ఎయిడ్స్ నివారణపై వీడియో, మీమ్స్ పోటీ

 ఎపి ఎయిడ్స్ నియంత్రణా సంస్థ(ఏపీశాక్స్)*ఎయిడ్స్ నివారణపై వీడియో, మీమ్స్ పోటీ


*


అమరావతి (ప్రజా అమరావతి): హెచ్ఐవి/ఎయిడ్స్  నివారణపై ప్రజల్లో చైతన్యం కలిగించి  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఎయిడ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు వీలుగా విద్యార్థులకు వీడియో, మీమ్స్ పోటీని నిర్వహిస్తున్నట్లు ఎపి ఎయిడ్స్ నియంత్రణా సంస్థ  (ఎపి శాక్స్) ఒక ప్రకటనలో తెలిపింది.  శారీరక దారుఢ్యం(Physical Fitness), యోగా(Yoga), పోషకాహారం(Diet&Nutrition), అసాంక్రమిక వ్యాధులు(Non-Communicable Diseases), హెచ్ఐవి/ ఎయిడ్స్ నియంత్రణ(HIV/AIDs) అంశాలపై  ఒక నిముషం నిడివి గల వీడియోలు, మీమ్స్ రూపొందించి safelifeandhra@gmail.com అనే చిరునామాకు ఈనెల 12లోగా పంపాలని ఎపి శాక్స్  ఒక ప్రకటనలో కోరింది. ఎంట్రీలను తెలుగు లేదా ఇంగ్లీషు భాషల్లో తీసి పంపొచ్చు. ఎంపికైన ఎంట్రీలకు ఆకర్షణీయమైన బహుమతుల్ని అందజేయడంతో పాటు వైద్య ఆరోగ్యశాఖ  సోషల్ మీడియా పేజీలన్నిటిలోనూ పెడతారు.


Comments