ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పధకాలు అర్హులైన ప్రతి లబ్ధిదారునికి అందేలా కృషి చేయాలి


నెల్లూరు (ప్రజా అమరావతి);ప్రజలకు నిత్యం అందుబాటులో  వుండి,   ప్రజలు సంతృప్తి చెందేలా మెరుగైన సేవలు అందించడంతో పాటు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పధకాలు అర్హులైన ప్రతి లబ్ధిదారునికి అందేలా కృషి చేయాల


ని   జిల్లా కలెక్టర్ శ్రీ కె.వి.ఎన్. చక్రధర్ బాబు,  సచివాలయ సిబ్బందిని   ఆదేశించారు.


బుధవారం ఉదయం వెంకటాచలం మండలం,  అనికేపల్లి-2  సచివాలయాన్ని  జిల్లా  కలెక్టర్  శ్రీ చక్రధర్ బాబు ఆకస్మికంగా తనిఖీ చేశారు. శ్రీ వి.వి. గిరి గారి జయంతిని పురస్కరించుకుని జిల్లా కలెక్టర్ శ్రీ చక్రధర్ బాబు, వి.వి.గిరి చిత్ర పటానికి పూల మాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా  జిల్లా కలెక్టర్ శ్రీ చక్రధర్ బాబు, సచివాలయ పరిధిలో జరుగుచున్న ప్రభుత్వ కార్యక్రమాల గురించి  సచివాలయ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.  కలెక్టర్ మాట్లాడుతూ,  సచివాలయ సిబ్బంది క్రమశిక్షణతో పనిచేసి ఎటువంటి దరఖాస్తులు  పెండింగ్ లేకుండా సత్వరం పరిష్కరించేలా  కృషి చేయడంతో పాటు  ప్రజలకు నిత్యం అందుబాటులో వుండి,  ప్రజలు సంతృప్తి చెందేలా మెరుగైన సేవలు అందించాలన్నారు. సచివాలయ పరిధిలో  జగనన్న కాలనీల్లో చేపడుతున్న  గృహ నిర్మాణాల పురోగతిని,  జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం అమలు గురించి  జిల్లా కలెక్టర్, గృహ నిర్మాణ శాఖ అధికారులను అడిగి తెలుసుకుని,  త్వరితగతిన ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్,  గృహ నిర్మాణ శాఖ అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాల పట్ల ప్రజలకు అవగాహన కల్పిస్తూ   అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు  అందేలా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్  శ్రీ చక్రధర్ బాబు,  సచివాలయ సిబ్బందిని ఆదేశించారు.   

 

జిల్లా కలెక్టర్ వెంట తహసిల్ధార్ శ్రీ నాగరాజు,  ఎం.పి.డి.ఓ శ్రీమతి సుస్మిత, హౌసింగ్ శాఖ అధికారులు,  సచివాలయ  సిబ్బంది తదితరులు  పాల్గొన్నారు.

 


Comments
Popular posts
అర్హులైన వారందరికీ వర్తించేలా వైయస్సార్‌ కళ్యాణమస్తు, వైయస్సార్‌ షాదీ తోఫా.
Image
శరన్నవరాత్రి మహోత్సవాల్లో ఆరవ రోజున శ్రీ కనకదుర్గమ్మ వారు శ్రీ మహాలక్ష్మి గా దర్శనమిస్తారు.
Image
శరన్నవరాత్రి మహోత్సవాల్లో ఏడవ రోజున శ్రీ కనక దుర్గమ్మ వారు శ్రీ సరస్వతి దేవి అలంకారంలో దర్శనం ఇస్తారు.
Image
అక్టోబరు 25న ఇ–క్రాపింగ్‌ జాబితాలు సచివాలయాల్లో ప్రదర్శన, షెడ్యూల్‌ వివరించిన సీఎం.
Image
భోగాపురం గ్రీన్‌ఫీల్డ్‌ అంతర్జాతీయ విమానాశ్రయం అభివృద్ధికి సహకరించాలని కేంద్ర మంత్రిని కోరిన ముఖ్యమంత్రి.
Image