దేశ స్వాతంత్రం కోసం పోరాటం చేసిన యోధులలో భారతరత్న శ్రీ వరాహగిరి వెంకటగిరి చిరస్మరణీయులు

 


నెల్లూరు ఆగస్టు 10 (ప్రజా అమరావతి):-దేశ స్వాతంత్రం కోసం పోరాటం చేసిన యోధులలో భారతరత్న  శ్రీ వరాహగిరి వెంకటగిరి చిరస్మరణీయుల


ని జిల్లా రెవెన్యూ అధికారి శ్రీమతి వెంకటనారాయణమ్మ కొనియాడారు. 


బుధవారం ఉదయం నగరంలోని కలెక్టరేట్ తిక్కన ప్రాంగణంలో దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ఆజాదీ కా అమృత్ మహోత్సవం కార్యక్రమంలో భాగంగా శ్రీ వరాహగిరి వెంకటగిరి జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి.  ఈ సందర్భంగా డిఆర్ఓ, జిల్లా అధికారులు  శ్రీ వివిగిరి చిత్రపటానికి పుష్ప గుచ్చాలతో ఘనంగా నివాళులు అర్పించారు.


అలాగే ఈ సందర్భంగా మా తెలుగు తల్లికి మల్లెపూదండ రచయిత  కీర్తిశేషులు శ్రీ శంకరం భాడి సుందరాచారి  జయంతి కూడా ఈరోజే కావడంతో వారిని కూడా అందరూ స్మరించుకొని వారి గీతాన్ని ఆలపించారు. 


అనంతరం డిఆర్ఓ మాట్లాడుతూ శ్రీ వివి గిరి 1894 సంవత్సరం ఆగస్టు 10వ తేదీన ప్రస్తుత ఒరిస్సా రాష్ట్రంలోని బరంపురంలో జన్మించారన్నారు.  వారు మహాత్మా గాంధీ అనుయాయులుగా ఉంటూ స్వాతంత్ర సంగ్రామంలో  పాల్గొని పలుమార్లు కఠిన కారాగార శిక్ష అనుభవించారన్నారు. రాజాజీ మంత్రివర్గంలో కార్మిక పరిశ్రమల శాఖ మంత్రిగా ఉంటూ పలు ప్రజాహిత కార్యక్రమాలు చేపట్టారన్నారు.  కార్మికుల ప్రయోజనాలను కాపాడటంలో శ్రీగిరి ప్రముఖ పాత్ర పోషించారన్నారు.  భారత ప్రభుత్వం అత్యున్నత అవార్డు భారతరత్న తో శ్రీ గిరిని సత్కరించిందన్నారు. 1967-69 లో 3వ ఉపరాష్ట్రపతి గాను,1969-74 లో నాలుగో రాష్ట్రపతిగాను సేవలందించార 4వ రాష్ట్రపతిగాను దేశానికి సేవలందించారన్నారు.  అటువంటి మహనీయులను ఆజాదీ కా అమృత్ మహోత్సవ కార్యక్రమంలో భాగంగా స్మరించుకోవడం మన బాధ్యత ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు.


 డిపిఓ  శ్రీమతి ధనలక్ష్మి మాట్లాడుతూ స్వాతంత్ర పోరాటంలో అసువులు బాసిన ఎందరో మహనీయులు ఆదర్శంగా నిలిచారన్నారు.  శ్రీ వివిగిరి క్విట్ ఇండియా ఉద్యమంలో చురుగ్గా పాల్గొని జైలు శిక్ష అనుభవించారన్నారు. మనం స్వేచ్ఛగా ప్రశాంతంగా మాట్లాడుకోగలుగుతున్నామంటే అభివృద్ధి పథంలో సామాజికంగా ఆర్థికంగా మనగలుగుతున్నామంటే అది ఆనాటి మహానుభావుల త్యాగ ఫలితమే అన్నారు. పితృదేవతలకు రుణ తర్పణ చేసినట్లుగా అమరవీరులను స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.  వారి జీవిత గాధలను భావితరాలకు తెలియజేయాలన్నారు. .


ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈవో శ్రీమతి వాణి, దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ శ్రీ పి. శ్రీనివాసులు రెడ్డి,  ఐటిడిఎ పి ఓ శ్రీమతి మందా రాణీ, సర్వ శిక్ష ఏ పి సి శ్రీమతి ఉషారాణి, రచయిత సంఘ సేవకురాలు గూడూరు లక్ష్మి,  దేవాదాయశాఖ అధికారులు,  సిబ్బంది పాల్గొన్నారు.

Comments
Popular posts
అర్హులైన వారందరికీ వర్తించేలా వైయస్సార్‌ కళ్యాణమస్తు, వైయస్సార్‌ షాదీ తోఫా.
Image
శరన్నవరాత్రి మహోత్సవాల్లో ఆరవ రోజున శ్రీ కనకదుర్గమ్మ వారు శ్రీ మహాలక్ష్మి గా దర్శనమిస్తారు.
Image
శరన్నవరాత్రి మహోత్సవాల్లో ఏడవ రోజున శ్రీ కనక దుర్గమ్మ వారు శ్రీ సరస్వతి దేవి అలంకారంలో దర్శనం ఇస్తారు.
Image
అక్టోబరు 25న ఇ–క్రాపింగ్‌ జాబితాలు సచివాలయాల్లో ప్రదర్శన, షెడ్యూల్‌ వివరించిన సీఎం.
Image
భోగాపురం గ్రీన్‌ఫీల్డ్‌ అంతర్జాతీయ విమానాశ్రయం అభివృద్ధికి సహకరించాలని కేంద్ర మంత్రిని కోరిన ముఖ్యమంత్రి.
Image