భక్తులకు అందుబాటులో శ్రీవారి లడ్డూలు

 నెల్లూరు, 2022, ఆగస్టు 17 (ప్రజా అమరావతి);


భక్తులకు అందుబాటులో శ్రీవారి లడ్డూలు     నెల్లూరులోని ఎసి సుబ్బారెడ్డి స్టేడియంలో టిటిడి తలపెట్టిన శ్రీవేంకటేశ్వర వైభవోత్సవాలకు విచ్చేసే భక్తుల కోసం తిరుమల శ్రీవారి లడ్డూలను టిటిడి అందుబాటులో ఉంచింది. ఇందుకోసం ప్రత్యేకంగా స్టాల్ ఏర్పాటు చేశారు. తిరుమల తరహాలోనే ఒక్కో లడ్డూ రూ.50 చొప్పున భక్తులకు అందిస్తున్నారు. నమూనా ఆలయంలో శ్రీవారిని దర్శించుకుంటున్న భక్తులు ఎంతో ప్రీతిపాత్రంగా లడ్డూలను కొనుగోలు చేస్తున్నారు.


      అదేవిధంగా, విపిఆర్ ఫౌండేషన్ తరఫున భక్తులందరికీ చిన్న లడ్డూలను స్వామివారి ప్రసాదంగా అందిస్తున్నారు.


       స్వామివారిని దర్శించుకుని బయటకు వచ్చే భక్తులందరికీ పులిహోర,  బెల్లం పొంగళి, కట్టె పొంగళి, దధ్యోదనం ప్రసాదంగా అందిస్తున్నారు.


       పలు ప్రాంతాల్లో భక్తుల కోసం తాగునీరు అందుబాటులో ఉంచారు. అదేవిధంగా భక్తులకోసం తాత్కాలిక మరుగుదొడ్లు ఏర్పాటు చేశారు.Comments