అర్హులైన క్రీడాకారులు ఈ నెల 20 వ తేదీ లోగా తమ దరఖాస్తులను (సెప్టెంబర్ 2022) రాత్రి 11.59 గంటలలోపు సంబందిత పోర్టల్ dbtyas-sports.gov.inలో ఆన్‌లైన్‌ ద్వారా నమోదు చేసుకోవాలిరాజమహేంద్రవరం (ప్రజా అమరావతి);


భారత యువజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ & క్రీడా ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు, అర్జున అవార్డు, ద్రోణాచార్య అవార్డు, ధ్యాన్ చంద్ అవార్డు, రాష్ట్రీయ ఖేల్ ప్రోత్సాహన్ పురస్కార్ మరియు మౌలానా అబ్దుల్ కలాం అజాద్ (MAKA) ట్రోఫీకి దరఖాస్తు చేసుకోవడానికి ఆంధ్రప్రదేశ్‌లోని సంభావ్య క్రీడాకారులను ఆహ్వానిస్తున్నట్లుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ, విజయవాడ వారు తెలియజేయుచున్నారని

జిల్లా  క్రీడా ప్రాధికార సంస్థ  ముఖ్య క్రీడా శిక్షకుల డి.డి.ఎం.ఎం.శేషగిరి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.

అర్హులైన క్రీడాకారులు  ఈ నెల 20 వ తేదీ లోగా తమ దరఖాస్తులను (సెప్టెంబర్ 2022) రాత్రి 11.59 గంటలలోపు సంబందిత పోర్టల్ dbtyas-sports.gov.inలో ఆన్‌లైన్‌ ద్వారా నమోదు చేసుకోవాలన్నారు.


ఈ ఏడాది నుంచి ప్రత్యేక పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌లో మాత్రమే దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు పేర్కొన్నారు.  అర్హత ఉన్న క్రీడాకారులు అవార్డు మార్గదర్శకాలకు అనుగుణంగా ఆన్‌లైన్ పోర్టల్ dbtyas-sports.gov.in ద్వారా మాత్రమే అధికారులు/వ్యక్తుల సిఫార్సు లేకుండా స్వీయ దరఖాస్తు చేసుకోవడానికి అనుమతించబడతారని తెలిపారు. ఆన్‌లైన్ దరఖాస్తు ఫారమ్‌లో ఏదైనా సమస్య ఎదురైనట్లయితే, దరఖాస్తుదారు స్పోర్ట్స్ డిపార్ట్‌మెంట్‌ని section-sp4-moyas@gov.in, టెలిఫోన్ నెం. 011-23387432 పని దినములలో ఉదయం 09:00 నుండి సాయంత్రం 05:30 వరకు సంప్రదించవచ్చు తెలిపారు.


ఆన్ లైన్ దరఖాస్తుతో పాటు దరఖాస్తుదారుడు ఉద్యోగి అయినచో  (కేంద్ర ప్రభుత్వం/ రాష్ట్ర ప్రభుత్వం/ PSU సంస్థల విషయంలో) ఎంప్లోయర్ నుండి నుండి విజిలెన్స్ సర్టిఫికేట్‌ను సమర్పించడం తప్పనిసరి అన్నారు. ప్రవేశానికి  ఏదైనా రూపంలో ప్రచారము చేస్తే అది డిస్వాలిఫికేషన్‌కు గురవుతుందని అందరూ గమనించాలన్నారు.   అవార్డు కోసం అర్హులైన క్రీడాకారులు  ఈ నెల 20 వ తేదీ దరఖాస్తులను 20 (సెప్టెంబర్ 2022) రాత్రి 11.59 గంటలలోపు సంబందిత పోర్టల్ dbtyas-sports.gov.inలో ఆన్‌లైన్‌లో సమర్పించాలని ఆయన ఆ ప్రకటనలో తెలిపారు.Comments