శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి

 శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి


, విజయవాడ (ప్రజా అమరావతి): 

   శ్రీఅమ్మవారి సారె సమర్పించుటకు విశేషముగా విచ్చేస్తున్న భక్తుల రద్దీ మరియు ఆదివారం సందర్భంగా శ్రీ అమ్మవారి దర్శనార్ధం విచ్చేయు భక్తుల రద్దీ దృష్ట్యా భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు ను క్షేత్ర స్థాయిలో స్వయంగా పర్యవేక్షించిన ఆలయ కార్యనిర్వహణాధికారి దర్భముళ్ల భ్రమరాంబ గారు...

భక్తుల రద్దీ సందర్భంగా భక్తుల సౌకర్యార్థం, రద్దీ క్రమబద్దీకరించి, భక్తులకు  త్వరగా శ్రీ అమ్మవారి దర్శనం కల్పించుటకు గానూ  శుక్ర, ఆది వారం మరియు పర్వదినములలో సిబ్బందికి ప్రత్యేక విధులు కేటాయించిన కార్యనిర్వహణాధికారి గారు..


పెద్ద సంఖ్యలో విచ్చేసి, శ్రీ అమ్మవారిని స్వామివారిని దర్శించుకున్న భక్తులు..


నిత్య ఆర్జిత సేవలైన శ్రీ అమ్మవారి ఖడ్గమాలార్చన, లక్షకుంకుమార్చన, శ్రీచక్రనవావరణార్చన, చండీహోమం, శాంతికళ్యాణం మరియు ఇతర సేవల యందు విశేషముగా పాల్గొని, శ్రీ అమ్మవారిని స్వామివారిని దర్శించుకున్న భక్తులు....

Comments