రీ సర్వే చేపట్టడం ద్వారా భూ సంబంధ సమస్యలకు శాశ్వత పరిష్కారం



రాజమహేంద్రవరం (ప్రజా అమరావతి): 




రీ సర్వే చేపట్టడం ద్వారా భూ సంబంధ సమస్యలకు శాశ్వత పరిష్కారం


చెయ్యడం కోసం వంద సంవత్సరాలు తర్వాత జగనన్న శాశ్వత భూ హక్కు మరియు భూరక్షా పథకం ద్వారా సర్వే చెయ్యడం జరుగుతోందని జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత పేర్కొన్నారు. ప్రస్తుతం పట్టణ పరిధిలో సర్వే ప్రక్రియ కు శ్రీకారం చేపట్టడం 

జరుగుతున్నట్లు తెలిపారు.



బుధవారం శ్రీ వెంకటేశ్వర ఆనం కళా కేంద్రం "జగనన్న శాశ్వత భూ హక్కు మరియు భూరక్షా పథకం "పై సర్వేయార్ల శిక్షణ కార్యక్రమానికి పార్లమెంట్ సభ్యులు మార్గని భరత్ రామ్,  ఎమ్మేల్యే జక్కంపూడి రాజా, మునిసిపల్ కమిషనర్ కె. దినేష్ కుమార్ లతో కలిసి కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, 1920 సంవత్సరంలో అప్పటి అధికారులు భూ సర్వే చేపట్టి భూ రికార్డులను నిబద్దతతో ఆధునికరించారన్నారు. స్పందనగా కార్యక్రమంలో గానీ , ప్రజలు అందజేసే వినద్దుల్లో గాని ఎక్కువ శాతం భూ సంబంధ సమస్యలు అంశాలు ఎక్కువగా ఉంటాయన్నారు. గత వంద సంవత్సరాలుగా భూ రికార్డులు ఆధునీకరించిపోవడం కొనుగోలు అమ్మకాలు జరిగిన సందర్భంలో వాటికి సంబంధించిన రికార్డుల లో మార్పులు చేయకపోవడం వల్ల ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామన్నారు. వీటికి శాశ్వత పరిష్కారం చూపాలని ఉద్దేశంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జగనన్న భూ హక్కు మరియు భూ రక్షా పథకం ద్వారా భూ సర్వే నిర్వహించి, భూ రికార్డుల స్వచ్చికరణ దిశగా చర్యలకు శ్రీకారం చుట్టారని కలెక్టర్ పేర్కొన్నారు. ఇప్పుడు ఉన్న భూ యజమాని పేరుతో భూ రికార్డుల సర్వే ద్వారా కొత్త సర్వే నంబర్ కేటాయించడం కోసం ఈ ప్రక్రియ ను చేస్తున్నామన్నారు. ఇందులో భాగంగా సర్వే లో భాగస్వామ్యం అయ్యే ప్రతి ఒక్కరూ ప్రస్తుతం రికార్డుల్లో ఉన్న వివరాలు నిబద్దతతో,  సంబందించిన సమగ్రమైన సమాచారాన్ని ఖచ్చితమైన విధానం లో నమోదు చెయ్యాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఈ విషయంలో ఎటువంటి అలక్ష్యం ప్రదర్శించరాదని తెలియచేశారు. దేశంలోనే ఈ ప్రక్రియను సమర్థవంతంగా చేపట్టి దానికి లాజికల్ కంక్లుజన్ (తార్కిక ముగింపు) తీసుకుని రాగలిగిన రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రమన్నారు. ప్రతి న్యూ డివిజన్లో ఒక గ్రామాన్ని  పైలెట్ గా ఎంపిక చేసి సర్వే పూర్తి చేసి, పత్రాలు అందజేశామని, గ్రామ సచివాలయం వద్ద నే రిజిస్ట్రేషన్ ప్రక్రియ చేపట్టడం జరుగుతోందన్నారు. గతంలో పరిమితి సంఖ్యలో మానవ వనరులు ఉండేవని, ప్రస్తుతం మన దగ్గర 96 సచివాలయం వద్ద సర్వేయర్లు, మరో నలుగురు సిబ్బంది కూడా ఉండడం వల్ల సర్వే మరింత సులభతరం కానున్నదని కలెక్టర్ తెలిపారు. ప్రతి ఒక్కరూ నిబద్దతతో సర్వే పనులు చేపట్టాలని స్పష్టం చేశారు.


పార్లమెంట్ సభ్యులు మార్గని భరత్ రామ్ మాట్లాడుతూ, ప్రతి పేదవానికి, సామాన్యునికి మేలు చేయాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి సమగ్ర భూ సర్వే ప్రక్రియను చేపట్టడం జరిగిందన్నారు. దేశంలో కొన్ని రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన ఈ ప్రక్రియ చేపట్టినా సమర్థవంతంగా అమలు చేయడం సాధ్యం చెయ్యక పోవడం చుసామన్నరు. ఐతే ముఖ్యమంత్రి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి భూ రికార్డుల సర్వే చేపట్టే దిశగా అడుగులు వేయడం జరుగుతున్నట్లు పేర్కొన్నారు. ఈ సర్వే ను అంతే నిబద్దతతో చేపట్టవలసి ఉందని ఎంపి తెలిపారు.


మునిసిపల్ కమిషనర్ కె. దినేష్ కుమార్ మాట్లాడుతూ, పురపాలక సంఘాలు పరిధిలో చేపడుతున్న ఈ భూ సర్వే పనులు అత్యంత జాగ్రత్తగా పూర్తి చెయ్యాల్సి ఉందన్నారు. ఇప్పటికే గ్రామీణ ప్రాంతాల లో చేపట్టిన సర్వే సమర్థవంతంగా చేపట్టిన దృష్ట్యా వాటి నుంచి పొందిన అనుభవాన్ని మనకు ఎంతో ఉపయోగం ఉంటుందన్నారు. ఎటువంటి సందేహాలు ఉన్నా నివృత్తి చేసుకుని, తప్పులకు ఆస్కారం లేకుండా సర్వే నిర్వహించాలని కోరారు.


ఈ సందర్భంగా జిల్లా సర్వే అధికారి పి. లక్ష్మణ రావు  మాట్లాడుతూ, సర్వే చేపట్టే ప్రక్రియ పూర్తి వివరాలు కలెక్టర్ ద్వారా సమగ్రంగా వివరించడం జరిగిందన్నారు. సర్వే ప్రక్రియ పూర్తి అయ్యేలా పనితీరు చూపాల్సి ఉందని తెలిపారు .


ఈ శిక్షణా సమావేశానికి  శాసన సభ్యులు జక్కంపూడి రాజా, రూడా చైర్ పర్సన్ మెడపాటి షర్మిలా రెడ్డి, జిల్లా సర్వే అధికారి పి. లక్ష్మణ రావు, ఆర్ ఎమ్ సి అధికారులు, మునిసిపల్ సచివాలయ వార్డు సర్వే, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.




Comments
Popular posts
ఉత్తరాఖండ్‌ అసెంబ్లీ సెక్రటేరియట్‌లోని 228 మంది ఉద్యోగులను డిస్మిస్‌ చేస్తూ హైకోర్టు నిర్ణయం సరైనదేనని పేర్కొంది.
Image
ఇంటర్నెట్‌లో గూగుల్ సెర్చ్‌లో సైబర్ క్రైమ్ కేసులు పెరుగుతున్నాయి.
Image
న్యాయప్రక్రియకు..రాజ్యాంగపరమైన చట్టాలకు లోబడి వికేంద్రీకరణ చేయబోతున్నాం.
Image
ఒక్క ఇల్లూ కట్టని చిన్న సైకో ఆర్కే ఇళ్లు కూల్చేస్తున్నాడు
Image
*ఆంథ్ర రత్న జయంతి జూన్ 2* *స్వాతంత్ర్య పోరాటయోధుడు, ఉపాధ్యాయుడు,చీరాల పేరాల ఉద్యమనాయకుడు గాంధేయవాది మన తెలుగువాడు ఆంధ్రరత్న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య జయంతి జూన్ 2.* *కృష్ణా జిల్లా, పెనుగంచిప్రోలు గ్రామంలో 1889 జూన్ 2 న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య జన్మించాడు. ఆయన పుట్టిన మూడవ రోజునే తల్లి సీతమ్మ, మూడో ఏట తండ్రి కోదండ రామస్వామి మరణించారు. అప్పటినుండి పినతండ్రి, నాయనమ్మల సంరక్షణలో పెరిగాడు. కూచిపూడిలోను, గుంటూరులోను ప్రాథమిక విద్య జరిగింది. హైస్కూలులో చదివే సమయంలోనే 'జాతీయ నాట్య మండలి' స్థాపించి సంగీత, నాటక కార్యక్రమాలు నిర్వహించాడు. అయితే చదువుపై అంత శ్రద్ధ చూపకపోవడంచేత మెట్రిక్యులేషనులో తప్పాడు. తరువాత బాపట్ల లో చదివి ఉత్తీర్ణుడయ్యాడు*. *నడింపల్లి వెంకటలక్ష్మీ నరసింహారావు అనే ఒక మిత్రుని సాయంతో 1911లో స్కాట్లండు లోని ఎడింబరో విశ్వ విద్యా లయంలో ఎం.ఎ. చదివాడు*. *తరువాత ఆనంద కుమార స్వామి తో కలసి కొంతకాలం పనిచేశాడు. ఆ సమయంలో 'నందికేశ్వరుడు' రచించిన 'అభినయ దర్పణం' అనే గ్రంథాన్ని “The Mirror of Gesture,” అన్న పేరుతో సంస్కృతం నుండి ఆంగ్లంలోకి అనువదించాడు. ఇది 1917లో 'కేంబ్రిడ్జ్ - హార్వర్డ్ యూనివర్శిటీ ప్రెస్' వారిచే ప్రచురించబడింది.* *తిరిగివచ్చాక, రాజమండ్రి లోను, బందరు లోను కొంతకాలం ఉపాధ్యాయుడిగా పనిచేసాడు. తన స్వతంత్ర భావాల కారణంగా పైవారితో పడక ఆ ఉద్యోగాలు వదలిపెట్టాడు. తరువాత గోపాల కృష్ణయ్య స్వాతంత్ర్య సంగ్రామం లో దూకాడు*. *బ్రిటీష్ ప్రభుత్వం 1919లో చీరాల-పేరాల గ్రామాలను కలిపి పురపాలక సంఘంగా చేయడంతో ప్రజలపై పన్నుల భారం అధికమై పురపాలక సంఘం రద్దు చేయాలని ఉద్యమించారు. ప్రస్తుతం ప్రకాశం జిల్లా లో ఉన్న చీరాల, పేరాల గ్రామాల జనాభా ఆ కాలంలో 15000. జాండ్రపేట, వీరరాఘవపేట గ్రామాలను చీరాల, పేరాలతో కలిపి చీరాల యూనియన్ అని వ్యవహరించే వారు. ఈ యూనియన్ నుంచి ఏడాదికి నాలుగు వేల రూపాయలు వసూలయ్యేవి. మద్రాసు ప్రభుత్వం 1919 లో చీరాల-పేరాలను మున్సిపాలిటీగా ప్రకటించింది. పన్ను ఏడాదికి 40,000 రూపాయలయ్యింది. సౌకర్యాలు మాత్రం మెరుగు పడలేదు. ఇక్కడ ఉన్న నేతపని వారు, చిన్నరైతులు పన్ను చెల్లించలేక మున్సిపాలిటీని రద్దు చేయాలని ప్రభుత్వానికి ఎన్నో వినతి పత్రాలు సమర్పించారు. ఫలితం లేదు. దాంతో వారు దుగ్గిరాల గోపాలకృష్ణయ్య నాయకత్వంలో ఆందోళన ప్రారంభించారు. ఇది స్వాతంత్ర్య పోరాటంలో ఒక ముఖ్యమైన ఘట్టం. ఆంధ్ర దేశం అంతా తిరిగి బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ప్రచారం చేశాడు. నిషేధాన్ని ఉల్లంఘించి బరంపురంలో ఉపన్యాసం చేసినందుకు ఒక సంవత్సరం పాటు జైలు శిక్ష అనుభవించాడు.చీరాల పేరాల ఉద్యమం -మద్రాస్ ప్రసిడెన్సీని కంపింపజేసింది.. ఆ ఉద్యమం మిగతా ప్రాంతాలకు వ్యాపిస్తుందేమోనని ఆంగ్లేయపాలకులు భయకంపితులయినారు..చివరికి జాతీయకాంగ్రీసు జోక్యంతో ఉద్యమం ముగిసింది...* *తెలుగు నాట జానపద కళా రూపాల పునరుద్ధరణకు, గ్రంథాలయాల వ్యాప్తికి గోపాలకృష్ణయ్య ఇతోధికంగా కృషి చేశాడు. 'సాధన' అనే పత్రిక నడిపాడు*. *ఆయన ప్రచారం చేసిన జానపద కళారీతులు - తోలుబొమ్మలాట, జముకుల కథ, బుర్రకథ, వీధి నాటకాలు, సాము గరిడీలు, గొల్ల కలాపం, బుట్ట బొమ్మలు, కీలు గుర్రాలు, వాలకాలు, గోసంగి, గురవయ్యలు, సరదా కథ, కిన్నెర కథ, కొమ్ము బూర,జోడు మద్దెల, పల్లె సుద్దులు, తూర్పు భాగోతం, చుట్టు కాముడు, పిచ్చికుంట్లవాళ్ళ కథ, సాధనా శూరులు, పలనాటి వీర విద్యావంతులు - వగైరా* *గోపాలకృష్ణయ్య నియమ తత్పరుడు. 'శ్రీరామదండు' అనే ఆధ్యాత్మిక, జాతీయతా స్వచ్ఛంద సమూహాన్ని ఏర్పాటు చేశాడు.* *1921 లో గుంటూరులో ఒక సభలో "ఆంధ్ర రత్న" అన్న బిరుదుతో ఆయనను సత్కరించారు.* *ఈ మహనీయుని త్యాగాలకు తెలుగుజాతి సర్వదా ఋణపడివుంది*. *ఉపాధ్యాయ సేవా కేంద్రం,విజయవాడ*
Image