స్పందన విజ్ఞప్తులను పరిష్కరించకుండా మొక్కుబడిగా పరిశీలించి మూసివేస్తున్న సచివాలయ సిబ్బందిపై క్రమశిక్షణాచర్యలు

 

నెల్లూరు ఆగస్టు 26 (ప్రజా అమరావతి);


స్పందన విజ్ఞప్తులను పరిష్కరించకుండా  మొక్కుబడిగా పరిశీలించి మూసివేస్తున్న సచివాలయ సిబ్బందిపై క్రమశిక్షణాచర్యలు


తీసుకుంటామని జిల్లా కలెక్టర్ శ్రీ కె వి ఎన్  చక్రధర్ బాబు హెచ్చరించారు.


శుక్రవారం నెల్లూరు కార్పొరేషన్ పరిధిలోని అరుణమ్మ వీధి సచివాలయం, బాలాజీ నగర్ సచివాలయాలను జిల్లా కలెక్టర్ తనిఖీ చేశారు. ప్రతిరోజు 3 గంటల నుండి 5 గంటల వరకు ప్రతి సచివాలయంలో స్పందన కార్యక్రమం విధిగా నిర్వహించాలన్నారు. ఆయా విజ్ఞప్తులను నిర్దేశించిన గడువులోగా పరిష్కరించాలన్నారు. కేవలం మొక్కుబడిగా సమస్యను పరిష్కరించినట్లుగా చూపి, ఆయా దరఖాస్తులను మూసివేయడం తగదన్నారు. ఒకే సమస్య  మరల మరల స్పందనలో వస్తుందంటే సదరు సమస్యను సక్రమంగా పరిష్కరించలేదని అర్థ

మన్నారు. స్పందనలో వచ్చే ప్రతి దరఖాస్తును క్షుణ్నంగా పరిశీలించి సమస్య మూలాల్లోకెళ్లి పరిష్కారానికి కృషి చేయాలని సచివాలయ సిబ్బందిని ఆదేశించారు.


అదేవిధంగా గృహ నిర్మాణాల పురోగతి గురించి ఇంజనీరింగ్ సహాయకులతో విచారించారు. గృహ నిర్మాణం నకు సంబంధించి దశల వారీగా అన్ని దశలలో ఆన్లైన్లో అప్డేట్ చేయవలసిందిగా సిబ్బందికి  సూచించారు. నిర్దేశించిన లక్ష్యం మేరకు కృషి చేయాలని కోరారు. లబ్ధిదారులకు నిరంతరం అందుబాటులో ఉంటూ, వేగంగా నిర్మాణాలు పూర్తి అయ్యేందుకు కృషి చేయాలన్నారు.


జగనన్న తోడు, చేయూత పథకాల గురించి సంక్షేమ కార్యదర్శులతో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ఆయా పథకాలు ప్రారంభమైన వారం లోపు లబ్ధిదారులు అందరికీ వారి వారి అకౌంట్లో తప్పనిసరిగా నగదు జమ కావాలన్నారు. ఈ క్రమంలో ఇబ్బందులు తలెత్తితే వెంటనే మున్సిపల్ కమిషనర్ దృష్టికి తీసుకువెళ్లాలని సిబ్బందికి సూచించారు. సచివాలయ పరిధిలోని ఆయా పధకాల  లబ్ధిదారులoదరికీ నగదు జమ అయిందీ, లేనిదీ  తెలుసుకోవాల్సిన బాధ్యత సిబ్బందిపై ఉందన్నారు. ఎక్కడా ఎటువంటి జాప్యంను సహించేది లేదన్నారు.


కోవిడ్ వ్యాక్సినేషన్ తీరుతెన్నుల గురించి విచారిస్తూ, 18 ఏళ్ళ నుండి 50 ఏళ్ల వయసు లోపు అందరికీ కోవాక్సిన్ / కోవిషీల్డ్ బూస్టర్ డోస్ అందించాలన్నారు.  అందరికీ అవగాహన కల్పిస్తూ 100% పూర్తయ్యేందుకు కృషి చేయాలని సిబ్బందికి సూచించారు.


అదేవిధంగా ఓటర్ కార్డు తో ఆధార్ అనుసంధాన ప్రక్రియ గురించి జిల్లా కలెక్టర్ విచారించారు.  బి ఎల్ వో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది, వారికి కేటాయించిన ఓటర్లను నిర్దేశిత గడువులోగా ఆధార్ తో అనుసంధానం చేయడానికి ప్రణాళిక వేసుకొని పూర్తి చేయాలన్నారు. ప్రజల నుండి సేకరించిన ఆధార్ సమాచారంను సంబంధిత సూపర్వైజర్లకు జాగ్రత్తగా  అందించి భద్రపరచాలన్నారు.


పారిశుద్ధ్య కార్యక్రమంపై సమీక్షిస్తూ, ప్రతిరోజు సిబ్బంది వారి పరిధిలోని వీధులను విధిగా పరిశీలించాలన్నారు. పారిశుధ్య నిర్వహణ లో అలసత్వం ప్రదర్శిస్తే క్రమశిక్షణా చర్యలకు కూడా  వెనుకాడేది లేదన్నారు. పారిశుధ్య నిర్వహణ పై ప్రజలకు నిరంతర అవగాహన కల్పిస్తూ , తడి చెత్త, పోడి చెత్త ను వేర్వేరుగా సేకరించి తరలించాలన్నారు.


ఈ తనిఖీలో జిల్లా కలెక్టర్ వెంట నగరపాలక సంస్థ కమిషనర్ హరిత ఉన్నారు.




Comments
Popular posts
ఉత్తరాఖండ్‌ అసెంబ్లీ సెక్రటేరియట్‌లోని 228 మంది ఉద్యోగులను డిస్మిస్‌ చేస్తూ హైకోర్టు నిర్ణయం సరైనదేనని పేర్కొంది.
Image
ఇంటర్నెట్‌లో గూగుల్ సెర్చ్‌లో సైబర్ క్రైమ్ కేసులు పెరుగుతున్నాయి.
Image
న్యాయప్రక్రియకు..రాజ్యాంగపరమైన చట్టాలకు లోబడి వికేంద్రీకరణ చేయబోతున్నాం.
Image
ఒక్క ఇల్లూ కట్టని చిన్న సైకో ఆర్కే ఇళ్లు కూల్చేస్తున్నాడు
Image
*ఆంథ్ర రత్న జయంతి జూన్ 2* *స్వాతంత్ర్య పోరాటయోధుడు, ఉపాధ్యాయుడు,చీరాల పేరాల ఉద్యమనాయకుడు గాంధేయవాది మన తెలుగువాడు ఆంధ్రరత్న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య జయంతి జూన్ 2.* *కృష్ణా జిల్లా, పెనుగంచిప్రోలు గ్రామంలో 1889 జూన్ 2 న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య జన్మించాడు. ఆయన పుట్టిన మూడవ రోజునే తల్లి సీతమ్మ, మూడో ఏట తండ్రి కోదండ రామస్వామి మరణించారు. అప్పటినుండి పినతండ్రి, నాయనమ్మల సంరక్షణలో పెరిగాడు. కూచిపూడిలోను, గుంటూరులోను ప్రాథమిక విద్య జరిగింది. హైస్కూలులో చదివే సమయంలోనే 'జాతీయ నాట్య మండలి' స్థాపించి సంగీత, నాటక కార్యక్రమాలు నిర్వహించాడు. అయితే చదువుపై అంత శ్రద్ధ చూపకపోవడంచేత మెట్రిక్యులేషనులో తప్పాడు. తరువాత బాపట్ల లో చదివి ఉత్తీర్ణుడయ్యాడు*. *నడింపల్లి వెంకటలక్ష్మీ నరసింహారావు అనే ఒక మిత్రుని సాయంతో 1911లో స్కాట్లండు లోని ఎడింబరో విశ్వ విద్యా లయంలో ఎం.ఎ. చదివాడు*. *తరువాత ఆనంద కుమార స్వామి తో కలసి కొంతకాలం పనిచేశాడు. ఆ సమయంలో 'నందికేశ్వరుడు' రచించిన 'అభినయ దర్పణం' అనే గ్రంథాన్ని “The Mirror of Gesture,” అన్న పేరుతో సంస్కృతం నుండి ఆంగ్లంలోకి అనువదించాడు. ఇది 1917లో 'కేంబ్రిడ్జ్ - హార్వర్డ్ యూనివర్శిటీ ప్రెస్' వారిచే ప్రచురించబడింది.* *తిరిగివచ్చాక, రాజమండ్రి లోను, బందరు లోను కొంతకాలం ఉపాధ్యాయుడిగా పనిచేసాడు. తన స్వతంత్ర భావాల కారణంగా పైవారితో పడక ఆ ఉద్యోగాలు వదలిపెట్టాడు. తరువాత గోపాల కృష్ణయ్య స్వాతంత్ర్య సంగ్రామం లో దూకాడు*. *బ్రిటీష్ ప్రభుత్వం 1919లో చీరాల-పేరాల గ్రామాలను కలిపి పురపాలక సంఘంగా చేయడంతో ప్రజలపై పన్నుల భారం అధికమై పురపాలక సంఘం రద్దు చేయాలని ఉద్యమించారు. ప్రస్తుతం ప్రకాశం జిల్లా లో ఉన్న చీరాల, పేరాల గ్రామాల జనాభా ఆ కాలంలో 15000. జాండ్రపేట, వీరరాఘవపేట గ్రామాలను చీరాల, పేరాలతో కలిపి చీరాల యూనియన్ అని వ్యవహరించే వారు. ఈ యూనియన్ నుంచి ఏడాదికి నాలుగు వేల రూపాయలు వసూలయ్యేవి. మద్రాసు ప్రభుత్వం 1919 లో చీరాల-పేరాలను మున్సిపాలిటీగా ప్రకటించింది. పన్ను ఏడాదికి 40,000 రూపాయలయ్యింది. సౌకర్యాలు మాత్రం మెరుగు పడలేదు. ఇక్కడ ఉన్న నేతపని వారు, చిన్నరైతులు పన్ను చెల్లించలేక మున్సిపాలిటీని రద్దు చేయాలని ప్రభుత్వానికి ఎన్నో వినతి పత్రాలు సమర్పించారు. ఫలితం లేదు. దాంతో వారు దుగ్గిరాల గోపాలకృష్ణయ్య నాయకత్వంలో ఆందోళన ప్రారంభించారు. ఇది స్వాతంత్ర్య పోరాటంలో ఒక ముఖ్యమైన ఘట్టం. ఆంధ్ర దేశం అంతా తిరిగి బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ప్రచారం చేశాడు. నిషేధాన్ని ఉల్లంఘించి బరంపురంలో ఉపన్యాసం చేసినందుకు ఒక సంవత్సరం పాటు జైలు శిక్ష అనుభవించాడు.చీరాల పేరాల ఉద్యమం -మద్రాస్ ప్రసిడెన్సీని కంపింపజేసింది.. ఆ ఉద్యమం మిగతా ప్రాంతాలకు వ్యాపిస్తుందేమోనని ఆంగ్లేయపాలకులు భయకంపితులయినారు..చివరికి జాతీయకాంగ్రీసు జోక్యంతో ఉద్యమం ముగిసింది...* *తెలుగు నాట జానపద కళా రూపాల పునరుద్ధరణకు, గ్రంథాలయాల వ్యాప్తికి గోపాలకృష్ణయ్య ఇతోధికంగా కృషి చేశాడు. 'సాధన' అనే పత్రిక నడిపాడు*. *ఆయన ప్రచారం చేసిన జానపద కళారీతులు - తోలుబొమ్మలాట, జముకుల కథ, బుర్రకథ, వీధి నాటకాలు, సాము గరిడీలు, గొల్ల కలాపం, బుట్ట బొమ్మలు, కీలు గుర్రాలు, వాలకాలు, గోసంగి, గురవయ్యలు, సరదా కథ, కిన్నెర కథ, కొమ్ము బూర,జోడు మద్దెల, పల్లె సుద్దులు, తూర్పు భాగోతం, చుట్టు కాముడు, పిచ్చికుంట్లవాళ్ళ కథ, సాధనా శూరులు, పలనాటి వీర విద్యావంతులు - వగైరా* *గోపాలకృష్ణయ్య నియమ తత్పరుడు. 'శ్రీరామదండు' అనే ఆధ్యాత్మిక, జాతీయతా స్వచ్ఛంద సమూహాన్ని ఏర్పాటు చేశాడు.* *1921 లో గుంటూరులో ఒక సభలో "ఆంధ్ర రత్న" అన్న బిరుదుతో ఆయనను సత్కరించారు.* *ఈ మహనీయుని త్యాగాలకు తెలుగుజాతి సర్వదా ఋణపడివుంది*. *ఉపాధ్యాయ సేవా కేంద్రం,విజయవాడ*
Image