రైతుల సంక్షేమానికి అనేక కార్యక్రమాలను అమలు చేస్తూ, రైతులకు అండగా

 

నెల్లూరు (ప్రజా అమరావతి);రైతుల సంక్షేమానికి అనేక కార్యక్రమాలను అమలు చేస్తూ, రైతులకు అండగా


వుంటూ వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి గారు నిరంతరం కృషి చేస్తున్నారని రాష్ట్ర వ్యవసాయం, సహకార, మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్  శాఖామాత్యులు శ్రీ కాకాణి గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు.

 

 రైతుల జీవన ప్రమాణాలను మెరుగుపర్చాలన్న లక్ష్యంతో,  పండించిన  పంటకు గిట్టు బాటు ధర కల్పించే ఉద్దేశ్యంతో వాల్‌మార్ట్ ఫౌండేషన్, ఇంటర్నేషనల్ క్రాప్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ సెమీ-ఎరిడ్ ట్రాపిక్ (ICRISAT) సహకారంతో అనంతపురం జిల్లా ముద్దాలపాలెం  వద్ద ఏర్పాటుచేసిన సెకండరీ ప్రాసెసింగ్  యూనిట్ ను  బుధవారం ఉదయం  రాష్ట్ర  వ్యవసాయం, సహకార,  మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్  శాఖామాత్యులు శ్రీ కాకాణి గోవర్ధన్, నెల్లూరు లోని  తన క్యాంపు కార్యాలయం నుండి వర్చువల్ విధానంలో ప్రారంభించారు.

 

ఈ సంధర్భంగా మంత్రి శ్రీ కాకాణి గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ, రైతులకు సుస్థిరమైన ఆదాయం కలిగేలా  రైతు  విత్తనం నాటిన దగ్గర నుండి పండించిన పంటను అమ్ముకునే వరకు రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అండగా వుంటూ గిట్టుబాటు ధర లభించేలా చర్యలు తీసుకోవడం జరుగుచున్నదన్నారు.  ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి  గారి నాయకత్వంలో  వ్యవసాయాన్ని మరింత ఆచరణీయంగా,  లాభదాయకంగా మార్చడంలో  రాష్ట్ర  ప్రభుత్వం నిరంతరం కృషిచేస్తున్నదని మంత్రి తెలిపారు. విత్తడం నుండి అమ్మకం వరకు రైతులందరికీ ఒక స్టాప్ పరిష్కారంగా రైతు భరోసా కేంద్రాలు పనిచేస్తున్నాయన్నారు.  రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువులు, పురుగుమందులను సబ్సిడీ పై అందించడంతో పాటు   వ్యవసాయ  సలహాలు సూచనలు రైతు భరోసా కేంద్రాల ద్వారా లభిస్తున్నట్లు మంత్రి తెలిపారు.  రైతు భరోసా కేంద్రాల నిర్వహణ దేశంలో ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నట్లు మంత్రి శ్రీ గోవర్ధన్ రెడ్డి తెలిపారు. ఈ సెకండరీ ప్రాసెసింగ్ యూనిట్‌ రావడంతో  భవిష్యత్తులో  ఈ ప్రాంతంలో మరిన్ని పుడ్  ప్రాసెసింగ్ యూనిట్స్  ఏర్పడి రైతులకు మరింత లాభం కలుగుతుందని మంత్రి  తెలిపారు. ఈ ప్రాజెక్ట్ నుండి వచ్చే ఫలితాలు చిన్న మరియు మధ్యతరహా రైతుల జీవన ప్రమాణాలు మెరుగుపడుతాయని మంత్రి తెలిపారు.  ఈ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు వలన అనంతపురం జిల్లాలో 6 వేల మంది  చిన్న, సన్నకారు రైతులు ప్రయోజనం పొందగలరని మంత్రి అన్నారు. ఫ్లిప్  కార్ట్ ప్రాతినిధ్యంతో వాల్ మార్ట్ ఫౌండేషన్ గ్రాంట్ ఫండింగ్ మద్దతుతో ఈ ప్రాజెక్ట్ సాధ్యమైందని మంత్రి వివరించారు.   ఈ కార్యక్రమాన్ని  చేపట్టినందుకు  ఈ సంధర్భంగా మంత్రి శ్రీ గోవర్ధన్ రెడ్డి,బివాల్ మార్ట్ ఫౌండేషన్, ఫ్లిప్ కార్ట్,  ఇక్రిశాట్, ఏఎఫ్ఈసీ  లను  అభినందించారు.  భవిష్యత్ లో ఈ తరహా పరిశ్రమలతో భాగస్వామ్యాలు చేసుకోవడానికి ప్రభుత్వం  ఆసక్తిగా వున్నట్లు మంత్రి తెలిపారు.


ఈ కార్యక్రమంలో  ఫ్లిప్ కార్ట్ ప్రతినిధి శ్రీ గిరిధర్ పాల్గొన్నారు. Comments