గ్రామాల అభివృద్ది, ప్రజల సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తున్నది


నెల్లూరు (ప్రజా అమరావతి);


గ్రామాల అభివృద్ది, ప్రజల సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం   పని చేస్తున్నదని


రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్,  ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ  మంత్రి శ్రీ కాకాణి గోవర్ధన్ రెడ్డి  పేర్కొన్నారు.


శుక్రవారం సాయంత్రం సర్వేపల్లి నియోజకవర్గ పరిధిలోని, ముత్తుకూరు మండలం పాటూరివారికండ్రిగ, దువ్వూరువారిపాలెం గ్రామాల్లో   చేపట్టిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న  మంత్రి శ్రీ కాకాణి గోవర్ధన్ రెడ్డికి  పెద్ద ఎత్తున  మహిళలు, అభిమానులు,  ప్రజలు  అపూర్వ  స్వాగతం పలికారు. అనంతరం మంత్రి  గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్లి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న  సంక్షేమ పధకాలు గురించి వివరిస్తూ, వారి సమస్యలు తెలుసుకుంటూ,  వారు పొందుతున్న లబ్ధి సమాచారంతో కూడిన బుక్ లెట్‌ను అందజేశారు. 


ఈ సంధర్బంగా  మంత్రి  శ్రీ  గోవర్ధన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, సమగ్రంగా, సంపూర్ణంగా  అర్హత కల్గిన ప్రతి పేద కుటుంబానికి  సంక్షేమ కార్యక్రమాలు అందించడమే లక్ష్యంతో   రాష్ట్ర ముఖ్యమంత్రి  శ్రీ వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి గారు 175 నియోజక వర్గాల్లో  గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి శ్రీకారం చుట్టారన్నారు. సమగ్రంగా, సంపూర్ణంగా  అర్హత కల్గిన ప్రతి పేద కుటుంబానికి  సంక్షేమ కార్యక్రమాలు అందించడమే గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ఉద్దేశ్యమని ఈ కార్యక్రమం ద్వారా ప్రతి కుటుంబం వద్దకు వెళ్ళి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూ,  సాంకేతిక  కారణాలతో అర్హత ఉండి కూడా సంక్షేమ పథకాలు అందని  పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాల ప్రయోజనాన్ని అందించడం జరుగుచున్నదన్నారు.  ప్రజలు కోరిన విధంగా  గ్రామాల్లో అభివృద్ది కార్యక్రమాలను చేపట్టుటకు ప్రతి సచివాలయానికి 20 లక్షల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించడం జరిగిందన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో 95 శాతం మేర నెరవేర్చడం జరుగుచున్నదన్నారు.  ఈ ప్రాంతంలో మత్స్యకారుల సంక్షేమాన్ని దృష్టిల్లో ఉంచుకొని మినీ ఫిషింగ్ హార్బర్ నిర్మాణానికి సర్వే జరుగుచున్నదని, సర్వే పూర్తి అయిన తరువాత  మినీ ఫిషింగ్ హార్బర్ కు త్వరలోనే శంకుస్థాపనకు చర్యలు  తీసుకోవడం  జరుగుతుందన్నారు. ముత్తుకూరు మండలానికి సంబందించి  నాన్ ఫిషర్ మెన్ ప్యాకేజీ అంశం పెండింగ్ లో వుందని,  ఈ అంశం పరిష్కారానికి 2019 సంవత్సరంలో ఎన్నికల సమయంలో హామీ ఇవ్వడం జరిగిందన్నారు.  హామీ ఇచ్చిన నాటికి ఏ కుటుంబమైతే తెల్ల రేషన్ కార్డు కలిగి వుంటారో ఆ  కుటుంబానికి  25 వేల రూపాయల ఆర్ధిక సహాయం చేయుటకు చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి తెలిపారు. ఈ ప్రాంతానికి ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చడం జరుగుతుందని మంత్రి శ్రీ గోవర్ధన్ రెడ్డి తెలిపారు. 


మంత్రి వెంట ఎంపిపి శ్రీమతి సుగుణమ్మ, తహశీల్దార్ శ్రీ మనోహర్ బాబు,  ఎంపిడిఓ శ్రీమతి ప్రత్యూష, వివిధ శాఖల మండల అధికారులు, ప్రజా ప్రతినిధిలు, వైఎస్సార్సీపీ నాయకులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.



Comments
Popular posts
ఉత్తరాఖండ్‌ అసెంబ్లీ సెక్రటేరియట్‌లోని 228 మంది ఉద్యోగులను డిస్మిస్‌ చేస్తూ హైకోర్టు నిర్ణయం సరైనదేనని పేర్కొంది.
Image
ఇంటర్నెట్‌లో గూగుల్ సెర్చ్‌లో సైబర్ క్రైమ్ కేసులు పెరుగుతున్నాయి.
Image
న్యాయప్రక్రియకు..రాజ్యాంగపరమైన చట్టాలకు లోబడి వికేంద్రీకరణ చేయబోతున్నాం.
Image
*ఆంథ్ర రత్న జయంతి జూన్ 2* *స్వాతంత్ర్య పోరాటయోధుడు, ఉపాధ్యాయుడు,చీరాల పేరాల ఉద్యమనాయకుడు గాంధేయవాది మన తెలుగువాడు ఆంధ్రరత్న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య జయంతి జూన్ 2.* *కృష్ణా జిల్లా, పెనుగంచిప్రోలు గ్రామంలో 1889 జూన్ 2 న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య జన్మించాడు. ఆయన పుట్టిన మూడవ రోజునే తల్లి సీతమ్మ, మూడో ఏట తండ్రి కోదండ రామస్వామి మరణించారు. అప్పటినుండి పినతండ్రి, నాయనమ్మల సంరక్షణలో పెరిగాడు. కూచిపూడిలోను, గుంటూరులోను ప్రాథమిక విద్య జరిగింది. హైస్కూలులో చదివే సమయంలోనే 'జాతీయ నాట్య మండలి' స్థాపించి సంగీత, నాటక కార్యక్రమాలు నిర్వహించాడు. అయితే చదువుపై అంత శ్రద్ధ చూపకపోవడంచేత మెట్రిక్యులేషనులో తప్పాడు. తరువాత బాపట్ల లో చదివి ఉత్తీర్ణుడయ్యాడు*. *నడింపల్లి వెంకటలక్ష్మీ నరసింహారావు అనే ఒక మిత్రుని సాయంతో 1911లో స్కాట్లండు లోని ఎడింబరో విశ్వ విద్యా లయంలో ఎం.ఎ. చదివాడు*. *తరువాత ఆనంద కుమార స్వామి తో కలసి కొంతకాలం పనిచేశాడు. ఆ సమయంలో 'నందికేశ్వరుడు' రచించిన 'అభినయ దర్పణం' అనే గ్రంథాన్ని “The Mirror of Gesture,” అన్న పేరుతో సంస్కృతం నుండి ఆంగ్లంలోకి అనువదించాడు. ఇది 1917లో 'కేంబ్రిడ్జ్ - హార్వర్డ్ యూనివర్శిటీ ప్రెస్' వారిచే ప్రచురించబడింది.* *తిరిగివచ్చాక, రాజమండ్రి లోను, బందరు లోను కొంతకాలం ఉపాధ్యాయుడిగా పనిచేసాడు. తన స్వతంత్ర భావాల కారణంగా పైవారితో పడక ఆ ఉద్యోగాలు వదలిపెట్టాడు. తరువాత గోపాల కృష్ణయ్య స్వాతంత్ర్య సంగ్రామం లో దూకాడు*. *బ్రిటీష్ ప్రభుత్వం 1919లో చీరాల-పేరాల గ్రామాలను కలిపి పురపాలక సంఘంగా చేయడంతో ప్రజలపై పన్నుల భారం అధికమై పురపాలక సంఘం రద్దు చేయాలని ఉద్యమించారు. ప్రస్తుతం ప్రకాశం జిల్లా లో ఉన్న చీరాల, పేరాల గ్రామాల జనాభా ఆ కాలంలో 15000. జాండ్రపేట, వీరరాఘవపేట గ్రామాలను చీరాల, పేరాలతో కలిపి చీరాల యూనియన్ అని వ్యవహరించే వారు. ఈ యూనియన్ నుంచి ఏడాదికి నాలుగు వేల రూపాయలు వసూలయ్యేవి. మద్రాసు ప్రభుత్వం 1919 లో చీరాల-పేరాలను మున్సిపాలిటీగా ప్రకటించింది. పన్ను ఏడాదికి 40,000 రూపాయలయ్యింది. సౌకర్యాలు మాత్రం మెరుగు పడలేదు. ఇక్కడ ఉన్న నేతపని వారు, చిన్నరైతులు పన్ను చెల్లించలేక మున్సిపాలిటీని రద్దు చేయాలని ప్రభుత్వానికి ఎన్నో వినతి పత్రాలు సమర్పించారు. ఫలితం లేదు. దాంతో వారు దుగ్గిరాల గోపాలకృష్ణయ్య నాయకత్వంలో ఆందోళన ప్రారంభించారు. ఇది స్వాతంత్ర్య పోరాటంలో ఒక ముఖ్యమైన ఘట్టం. ఆంధ్ర దేశం అంతా తిరిగి బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ప్రచారం చేశాడు. నిషేధాన్ని ఉల్లంఘించి బరంపురంలో ఉపన్యాసం చేసినందుకు ఒక సంవత్సరం పాటు జైలు శిక్ష అనుభవించాడు.చీరాల పేరాల ఉద్యమం -మద్రాస్ ప్రసిడెన్సీని కంపింపజేసింది.. ఆ ఉద్యమం మిగతా ప్రాంతాలకు వ్యాపిస్తుందేమోనని ఆంగ్లేయపాలకులు భయకంపితులయినారు..చివరికి జాతీయకాంగ్రీసు జోక్యంతో ఉద్యమం ముగిసింది...* *తెలుగు నాట జానపద కళా రూపాల పునరుద్ధరణకు, గ్రంథాలయాల వ్యాప్తికి గోపాలకృష్ణయ్య ఇతోధికంగా కృషి చేశాడు. 'సాధన' అనే పత్రిక నడిపాడు*. *ఆయన ప్రచారం చేసిన జానపద కళారీతులు - తోలుబొమ్మలాట, జముకుల కథ, బుర్రకథ, వీధి నాటకాలు, సాము గరిడీలు, గొల్ల కలాపం, బుట్ట బొమ్మలు, కీలు గుర్రాలు, వాలకాలు, గోసంగి, గురవయ్యలు, సరదా కథ, కిన్నెర కథ, కొమ్ము బూర,జోడు మద్దెల, పల్లె సుద్దులు, తూర్పు భాగోతం, చుట్టు కాముడు, పిచ్చికుంట్లవాళ్ళ కథ, సాధనా శూరులు, పలనాటి వీర విద్యావంతులు - వగైరా* *గోపాలకృష్ణయ్య నియమ తత్పరుడు. 'శ్రీరామదండు' అనే ఆధ్యాత్మిక, జాతీయతా స్వచ్ఛంద సమూహాన్ని ఏర్పాటు చేశాడు.* *1921 లో గుంటూరులో ఒక సభలో "ఆంధ్ర రత్న" అన్న బిరుదుతో ఆయనను సత్కరించారు.* *ఈ మహనీయుని త్యాగాలకు తెలుగుజాతి సర్వదా ఋణపడివుంది*. *ఉపాధ్యాయ సేవా కేంద్రం,విజయవాడ*
Image
ఒక్క ఇల్లూ కట్టని చిన్న సైకో ఆర్కే ఇళ్లు కూల్చేస్తున్నాడు
Image