గోరంట్ల మాధవ్ కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన శిష్టా లోహిత్



 *- గోరంట్ల మాధవ్ కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన శిష్టా లోహిత్* 


 *- చంద్రబాబు, లోకేష్ లను దుర్భాషలాడితే ఊరుకోం* 

 *- ప్రజల దృష్టిని మరల్చేందుకే నీచ రాజకీయాలు* 

 *- వ్యక్తిగత విమర్శలు మానుకోకుంటే బుద్ధి చెబుతాం* *- టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి శిష్ట్లా లోహిత్* 



గుడివాడ, ఆగస్టు 11 (ప్రజా అమరావతి): ఎంపీ గోరంట్ల మాధవ్ కు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి, కార్యకర్తల సంక్షేమ నిధి కోఆర్డినేటర్ శిష్ట్లా లోహిత్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. చంద్రబాబు, లోకేష్ ను దుర్భాషలాడితే చూస్తూ ఊరుకునేది లేదని ఆయన మండిపడ్డారు. గురువారం కృష్ణాజిల్లా గుడివాడలో శిష్ట్లా లోహిత్ ఒక ప్రకటన విడుదల చేశారు. న్యూడ్ వీడియో వ్యవహారం నుండి ప్రజల దృష్టిని మరల్చేందుకే ఎంపీ గోరంట్ల మాధవ్ నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యూడ్ వీడియో వ్యవహారంలో తెలుగుదేశం పార్టీకి ఎటువంటి సంబంధం లేదన్నారు. ఆ వీడియో ఒరిజినలా, కాదా అనే విషయాన్ని ఫోరెన్సిక్ అధికారుల సహకారంతో పోలీసులే తేల్చాల్సి ఉంటుందన్నారు. అలా కాకుండా వీడియోలో ఎంపీ గోరంట్ల మాధవ్ ఉన్నారా, లేరా అనేది ఒరిజినల్ వీడియో ఉంటేనే తెలుస్తుందని పోలీసులు చెప్పడం సరికాదన్నారు. ఎంపీ గోరంట్ల మాధవ్ ఫోన్ ను పోలీసులు పరిశీలిస్తే వాస్తవాలు బహిర్గతమవుతాయని చెప్పారు. అలాగే ఎంపీ గోరంట్ల మాధవ్ తన సత్యశీలతను నిరూపించుకోకుండా ఇష్టానుసారంగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు, లోకేష్ లపై వ్యక్తిగత దూషణలకు దిగడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామన్నారు. చంద్రబాబును, లోకేష్ ను దుర్భాషలాడినంత మాత్రాన చేసిన తప్పులు సరికావని అన్నారు. చంద్రబాబు, లోకేష్ ల గురించి ఎంపీ గోరంట్ల మాధవ్ ఏది చెబితే దాన్ని నమ్మే పరిస్థితుల్లో ప్రజలు లేరన్నారు. 40 ఏళ్ళ సుదీర్ఘ రాజకీయ అనుభవం చంద్రబాబు సొంతమని అన్నారు. చంద్రబాబుకు ఉన్న విజన్ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసని చెప్పారు. రాజకీయాల్లో గెలుపు, ఓటమిలు సహజమని అన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రజల మద్దతుతో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. కుప్పంలో చంద్రబాబు, మంగళగిరిలో నారా లోకేష్ లు పోటీ చేస్తారని, వీరి విజయాన్ని అడ్డుకునే శక్తి ఎవరికీ లేదన్నారు. చంద్రబాబు, లోకేష్ ను వ్యక్తిగతంగా దుర్భాషలాడడం, విమర్శించడం మానుకోవాలన్నారు. అలా కాకుండా దుర్భాషలాలను కొనసాగిస్తే ఎంపీ గోరంట్ల మాధవ్ తో పాటు మరికొంత మంది వైసీపీ నేతలకు తగిన బుద్ధి చెబుతామని శిష్ట్లా లోహిత్ హెచ్చరించారు.

Comments