సీఎం శ్రీ వైయస్‌ జగన్‌ అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం ఏపీసెజ్‌లో ప్రారంభించనున్న, భూమి పూజ చేయనున్న యూనిట్ల


అమరావతి (ప్రజా అమరావతి);


*రేపు (16.08.2022, మంగళవారం) సీఎం శ్రీ వైయస్‌ జగన్‌ అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం ఏపీసెజ్‌లో ప్రారంభించనున్న, భూమి పూజ చేయనున్న యూనిట్ల వివరాలు*


*1. ఏటీసీ టైర్స్‌ ఏపీ ప్రేవేట్‌ లిమిటెడ్‌ ఫస్ట్‌ ఫేజ్‌ ప్రారంభోత్సవం*


జపాన్‌కు చెందిన యకహోమా గ్రూప్‌నకు చెందిన ఏటీసీ టైర్ల తయారీ కంపెనీ ఉత్పత్తికి సిద్దమైంది. మొత్తం రెండు దశల్లో రూ. 2,200 కోట్ల పెట్టుబడితో దాదాపు రెండు వేల మందికి ఉద్యోగావకాశాల కల్పన లక్ష్యంగా కంపెనీ ప్రారంభోత్సవానికి సిద్దమైంది. 100 ఏళ్ళకు పైగా చరిత్ర ఉన్న ఈ కంపెనీ 6 ఖండాల్లో 120 దేశాలలో విస్తరించి ఉంది. మన దేశంలో ఇప్పటికే తమిళనాడులోని తిరునల్వేలి, గుజరాత్‌లోని దహేజ్‌లో మ్యాన్యుఫ్యాక్చరింగ్‌ యూనిట్లను నెలకొల్పింది, అచ్యుతాపురం యూనిట్‌ మూడోది. 


*భూమి పూజ చేయనున్న యూనిట్ల వివరాలు**1. ఏటీసీ టైర్స్‌ ఏపీ ప్రేవేట్‌ లిమిటెడ్‌ సెకండ్‌ ఫేజ్‌* 


రూ. 816 కోట్ల పెట్టుబడి, నేరుగా 800 మందికి ఉద్యోగావకాశాలు, 100 టీపీడీ కెపాసిటీ


*2. మెస్సర్స్‌ పిడిలైట్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌*


రూ. 202 కోట్ల పెట్టుబడి, 380 మందికి ఉద్యోగావకాశాలు, వాటర్‌ ప్రూఫింగ్‌ ఉత్పత్తుల తయారీ, కోటింగ్, సీలెంట్స్‌ తదితర ఉత్పత్తుల తయారీ యూనిట్‌ విస్తరణకు భూమి పూజ


*3. మేఘ ఫ్రూట్‌ ప్రాసెసింగ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌* 


కార్బొనేటెడ్‌ ప్రూట్‌ డ్రింక్స్, ప్యాకేజ్డ్‌ డ్రింకింగ్‌ వాటర్, ప్రూట్‌ జ్యూస్‌ల టెట్రా ప్యాకింగ్, పెట్‌ బాటిల్స్‌ తదితర ఉత్పత్తుల బెవరేజెస్‌ యూనిట్‌ను ఇక్కడ నెలకొల్పనున్నారు. ఇప్పటికే మంగుళూరు, సంగారెడ్డిలలో యూనిట్లు ఉన్న ఈ కంపెనీ అచ్యుతాపురం సెజ్‌లో రూ. 185.25 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. ఇందులో దాదాపు 700 మందికి ఉద్యోగాలను కల్పించనున్నారు.


*4. మెస్సర్స్‌ ఐనాక్స్‌ ఎయిర్‌ ప్రొడక్ట్స్‌ ప్రెవేట్‌ లిమిటెడ్‌* 


ఇండస్ట్రియల్‌ గ్యాసెస్‌ తయారీలో పేరుగాంచిన ఈ సంస్ధ మన దేశంలో ఇప్పటికే 38 మ్యాన్యుఫ్యాక్చరింగ్‌ యూనిట్లను నెలకొల్పింది. రూ. 145 కోట్ల పెట్టుబడితో లిక్విడ్‌ ఆక్సీజన్, లిక్విడ్‌ నైట్రోజన్, లిక్విడ్‌ ఆర్గాన్‌ తదితర ఉత్పత్తులను ఇక్కడ తయారుచేయనున్నారు. 


*5. మెస్సర్స్‌ ఆప్టిమస్‌ డ్రగ్స్‌ ప్రేవేట్‌ లిమిటెడ్‌*


ఇప్పటికే హైదరాబాద్, పరవాడలలో మ్యాన్యుఫ్యాక్చరింగ్‌ యూనిట్లను ఏర్పాటుచేసిన ఈ సంస్ధ ఇక్కడ రూ. 125 కోట్ల పెట్టుబడితో మరో యూనిట్‌ను ఏర్పాటుచేసేందుకు ముందుకొచ్చింది. 


*6. విన్‌ విన్‌ స్పెషాలిటీ ఇన్సులేటర్స్‌ లిమిటెడ్‌* 


అత్యాధునిక సాంకేతికతతో కూడిన వోల్టేజ్‌ సిరామిక్‌ ఇన్సులేటర్స్, పాలిమెరిక్‌ ఇన్సులేటర్ల తయారీలో పేరుగాంచిన ఈ కంపెనీ దాదాపు రూ. 107.70 కోట్ల పెట్టుబడితో ఇక్కడ యూనిట్‌ను ఏర్పాటుచేయనుంది.


*7. సైనాప్టిక్స్‌ ల్యాబ్స్‌ ప్రేవేట్‌ లిమిటెడ్‌* 


బల్క్‌ డ్రగ్స్, ఇంటర్మీడియట్స్‌ తయారీ యూనిట్‌ను ఏర్పాటుచేయనున్న ఈ సంస్ధ దాదాపు రూ. 81.75 కోట్ల పెట్టుబడితో ఇక్కడ మరో యూనిట్‌ ఏర్పాటుకు సిద్దమైంది. 


*8. స్టైరాక్స్‌ లైఫ్‌సైన్సెస్‌ ప్రేవేట్‌ లిమిటెడ్‌* 


బల్క్‌ డ్రగ్స్, ఇంటర్మీడియట్స్‌ తయారీ యూనిట్‌ను ఏర్పాటుచేయనున్న ఈ సంస్ధ దాదాపు రూ. 87.77 కోట్ల పెట్టుబడితో ఇక్కడ మరో యూనిట్‌ ఏర్పాటుకు సిద్దమైంది. 


*9. ఇషా రిసోర్సెస్‌ ప్రేవేట్‌ లిమిటెడ్‌*


కోక్‌ మరియు కోల్‌ స్క్రీనింగ్‌ కొరకు ఈ సంస్ధ రూ. 68.06 కోట్ల పెట్టుబడితో ఇక్కడ యూనిట్‌ను నెలకొల్పనుంది. విశాఖపట్నం పెదగంట్యాడలో ఇప్పటికే కోక్, కోల్‌ స్క్రీనింగ్, గ్రేడింగ్‌ యూనిట్‌ను ఏర్పాటుచేసింది.

Comments
Popular posts
అర్హులైన వారందరికీ వర్తించేలా వైయస్సార్‌ కళ్యాణమస్తు, వైయస్సార్‌ షాదీ తోఫా.
Image
శరన్నవరాత్రి మహోత్సవాల్లో ఆరవ రోజున శ్రీ కనకదుర్గమ్మ వారు శ్రీ మహాలక్ష్మి గా దర్శనమిస్తారు.
Image
శరన్నవరాత్రి మహోత్సవాల్లో ఏడవ రోజున శ్రీ కనక దుర్గమ్మ వారు శ్రీ సరస్వతి దేవి అలంకారంలో దర్శనం ఇస్తారు.
Image
అక్టోబరు 25న ఇ–క్రాపింగ్‌ జాబితాలు సచివాలయాల్లో ప్రదర్శన, షెడ్యూల్‌ వివరించిన సీఎం.
Image
భోగాపురం గ్రీన్‌ఫీల్డ్‌ అంతర్జాతీయ విమానాశ్రయం అభివృద్ధికి సహకరించాలని కేంద్ర మంత్రిని కోరిన ముఖ్యమంత్రి.
Image