అంతర్జాతీయ స్థాయిలో భారతదేశ కీర్తి పతాకం రెపరెపలాడేలా హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని ప్రజలంతా విజయవంతం చేయాలినెల్లూరు, ఆగస్టు 8 (ప్రజా అమరావతి): అంతర్జాతీయ స్థాయిలో భారతదేశ కీర్తి పతాకం రెపరెపలాడేలా హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని ప్రజలంతా విజయవంతం చేయాలని


జిల్లా పరిషత్ సీఈవో శ్రీమతి వాణి పిలుపునిచ్చారు. 

 ఆజాదికా అమృత్ మహోత్సవాల్లో భాగంగా సోమవారం ఉదయం నగరంలోని ఆటోనగర్లో గల ఏపీ మైనారిటీ గురుకుల పాఠశాల  నుంచి అయ్యప్ప గుడి వరకు మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. 

 ఈ సందర్భంగా మైనార్టీ గురుకుల పాఠశాలలో త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించిన జడ్పీ సీఈఓ వాణి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ దేశంపై భక్తి, గౌరవం కలిగి ఉండాలని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పిలుపుమేరకు ఈనెల 13 నుంచి 15వ తేదీ వరకు జాతీయ జెండాని ప్రతి ఇంటిపై రెపరెపలాడించాలని ఆమె విద్యార్థులకు సూచించారు. 

 మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి శ్రీమతి కనక దుర్గ భవాని మాట్లాడుతూ ఎందరో దేశభక్తులు ధన, మాన, ప్రాణాలను పణంగా పెట్టి మనకు స్వాతంత్ర్యాన్ని ప్రసాదించారని, స్వాతంత్య్రం సిద్ధించి 75 వసంతాలు పూర్తి చేసుకున్న శుభవేళ ఆ మహనీయులను స్మరించుకోవడం మనందరి బాధ్యతగా పేర్కొన్నారు. హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో దేశభక్తిని పెంపొందించేలా విద్యార్థులందరూ ర్యాలీలో ఉత్సాహంగా పాల్గొనడం పట్ల ఆమె వారిని ప్రత్యేకంగా అభినందించారు. విద్యార్థులంతా  మన జాతీయ జెండాను గౌరవిస్తూ, దేశం పట్ల ప్రేమాభిమానాలు కలిగి దేశాభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు.

 ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన స్వాతంత్ర్య సమరయోధుల వేషధారణలు అందరిని ఆకట్టుకున్నాయి. 

 ఈ కార్యక్రమంలో సమగ్ర శిక్ష ఏపీసి ఉషారాణి, బీసీ వెల్ఫేర్ అధికారి వెంకటయ్య, సోషల్ వెల్ఫేర్ డిడి శ్రీమతి రమాదేవి, సెట్నల్ సీఈవో పుల్లయ్య, డిస్టిక్ యూత్ ఆఫీసర్ శ్రీ మహేంద్ర రెడ్డి, ఐసిడిఎస్ పిడి ఉమామహేశ్వరి,  ఎంఈఓ అనిల్, గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ శ్రీమతి కామేశ్వరి, హెచ్ఎంలు ఖాజారహంతుల్లా, సుశీల, ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు పాల్గొన్నారు. 

Comments
Popular posts
అర్హులైన వారందరికీ వర్తించేలా వైయస్సార్‌ కళ్యాణమస్తు, వైయస్సార్‌ షాదీ తోఫా.
Image
శరన్నవరాత్రి మహోత్సవాల్లో ఆరవ రోజున శ్రీ కనకదుర్గమ్మ వారు శ్రీ మహాలక్ష్మి గా దర్శనమిస్తారు.
Image
శరన్నవరాత్రి మహోత్సవాల్లో ఏడవ రోజున శ్రీ కనక దుర్గమ్మ వారు శ్రీ సరస్వతి దేవి అలంకారంలో దర్శనం ఇస్తారు.
Image
అక్టోబరు 25న ఇ–క్రాపింగ్‌ జాబితాలు సచివాలయాల్లో ప్రదర్శన, షెడ్యూల్‌ వివరించిన సీఎం.
Image
భోగాపురం గ్రీన్‌ఫీల్డ్‌ అంతర్జాతీయ విమానాశ్రయం అభివృద్ధికి సహకరించాలని కేంద్ర మంత్రిని కోరిన ముఖ్యమంత్రి.
Image