జ‌గ‌న్ రెడ్డి పాలనలో చేనేతల అభివృద్ధి శూన్యం - కొల్లు ర‌వీంద్ర

 


*జ‌గ‌న్ రెడ్డి పాలనలో చేనేతల అభివృద్ధి శూన్యం - కొల్లు ర‌వీంద్ర*


విజ‌య‌వాడ (ప్రజా అమరావతి):  జ‌గ‌న్ రెడ్డి నేత‌న్న నేస్తం పేరుతో హడావుడి చేయడం తప్ప ఈ మూడేళ్లలో చేనేత‌ల అభివృద్ధి శూన్యం.  తాత్కాలిక తాయిలాల‌తో చేనేత వృత్తిని చంపేస్తున్నాడు.   చేనేత‌ల‌పై జ‌గ‌న్ కు ఏమాత్రం చిత్త‌శుద్ధి వున్నా వారు శాశ్వ‌తంగా అభివృద్ధి చేందేందుకు అవ‌కాశాలు క‌ల్పించాలి.  తాయిలాలు ఇవ్వ‌డం చేనేత‌ల స‌మ‌స్య‌ల‌కు ప‌రిష్కారం కాదు.   నేత‌న్న‌ల‌కు అధునాత‌న మగ్గాలు, ఇతర యంత్రాలు అందుబాటులోకి తెచ్చి, వృత్తిలో టెక్నాల‌జీని జోడించి వారి వ్యాపారంలో నూత‌న ప‌ద్ధ‌తుల‌ను పాటించేలా ప్ర‌భుత్వం అవ‌గాహ‌న కల్పించాలి.  వ్యాపార మేళ‌కువ‌లు నేర్పించ‌డం, అవ‌స‌రమైతే ప్ర‌భుత్వ‌మే కొనుగోలు చేయ‌డం,  ముడిస‌రుకు అందుబాటులో అందించ‌డం, ముడి సరుకులను స‌బ్సిడీతో  అందించాలి. వారి ఉత్ప‌త్తుల‌ను పెంచే విధంగా తోడ్ప‌టు నందించ‌డం వ‌ల్ల వారు త‌మ వ్యాపారంలో అభివృద్ధి చెంది ఆర్థికంగా బ‌లోపేతం అవుతారు.  

కానీ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఇవేమి చేయ‌కుండా కేవ‌లం బ‌ట‌న్ నొక్కాను 24 వేలు తీసుకోండి అభివృద్ధి సాధించండి అంటే అదేలా సాధ్య‌మ‌వుతుందో బటన్ రెడ్డికే తెలియాలి.   ఇదే విధంగా బ‌ట‌న్ నొక్కుడు  కొన‌సాగితే భ‌విష్య‌త్తులో నేత‌న్న‌ల జీవితాలు బుగ్గిపాల‌వుతాయి, నేత కార్మికుడు ఉనికే ప్ర‌శ్నార్థ‌కంగా మారిపోతుంది.  ఇప్ప‌టికైనా బ‌ట‌న్ నొక్క‌డం తో పాటు  ప్ర‌క్క రాష్ర్టం తెలంగాణాలో చేనేత కార్మికుల సంక్షేమం కోసం చేస్తున్న కృషిని చూసైనా బుద్దితెచ్చుకోవాలి.   బతుకమ్మ చీరలు తదితర కార్యక్రమాలతో వారికి చేతినిండా పని కల్పించి, సంపాదన పెంచి, ఆర్థికంగా చేనేత కుటుంబాలకు భరోసానిస్తున్నారు.  వారి ఆత్మగౌరవం పెంచే చర్యలను ప్రభుత్వం చేప‌డుతుంది.   ‘కొండా లక్ష్మణ్ బాపూజీ’ పేరుతో అవార్డులు ఇస్తూ,  ఎగ్జిబిషన్లు, ఫ్యాషన్ షోలను నిర్వహిస్తూ చేనేతలకు ప్రోత్సాహం అందిస్తున్నామన్నారు. తెలుగు దేశం హయాంలో చేనేత కార్మికులకు బీమా సౌక‌ర్యం కల్పించాం. సబ్సిడీపై రుణాలు, రాయితీలు, యంత్రాలు అందించాం. కానీ జగన్ బటన్ రెడ్డి మాత్రం 24 వేలు ఇచ్చాం మీ చావు మీరు చావండి అని వారిని రోడ్డుమీద ప‌డేస్తున్నారు.  ఇప్ప‌టికైనా జగన్ రెడ్డి కళ్లు తెర‌చి  నేతన్నలకు చేయూత పథకాల ద్వారా చేనేత సొసైటీలకు ప్రభుత్వం వాటా ధనాన్ని అందించడం, కార్మికులకు నూలు, రంగులు, రసాయనాలకు సబ్సిడీలు అందించడం, చేనేత మగ్గాలను ఆధునీకరించడం వంటి చర్యలను అమ‌లు చేయాలి. అప్పుడే సత్పలితాలనిస్తాయి.  గ‌తంలో తెలుగుదేశం ప్ర‌భుత్వం చేనేత‌ల‌కు అనేక ప‌థ‌కాలు అమ‌లు చేయ‌డం జ‌రిగింది. చేనేత‌ల‌కు రుణ‌మాఫీ చేసి, 50 ఏళ్ళ‌కే ఫించ‌న్ ఇవ్వ‌డం జ‌రిగింది.  అంతేకాక నేత‌న్న‌ల‌కు వివిధ సంద‌ర్భాల‌లో అవ‌ర‌మైన సాంకేతిక శిక్ష‌ణ‌లు అందించింది వారి జీవితాల్లో వెలుగులు నింపింది.  ఇప్ప‌టికైనా జ‌గ‌న్ రెడ్డి తాత్కాలిక‌మైన తాయిలాలు ఇచ్చి ప్ర‌చారం చేసుకోవ‌డం మాని చేనేత‌ల జీవితాల్లో వెలుగులు నింపెలా చిత్త‌శుద్ధితో కృషి చేయాలి.




Comments
Popular posts
ఉత్తరాఖండ్‌ అసెంబ్లీ సెక్రటేరియట్‌లోని 228 మంది ఉద్యోగులను డిస్మిస్‌ చేస్తూ హైకోర్టు నిర్ణయం సరైనదేనని పేర్కొంది.
Image
న్యాయప్రక్రియకు..రాజ్యాంగపరమైన చట్టాలకు లోబడి వికేంద్రీకరణ చేయబోతున్నాం.
Image
ఒక్క ఇల్లూ కట్టని చిన్న సైకో ఆర్కే ఇళ్లు కూల్చేస్తున్నాడు
Image
*ఆంథ్ర రత్న జయంతి జూన్ 2* *స్వాతంత్ర్య పోరాటయోధుడు, ఉపాధ్యాయుడు,చీరాల పేరాల ఉద్యమనాయకుడు గాంధేయవాది మన తెలుగువాడు ఆంధ్రరత్న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య జయంతి జూన్ 2.* *కృష్ణా జిల్లా, పెనుగంచిప్రోలు గ్రామంలో 1889 జూన్ 2 న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య జన్మించాడు. ఆయన పుట్టిన మూడవ రోజునే తల్లి సీతమ్మ, మూడో ఏట తండ్రి కోదండ రామస్వామి మరణించారు. అప్పటినుండి పినతండ్రి, నాయనమ్మల సంరక్షణలో పెరిగాడు. కూచిపూడిలోను, గుంటూరులోను ప్రాథమిక విద్య జరిగింది. హైస్కూలులో చదివే సమయంలోనే 'జాతీయ నాట్య మండలి' స్థాపించి సంగీత, నాటక కార్యక్రమాలు నిర్వహించాడు. అయితే చదువుపై అంత శ్రద్ధ చూపకపోవడంచేత మెట్రిక్యులేషనులో తప్పాడు. తరువాత బాపట్ల లో చదివి ఉత్తీర్ణుడయ్యాడు*. *నడింపల్లి వెంకటలక్ష్మీ నరసింహారావు అనే ఒక మిత్రుని సాయంతో 1911లో స్కాట్లండు లోని ఎడింబరో విశ్వ విద్యా లయంలో ఎం.ఎ. చదివాడు*. *తరువాత ఆనంద కుమార స్వామి తో కలసి కొంతకాలం పనిచేశాడు. ఆ సమయంలో 'నందికేశ్వరుడు' రచించిన 'అభినయ దర్పణం' అనే గ్రంథాన్ని “The Mirror of Gesture,” అన్న పేరుతో సంస్కృతం నుండి ఆంగ్లంలోకి అనువదించాడు. ఇది 1917లో 'కేంబ్రిడ్జ్ - హార్వర్డ్ యూనివర్శిటీ ప్రెస్' వారిచే ప్రచురించబడింది.* *తిరిగివచ్చాక, రాజమండ్రి లోను, బందరు లోను కొంతకాలం ఉపాధ్యాయుడిగా పనిచేసాడు. తన స్వతంత్ర భావాల కారణంగా పైవారితో పడక ఆ ఉద్యోగాలు వదలిపెట్టాడు. తరువాత గోపాల కృష్ణయ్య స్వాతంత్ర్య సంగ్రామం లో దూకాడు*. *బ్రిటీష్ ప్రభుత్వం 1919లో చీరాల-పేరాల గ్రామాలను కలిపి పురపాలక సంఘంగా చేయడంతో ప్రజలపై పన్నుల భారం అధికమై పురపాలక సంఘం రద్దు చేయాలని ఉద్యమించారు. ప్రస్తుతం ప్రకాశం జిల్లా లో ఉన్న చీరాల, పేరాల గ్రామాల జనాభా ఆ కాలంలో 15000. జాండ్రపేట, వీరరాఘవపేట గ్రామాలను చీరాల, పేరాలతో కలిపి చీరాల యూనియన్ అని వ్యవహరించే వారు. ఈ యూనియన్ నుంచి ఏడాదికి నాలుగు వేల రూపాయలు వసూలయ్యేవి. మద్రాసు ప్రభుత్వం 1919 లో చీరాల-పేరాలను మున్సిపాలిటీగా ప్రకటించింది. పన్ను ఏడాదికి 40,000 రూపాయలయ్యింది. సౌకర్యాలు మాత్రం మెరుగు పడలేదు. ఇక్కడ ఉన్న నేతపని వారు, చిన్నరైతులు పన్ను చెల్లించలేక మున్సిపాలిటీని రద్దు చేయాలని ప్రభుత్వానికి ఎన్నో వినతి పత్రాలు సమర్పించారు. ఫలితం లేదు. దాంతో వారు దుగ్గిరాల గోపాలకృష్ణయ్య నాయకత్వంలో ఆందోళన ప్రారంభించారు. ఇది స్వాతంత్ర్య పోరాటంలో ఒక ముఖ్యమైన ఘట్టం. ఆంధ్ర దేశం అంతా తిరిగి బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ప్రచారం చేశాడు. నిషేధాన్ని ఉల్లంఘించి బరంపురంలో ఉపన్యాసం చేసినందుకు ఒక సంవత్సరం పాటు జైలు శిక్ష అనుభవించాడు.చీరాల పేరాల ఉద్యమం -మద్రాస్ ప్రసిడెన్సీని కంపింపజేసింది.. ఆ ఉద్యమం మిగతా ప్రాంతాలకు వ్యాపిస్తుందేమోనని ఆంగ్లేయపాలకులు భయకంపితులయినారు..చివరికి జాతీయకాంగ్రీసు జోక్యంతో ఉద్యమం ముగిసింది...* *తెలుగు నాట జానపద కళా రూపాల పునరుద్ధరణకు, గ్రంథాలయాల వ్యాప్తికి గోపాలకృష్ణయ్య ఇతోధికంగా కృషి చేశాడు. 'సాధన' అనే పత్రిక నడిపాడు*. *ఆయన ప్రచారం చేసిన జానపద కళారీతులు - తోలుబొమ్మలాట, జముకుల కథ, బుర్రకథ, వీధి నాటకాలు, సాము గరిడీలు, గొల్ల కలాపం, బుట్ట బొమ్మలు, కీలు గుర్రాలు, వాలకాలు, గోసంగి, గురవయ్యలు, సరదా కథ, కిన్నెర కథ, కొమ్ము బూర,జోడు మద్దెల, పల్లె సుద్దులు, తూర్పు భాగోతం, చుట్టు కాముడు, పిచ్చికుంట్లవాళ్ళ కథ, సాధనా శూరులు, పలనాటి వీర విద్యావంతులు - వగైరా* *గోపాలకృష్ణయ్య నియమ తత్పరుడు. 'శ్రీరామదండు' అనే ఆధ్యాత్మిక, జాతీయతా స్వచ్ఛంద సమూహాన్ని ఏర్పాటు చేశాడు.* *1921 లో గుంటూరులో ఒక సభలో "ఆంధ్ర రత్న" అన్న బిరుదుతో ఆయనను సత్కరించారు.* *ఈ మహనీయుని త్యాగాలకు తెలుగుజాతి సర్వదా ఋణపడివుంది*. *ఉపాధ్యాయ సేవా కేంద్రం,విజయవాడ*
Image
बर्खास्त होंगे उत्तराखंड विधानसभा सचिवालय के 228 कर्मी, हाईकोर्ट ने फैसला सही कहा।
Image