నెల్లూరు జిల్లా రైతాంగానికి సెప్టెంబర్ 6 చారిత్రాత్మిక రోజు

 

నెల్లూరు సెప్టెంబర్ 3 (ప్రజా అమరావతి);


శ్రీ పోట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా రైతాంగానికి సెప్టెంబర్ 6  చారిత్రాత్మిక రోజని రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖామాత్యులు శ్రీ కాకాణి గోవర్ధన్ రెడ్డి అన్నారు.


శనివారం ఉదయం కలెక్టరేట్ లోని తిక్కన ప్రాంగణంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నెల్లూరు జిల్లా పర్యటన ఏర్పాట్లు గురించి జిల్లా కలెక్టర్ శ్రీ కె వి ఎన్ చక్రధర్ బాబు తో కలసి అధికారులు, ప్రజాప్రతినిధులతో సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి కాకాణి మాట్లాడుతూ జిల్లా అధికారులు కలసి కట్టుగా కృషిచేసి ఈనెల 6 న రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి జిల్లా  పర్యటనను విజయవంతం చేయాలన్నారు. ముఖ్యమంత్రి పర్యటన కార్యక్రమాన్ని వివరిస్తూ 6 న  ఉదయం 10: 20 కు సంగం కు చేరుకుంటారని, శ్రీ మేకపాటి గౌతమ్ రెడ్డి సంగం బ్యారేజ్ ను రైతాంగానికి అంకితం చేసి అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్న అనంతరం మధ్యాహ్నం 1:15 కు నెల్లూరు బ్యారేజ్ కు చేరుకుంటారని, నెల్లూరు బ్యారేజ్ ను ప్రారంభించిన అనంతరం 2:30 కు తిరిగి వెళతారని వివరించారు. నెల్లూరు బ్యారేజి,  సంగం బ్యారేజీ, సభా ప్రాంగణం, సంగం , కోవూరు లలోని హెలిప్యాడ్ తదితర ప్రాంతాలలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయవలసిందిగా జిల్లా ఎస్పీ విజయారావుకు సూచించారు. ఎక్కడా ఎటువంటి అలసత్వానికి తావు లేకుండా ఎవరికి కేటాయించిన విధులను వారు బాధ్యతగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి పర్యటన ఆసాంతం సజావుగా, సాఫీగా జరగడానికి అన్ని చర్యలు తీసుకోవాలన్నారు.


ఆ తర్వాత మంత్రి కాకాణి మీడియాతో మాట్లాడుతూ మహానేత దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేతుల మీదుగా శంకుస్థాపన చేసుకున్న సంగం బ్యారేజీ, నెల్లూరు బ్యారేజీలు వారి తనయుడు ప్రస్తుత రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేసుకోవటం సంతోషకరమన్నారు. వైయస్సార్ తదుపరి వచ్చిన ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల బ్యారేజీ పనులు నత్తనడకన సాగాయని, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాతే పనులలో వేగం పెంచి బ్యారేజీలు పూర్తి చేసి రైతాంగానికి అంకితం చేస్తున్నామన్నారు.


ఈ సమీక్షా సమావేశంలో కందుకూరు, ఉదయగిరి, ఆత్మకూరు శాసనసభ్యులు  మానుగుంట మహీధర్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, మేకపాటి విక్రమ్ రెడ్డి, నెల్లూరు మేయర్ స్రవంతి, జాయింట్ కలెక్టర్ రోణంకి కూర్మనాథ్,  డి ఆర్ ఓ వెంకట నారాయణమ్మ , వివిధ శాఖల అధికారులు  పాల్గొన్నారు. 

Comments
Popular posts
అర్హులైన వారందరికీ వర్తించేలా వైయస్సార్‌ కళ్యాణమస్తు, వైయస్సార్‌ షాదీ తోఫా.
Image
శరన్నవరాత్రి మహోత్సవాల్లో ఆరవ రోజున శ్రీ కనకదుర్గమ్మ వారు శ్రీ మహాలక్ష్మి గా దర్శనమిస్తారు.
Image
శరన్నవరాత్రి మహోత్సవాల్లో ఏడవ రోజున శ్రీ కనక దుర్గమ్మ వారు శ్రీ సరస్వతి దేవి అలంకారంలో దర్శనం ఇస్తారు.
Image
అక్టోబరు 25న ఇ–క్రాపింగ్‌ జాబితాలు సచివాలయాల్లో ప్రదర్శన, షెడ్యూల్‌ వివరించిన సీఎం.
Image
భోగాపురం గ్రీన్‌ఫీల్డ్‌ అంతర్జాతీయ విమానాశ్రయం అభివృద్ధికి సహకరించాలని కేంద్ర మంత్రిని కోరిన ముఖ్యమంత్రి.
Image