జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్య, నాటక రంగ అభివృద్దికి అహర్నిశలు కృషి చేసిన మహనీయులు

 

నెల్లూరు (ప్రజా అమరావతి);

 

జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్య, నాటక రంగ అభివృద్దికి అహర్నిశలు కృషి చేసిన  మహనీయులు


బళ్ళారి రాఘవ గార్ల జీవితాలు నేటి యువత ఆదర్శంగా  తీసుకోవాలని నెల్లూరు నగర మేయర్ శ్రీమతి పొట్లూరి స్రవంతి పేర్కొన్నారు.

 

ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ – హర్ ఘర్ తిరంగా ఉత్సవాల్లో భాగంగా రెండవ రోజు  మంగళవారం ఉదయం కలెక్టరేట్ లోని తిక్కన ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నెల్లూరు నగర మేయర్ శ్రీమతి పొట్లూరి స్రవంతి పాల్గొని  పింగళి వెంకయ్య, బళ్ళారి రాఘవ గార్ల  జయంతి సంధర్బంగా వారి చిత్రాపటాలకు  పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.  ఈ సంధర్భంగా మేయర్ మాట్లాడుతూ,  ఎంతో మంది స్వాతంత్ర్య సమరయోధుల త్యాగ ఫలితమే నేడు స్వేచ్చగా జీవిస్తున్నామన్నారు. వారందరినీ స్మరించులోవాల్సిన   బాధ్యత మనందరిపై ఉందన్నారు. మహనీయులు జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్య, బళ్ళారి రాఘవ గార్ల జీవితాలు మనందరికీ ఆదర్శం, స్పూర్తిదాయకమని, నేటి యువత వారి అడుగు జాడల్లో నడుచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. 

 

ఆంద్రప్రదేశ్ రాష్ట్ర  జంగం వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పోరేషన్ చైర్ పర్సన్ శ్రీమతి ప్రసన్న మాట్లాడుతూ,  త్రివర్ణ పతాక రూపకర్త పింగళి వెంకయ్య, బళ్ళారి రాఘవ లాంటి మహనీయుల  జీవిత చరిత్ర ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని,  విభిన్న సంస్కృతులకు నిలయమైన భారత దేశ ప్రజానీకాన్ని ఒక్క తాటి మీదకు తెచ్చే జాతీయ జెండాను రూపొందించిన వ్యక్తి పింగళి వెంకయ్య అని,  అలాగే నాటక రంగం ద్వారా తెలుగు ప్రజల్లో చిర స్థాయిగా నిలిచి పోయిన మహనీయులు  బళ్ళారి  రాఘవ గారని,  వారి జీవితాలను స్ఫూర్తిగా తీసుకోవాల్సిన బాధ్యత నేటి యువత పై ఉందన్నారు.

 

జిల్లా పరిషత్ సీఈవో శ్రీమతి  వాణి  మాట్లాడుతూ,  దేశానికి స్వాతంత్రం  సిద్దించి   75 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంలో ప్రజల్లో దేశభక్తి భావం,   జాతీయ పతాకం పట్ల అవగాహన పెంపొందించడానికి ఆజాదీ కా అమృత్ మహోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా  నిర్వహించుకోవడం జరుగుచున్నదన్నారు .  అందులో భాగంగా నేడు  జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్య, బళ్ళారి రాఘవ గార్ల జయంతిని ఘనంగా జరుపుకుంటున్నట్లు ఆమె తెలిపారు.

 

జిల్లా పంచాయతీ అధికారి   శ్రీమతి ధనలక్ష్మి, ఆజాదీ కా అమృత్ మహోత్సవ కార్యక్రమంలో  భాగంగా   ఈ నెల 1వ తేదీ నుండి 15వ తేదీ వరకు హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని జిల్లా వ్యాప్తంగా  విస్తృతంగా నిర్వహించేందుకు 1వ తేదీ నుండి 15వ తేదీ వరకు ప్రతి రోజు నిర్దేశించిన  కార్యక్రమాలను జరుపుకోవడం జరుగుచున్నదన్నారు

 

స్వాతంత్ర్య సమర యోధులు శ్రీ కె.వి.చలమయ్య మాట్లాడుతూ, ఈ రోజు ప్రత్యేకమైన రోజని, పింగళి వెంకయ్య, బళ్ళారి రాఘవ  గార్ల జయంతిని   జరుపుకోవడం మన అదృష్టమని, ప్రపంచం ఉన్నంత కాలం వారిని స్మరించుకోవడం జరుగుతుందన్నారు. ఎందరో త్యాగమూర్తుల త్యాగఫలితమే  మనకు స్వాతంత్ర్యం వచ్చిందని, ఆ త్యాగమూర్తుల జీవితాలను ఆదర్శంగా తీసుకోవాల్సిన బాధ్యత  మనందరిపై ఉందన్నారు.

 

తొలుత  జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్య గారి జీవిత చరిత్రను డి.ఎస్. డబ్ల్యూ.ఓ శ్రీ  వెంకటయ్య చదివి వినిపించగా,  బళ్ళారి రాఘవ గారి జీవిత చరిత్రను ఎపి ఎంఐపి ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీ శ్రీనివాసులు చదివి వినిపించారు.

 

ఈ కార్యక్రమంలో  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముస్లిం సంచార జాతుల  వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పోరేషన్ చైర్ పర్సన్ శ్రీమతి సయ్యద్ ఆసిఫా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బొందిలి వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పోరేషన్ చైర్మన్ శ్రీ ఎస్. కిషోర్ సింగ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముదిరాజ్ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పోరేషన్ చైర్మన్ శ్రీ కె. వెంకట నారాయణ ముదిరాజ్,   సమగ్ర శిక్ష అడిషనల్ ప్రాజెక్టు కొ ఆర్డినేటర్ శ్రీమతి ఉషారాణి,  ఇంచార్జీ నెల్లూరు మున్సిపల్ కమీషనర్ శ్రీ చెన్నుడు,  కార్పోరేషన్ పరిధిలోని సచివాలయ సిబ్బంది,  విద్యార్ధులు తదితరులు పాల్గొన్నారు.

 

 


Comments