ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చిన అనేక రకాల పౌర సేవలను ప్రజలకు మరింత చేరువ చేయాలి


నెల్లూరు, ఆగస్టు 16 (ప్రజా అమరావతి): ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చిన అనేక రకాల పౌర సేవలను ప్రజలకు మరింత చేరువ చేయాలని జిల్లా కలెక్టర్ శ్రీ కెవిఎన్ చక్రధర్ బాబు సచివాలయ సిబ్బందిని ఆదేశించారు. 

 మంగళవారం సాయంత్రం ఆత్మకూరు సమీపంలోని  నెల్లూరుపాలెం వార్డు సచివాలయాన్ని జిల్లా కలెక్టర్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సచివాలయాల్లో ఎటువంటి దరఖాస్తులు పెండింగ్లో లేకుండా సత్వరమే పరిష్కరించాలన్నారు. సర్వీసులకు సంబంధించిన అన్ని రిజిస్టర్లను సక్రమంగా నిర్వహించాలని సూచించారు. జగనన్న ఇళ్లకు సంబంధించి బిల్లులను సకాలంలో అప్లోడ్ చేయాలన్నారు. 

 కలెక్టర్ వెంట  ఆత్మకూరు మున్సిపల్ కమిషనర్ శ్రీ రమేష్, ఆర్ డి ఓ శ్రీమతి కరుణ కుమారి, హౌసింగ్ పిడి శ్రీ బిఆర్ రంగ వరప్రసాద్, ఈఈ శ్రీ శ్రీనివాసులు, డిఈ  పి నటరాజ్, సచివాలయ అడ్మిన్ హరిశివ, సిబ్బంది ఉన్నారు. 


Comments