ఈరోజు స్పందనలో మూడు ఫిర్యాదులు అందాయీ... ఎస్. మల్లి బాబుకొవ్వూరు (ప్రజా అమరావతి): 


ఈరోజు స్పందనలో మూడు ఫిర్యాదులు అందాయీ... ఎస్. మల్లి బాబు కొవ్వూరు పట్టణాన్ని అత్యంత పరిశుభ్రమైన ప్రాంతంగా తీర్చిదిద్దే చర్యలు తీసుకోవడం జరుగుతుందని రెవెన్యూ డివిజనల్ అధికారి ఎస్. మల్లిబాబు పేర్కొన్నారు.


సోమవారం ఉదయం స్థానిక ఆర్డీవో కార్యాలయం లో ప్రజల నుంచి స్పందన ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా మల్లి బాబు మాట్లాడుతూ, సోమవారం స్పందన కు మొత్తం మూడు ఫిర్యాదులు వచ్చాయన్నారు. వీటిని తక్షణ పరిష్కారం కోసం సంబంధిత మండల అధికారులకు పంపడం జరిగిందన్నారు. 


కొవ్వూరు పట్టణంలో ను గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్న ఘాట్స్ ఇటీవల సంభవించిన వరదలు కారణంగా బురద చేరుకోవడం తో గోదావరీ నదికి వొచ్చే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. సోమవారం ఉదయం కొవ్వూరు వైపు ఉన్న అన్ని ఘాట్స్ ను పరిశుభ్రం చేయించినట్లు తెలిపారు. కొవ్వూరును పరిశుభ్రమైన పట్టణంగా తిర్చి దిద్దడం లో ప్రజల భాగస్వామ్యం ఉండా లని, మునిసిపల్ సిబ్బందికి సహకారం అందించాలని మల్లి బాబు కోరారు. 
Comments