అర్జీదారులు సంతృప్తి చెందేలా సత్వరమే పరిష్కార మార్గం చూపాలి


నెల్లూరు, ఆగస్టు 23 (ప్రజా అమరావతి):  వివిధ సమస్యలపై ప్రజలు అందించే స్పందన అర్జీల పరిష్కారానికి జిల్లా కలెక్టర్లు అత్యంత ప్రాధాన్యతనిస్తూ, అర్జీదారులు సంతృప్తి చెందేలా సత్వరమే పరిష్కార మార్గం చూపాల



ని  ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి కలెక్టర్లను ఆదేశించారు.


 మంగళవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, వివిధ అంశాలపై జిల్లా కలెక్టర్ల తో వీడియో కాన్ఫరెన్స్  నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి  మాట్లాడుతూ గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రతిరోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి 5 గంటల వరకు నిర్వహించే స్పందన, ప్రతి సోమవారం జిల్లా, డివిజన్, మండల స్థాయిలో నిర్వహించే స్పందన కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో కలెక్టర్లు పర్యవేక్షించాలని, ప్రత్యేకంగా ప్రతి బుధవారం స్పందన అర్జీలపై కలెక్టర్లు  సమీక్షించాలని ఆదేశించారు. అర్జీలు పునరావృతం కాకుండా త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రజలు సంతృప్తి చెందేలా సత్వరమే పరిష్కార మార్గం చూపించాలన్నారు. అధికారులు సమస్యను పరిష్కరించి అర్జీదారులతో ఒక ఫోటో దిగి స్పందన పోర్టల్ లో అప్లోడ్ చేయాలని సూచించారు.  అలాగే సచివాలయ, రైతు భరోసా, డిజిటల్ లైబ్రరీ, వైయస్సార్ హెల్త్ క్లినిక్ భవన నిర్మాణాల్లో పురోగతి సాధించేందుకు కలెక్టర్లు కృషి చేయాలని సూచించారు. జగనన్న ఇళ్ల నిర్మాణాల్లో దశలవారీగా పురోగతి సాధించేందుకు అవసరమైన అన్ని చర్యలు సకాలంలో చేపట్టాలన్నారు. నాడు నేడు పథకం కింద పాఠశాలలు, ఆస్పత్రుల్లో అభివృద్ధి పనులను వేగంగా చేపట్టాలన్నారు. జగనన్న శాశ్వత భూ హక్కు భూ రక్ష పథకం కింద రీ సర్వేను వేగంగా చేపట్టి అక్టోబర్ 2 నాటికి ఎంపిక చేసిన గ్రామాల్లో సరే పూర్తిచేసి రైతులకు భూ హక్కు పత్రాలను అందించేలా ప్రణాళికాబద్ధంగా పనిచేయాలన్నారు. 

రాష్ట్ర ప్రభుత్వం ఈ నెలలో అమలు చేయనున్న నేతన్న నేస్తం, సెప్టెంబర్లో అమలు చేయనున్న వైయస్సార్ చేయూత పథకాలకు సంబంధించి ఏర్పాట్లను త్వరగా పూర్తి చేయాలని, అర్హుల జాబితాను సకాలంలో సచివాలయాల్లో ప్రదర్శించేలా  చర్యలు చేపట్టాలని, ఈ పథకాలకు సంబంధించి ఏమైనా ఫిర్యాదులు ఉంటే వెంటనే పరిష్కరించాలని ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశించారు.


స్పందన అర్జీలపై కలెక్టర్ సమీక్ష

...................................... 

స్పందన అర్జీల పరిష్కారానికి అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని  జిల్లా కలెక్టర్ శ్రీ కె వి ఎన్ చక్రధర్ బాబు ఆదేశించారు. సీఎం వీడియో కాన్ఫరెన్స్ కు ముందు స్పందన అర్జీలపై డిఆర్ఓ శ్రీమతి వెంకట నారాయణమ్మ, జాయింట్ కలెక్టర్ శ్రీ కూర్మనాథ్ తో కలిసి కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అధికారులు వారంలో ఒకసారి కాకుండా ప్రతిరోజు స్పందన అర్జీలను పరిశీలించుకుని సమీక్షించాలన్నారు. అధికారులు సమన్వయంతో పనిచేసి అర్జీలు పెండింగ్లో లేకుండా, గడువు దాటకుండా పరిష్కరించాలన్నారు. స్పందన అర్జీల పురోగతిపై ప్రతి మంగళవారం ముఖ్యమంత్రి, గురువారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రత్యేకంగా సమీక్ష నిర్వహిస్తున్నారని, అధికారులు స్పందన అర్జీల పట్ల నిర్లక్ష్యం వహించకుండా సత్వరమే పరిష్కరించేందుకు ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ముఖ్యంగా రెవిన్యూ, పంచాయితీ, మున్సిపాలిటీ శాఖల్లో ఎక్కువగా అర్జీలు పెండింగ్ లో ఉన్నాయని, ఈ శాఖల అధికారులు అర్జీల పరిష్కారానికి ప్రత్యేక చొరవ చూపాలన్నారు. 


ఈ వీడియో కాన్ఫరెన్స్ కు కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణం నుంచి జిల్లా కలెక్టర్ శ్రీ కె వి ఎన్ చక్రధర్ బాబు, జాయింట్ కలెక్టర్ శ్రీ కూర్మనాథ్, నగరపాలక సంస్థ కమిషనర్ శ్రీమతి హరిత, ఎఎస్పి శ్రీమతి హిమవతి, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ శ్రీ మహేష్, డిపిఓ శ్రీమతి ధనలక్ష్మి, డ్వామా, డిఆర్డిఎ, హౌసింగ్, ఐసిడిఎస్ పిడిలు శ్రీ వెంకట్రావు, శ్రీ సాంబశివారెడ్డి, శ్రీ రంగ వరప్రసాద్, శ్రీమతి ఉమామహేశ్వరి, డిఎంహెచ్ఓ శ్రీ పెంచలయ్య, జడ్పీ సీఈవో శ్రీమతి వాణి, పంచాయతీరాజ్ శాఖ, ఆర్డబ్ల్యూఎస్, విద్యుత్ శాఖల ఎస్ఇలు శ్రీ శివారెడ్డి, శ్రీరంగ వరప్రసాద్, శ్రీ విజయ్ కుమార్ రెడ్డి, సర్వే ల్యాండ్ రికార్డుల ఎడి శ్రీ హనుమాన్ ప్రసాద్, మైనార్టీ వెల్ఫేర్ అధికారి శ్రీమతి కనక దుర్గాభవాని, బీసీ వెల్ఫేర్ అధికారి శ్రీ వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.


Comments
Popular posts
ఉత్తరాఖండ్‌ అసెంబ్లీ సెక్రటేరియట్‌లోని 228 మంది ఉద్యోగులను డిస్మిస్‌ చేస్తూ హైకోర్టు నిర్ణయం సరైనదేనని పేర్కొంది.
Image
ఒక్క ఇల్లూ కట్టని చిన్న సైకో ఆర్కే ఇళ్లు కూల్చేస్తున్నాడు
Image
*ఆంథ్ర రత్న జయంతి జూన్ 2* *స్వాతంత్ర్య పోరాటయోధుడు, ఉపాధ్యాయుడు,చీరాల పేరాల ఉద్యమనాయకుడు గాంధేయవాది మన తెలుగువాడు ఆంధ్రరత్న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య జయంతి జూన్ 2.* *కృష్ణా జిల్లా, పెనుగంచిప్రోలు గ్రామంలో 1889 జూన్ 2 న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య జన్మించాడు. ఆయన పుట్టిన మూడవ రోజునే తల్లి సీతమ్మ, మూడో ఏట తండ్రి కోదండ రామస్వామి మరణించారు. అప్పటినుండి పినతండ్రి, నాయనమ్మల సంరక్షణలో పెరిగాడు. కూచిపూడిలోను, గుంటూరులోను ప్రాథమిక విద్య జరిగింది. హైస్కూలులో చదివే సమయంలోనే 'జాతీయ నాట్య మండలి' స్థాపించి సంగీత, నాటక కార్యక్రమాలు నిర్వహించాడు. అయితే చదువుపై అంత శ్రద్ధ చూపకపోవడంచేత మెట్రిక్యులేషనులో తప్పాడు. తరువాత బాపట్ల లో చదివి ఉత్తీర్ణుడయ్యాడు*. *నడింపల్లి వెంకటలక్ష్మీ నరసింహారావు అనే ఒక మిత్రుని సాయంతో 1911లో స్కాట్లండు లోని ఎడింబరో విశ్వ విద్యా లయంలో ఎం.ఎ. చదివాడు*. *తరువాత ఆనంద కుమార స్వామి తో కలసి కొంతకాలం పనిచేశాడు. ఆ సమయంలో 'నందికేశ్వరుడు' రచించిన 'అభినయ దర్పణం' అనే గ్రంథాన్ని “The Mirror of Gesture,” అన్న పేరుతో సంస్కృతం నుండి ఆంగ్లంలోకి అనువదించాడు. ఇది 1917లో 'కేంబ్రిడ్జ్ - హార్వర్డ్ యూనివర్శిటీ ప్రెస్' వారిచే ప్రచురించబడింది.* *తిరిగివచ్చాక, రాజమండ్రి లోను, బందరు లోను కొంతకాలం ఉపాధ్యాయుడిగా పనిచేసాడు. తన స్వతంత్ర భావాల కారణంగా పైవారితో పడక ఆ ఉద్యోగాలు వదలిపెట్టాడు. తరువాత గోపాల కృష్ణయ్య స్వాతంత్ర్య సంగ్రామం లో దూకాడు*. *బ్రిటీష్ ప్రభుత్వం 1919లో చీరాల-పేరాల గ్రామాలను కలిపి పురపాలక సంఘంగా చేయడంతో ప్రజలపై పన్నుల భారం అధికమై పురపాలక సంఘం రద్దు చేయాలని ఉద్యమించారు. ప్రస్తుతం ప్రకాశం జిల్లా లో ఉన్న చీరాల, పేరాల గ్రామాల జనాభా ఆ కాలంలో 15000. జాండ్రపేట, వీరరాఘవపేట గ్రామాలను చీరాల, పేరాలతో కలిపి చీరాల యూనియన్ అని వ్యవహరించే వారు. ఈ యూనియన్ నుంచి ఏడాదికి నాలుగు వేల రూపాయలు వసూలయ్యేవి. మద్రాసు ప్రభుత్వం 1919 లో చీరాల-పేరాలను మున్సిపాలిటీగా ప్రకటించింది. పన్ను ఏడాదికి 40,000 రూపాయలయ్యింది. సౌకర్యాలు మాత్రం మెరుగు పడలేదు. ఇక్కడ ఉన్న నేతపని వారు, చిన్నరైతులు పన్ను చెల్లించలేక మున్సిపాలిటీని రద్దు చేయాలని ప్రభుత్వానికి ఎన్నో వినతి పత్రాలు సమర్పించారు. ఫలితం లేదు. దాంతో వారు దుగ్గిరాల గోపాలకృష్ణయ్య నాయకత్వంలో ఆందోళన ప్రారంభించారు. ఇది స్వాతంత్ర్య పోరాటంలో ఒక ముఖ్యమైన ఘట్టం. ఆంధ్ర దేశం అంతా తిరిగి బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ప్రచారం చేశాడు. నిషేధాన్ని ఉల్లంఘించి బరంపురంలో ఉపన్యాసం చేసినందుకు ఒక సంవత్సరం పాటు జైలు శిక్ష అనుభవించాడు.చీరాల పేరాల ఉద్యమం -మద్రాస్ ప్రసిడెన్సీని కంపింపజేసింది.. ఆ ఉద్యమం మిగతా ప్రాంతాలకు వ్యాపిస్తుందేమోనని ఆంగ్లేయపాలకులు భయకంపితులయినారు..చివరికి జాతీయకాంగ్రీసు జోక్యంతో ఉద్యమం ముగిసింది...* *తెలుగు నాట జానపద కళా రూపాల పునరుద్ధరణకు, గ్రంథాలయాల వ్యాప్తికి గోపాలకృష్ణయ్య ఇతోధికంగా కృషి చేశాడు. 'సాధన' అనే పత్రిక నడిపాడు*. *ఆయన ప్రచారం చేసిన జానపద కళారీతులు - తోలుబొమ్మలాట, జముకుల కథ, బుర్రకథ, వీధి నాటకాలు, సాము గరిడీలు, గొల్ల కలాపం, బుట్ట బొమ్మలు, కీలు గుర్రాలు, వాలకాలు, గోసంగి, గురవయ్యలు, సరదా కథ, కిన్నెర కథ, కొమ్ము బూర,జోడు మద్దెల, పల్లె సుద్దులు, తూర్పు భాగోతం, చుట్టు కాముడు, పిచ్చికుంట్లవాళ్ళ కథ, సాధనా శూరులు, పలనాటి వీర విద్యావంతులు - వగైరా* *గోపాలకృష్ణయ్య నియమ తత్పరుడు. 'శ్రీరామదండు' అనే ఆధ్యాత్మిక, జాతీయతా స్వచ్ఛంద సమూహాన్ని ఏర్పాటు చేశాడు.* *1921 లో గుంటూరులో ఒక సభలో "ఆంధ్ర రత్న" అన్న బిరుదుతో ఆయనను సత్కరించారు.* *ఈ మహనీయుని త్యాగాలకు తెలుగుజాతి సర్వదా ఋణపడివుంది*. *ఉపాధ్యాయ సేవా కేంద్రం,విజయవాడ*
Image
Shiv Nadar University Chennai inaugurated its flagship Quiz Competition - QUBIZ
Image
बर्खास्त होंगे उत्तराखंड विधानसभा सचिवालय के 228 कर्मी, हाईकोर्ट ने फैसला सही कहा।
Image