోలేదని వివరించాడు. ఇప్పటికీ తనను పొలం లోకి రానివ్వడం లేదని....రెవెన్యూ అధికారుల నుంచి ఎస్పీ, కలెక్టర్ వరకు కలిసినా న్యాయం జరగలేదని గంగాధర్ వాపోయారు.కుటుంబంతో వచ్చి తన ఆవేదన చంద్రబాబు ముందు వెళ్లబోసుకున్నాడు. తనకు సాయం చెయ్యాలని టిడిపి అధినేత చంద్రబాబును కోరారు.

Comments