రాష్ట్రంలో సంక్షేమ పాలన నడుస్తుంది మొగల్తూరు,(ప్రజా అమరావతి);

   రాష్ట్రంలో సంక్షేమ పాలన నడుస్తుందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి శ్రీ కొట్టు సత్యనారాయణ అన్నారు.


     సోమవారం మొగల్తూరు మండలం కేపీ పాలెం సౌత్ గ్రామంలో సాయిబాబా గుడి వద్ద నుండి 82 వ రోజు జరిగే గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొని అదే గ్రామంలో 40 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించిన గ్రామ సచివాలయం,21.80 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించిన రైతు భరోసా కేంద్రం,17.50 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించిన వైయస్సార్ హెల్త్ క్లినిక్ సెంటర్ భవనాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర ఉపముఖ్యమంత్రి దేవాదాయ శాఖ మంత్రి శ్రీ కొట్టు సత్యనారాయణ జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీ కావురు శ్రీనివాస్ , ,ప్రభుత్వ చీఫ్ విఫ్ , శాసనసభ్యులు ముదునూరి. ప్రసాదరాజు,  జిల్లా కలెక్టర్ శ్రీమతి పి ప్రశాంత్ పాల్గొన్నారు . అనంతరం నూతన సచివాలయం దగ్గర ఏర్పాటు చేసిన సమావేశంలో ముఖ్యమంత్రి  మాట్లాడుతూ రాష్ట్రంలో గ్రామ స్వరాజ్యం వచ్చిందని ప్రతి గ్రామంలో గ్రామ సచివాలయం భావన ఏర్పాటు చేసి గ్రామంలో ఉన్న ప్రజలకు అన్ని అవసరాలు తీర్చడం జరుగుతుంది అని ఆయన తెలిపారు. ప్రతి గ్రామంలో రైతు భరోసా కేంద్రం ఏర్పాటు చేసి రైతులకు విత్తనాలు, ఎరువులు , పురుగుమందులు అందించడంతోపాటు రైతులకు సలహాలు, సూచనలు అందించడంతోపాటు ధాన్యం కొనుగోలు కూడా చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. ప్రతి గ్రామంలో హెల్త్ క్లినికల్ ఏర్పాటు చేసి గ్రామంలో ఉన్న ప్రజల ఆరోగ్యం ఎప్పటికప్పుడు పరిశీలించి అవసరమైన మందులు ఇచ్చి చికిత్స అందించడం జరుగుతుంది ఆయన అన్నారు.

 ఈ గ్రామంలో సంక్షేమానికి 12 కోట్ల 40 లక్షల రూపాయలు ఖర్చు చేయడం జరిగిందని అదేవిధంగా అభివృద్ధికి 11 కోట్ల 50 లక్షల రూపాయలు ఖర్చు చేసి రోడ్లు మంచినీటి సదుపాయం భవనాల నిర్మాణాలకు పూర్తి చేయడం జరిగిందని ఆయన తెలిపారు.

 ప్రతి 50 కుటుంబాలకు ఒక వాలంటర్ ను ఏర్పాటు చేసి వారికి కావలసిన అన్ని సౌకర్యాలు చూడడం జరుగుతుంది అని ఆయన తెలిపారు. రాజకీయ పార్టీలకు , కులాలకు, మతాలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించడం జరుగుతుందని అన్నారు.  రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలకు ఒక లక్ష 61 వేల కోట్ల రూపాయలు మూడు సంవత్సరాల నాలుగు నెలల కాలంలో ఖర్చు చేసి ప్రజలకు నేరుగా వారి ఖాతాల్లో డబ్బులు జమ చేయడం జరిగిందని ఆయన తెలిపారు.  రాష్ట్రంలో గొప్ప పరిపాలన సాగుతుందని ఆయన అన్నారు. రాష్ట్ర మంత్రివర్గంలో 24 మంది మంత్రులలో 13 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన వారు ఉండగా అందులో ఐదుగురు ఉప ముఖ్యమంత్రి గా ఉన్నారని ఆయన అన్నారు.


      కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీ కౌవురు శ్రీనివాస్ మాట్లాడుతూ పరిపాలన ప్రజల వద్దకు తీసుకెళ్లాలని ప్రతి గ్రామంలో గ్రామ సచివాలయం ఆర్ బి కె లు, హేల్త్ క్లినిక్ లు నిర్మించి సంక్షేమ పథకాలు ప్రజలకు తీసుకొచ్చే విధంగా పనిచేస్తున్నారని ఆయన అన్నారు. ఈ గ్రామంలో మూడు సంవత్సరాల కాలంలో 28 కోట్ల రూపాయలు అభివృద్ధి సంక్షేమం పై ఖర్చు చేయడం జరిగిందని ఆయన అన్నారు.


      జిల్లా కలెక్టర్  శ్రీమతి పి. ప్రశాంతి మాట్లాడుతూ గ్రామ స్థాయిలో భవనాలు ప్రారంభమయీ అందరికీ సేవలు అందించడానికి గ్రామస్థాయిలో 11 మంది సిబ్బందిని నియమించి పరిపాలన వికేంద్రీకరణ చేయడం జరిగింది అన్నారు. అర్హత గల ప్రతి  ఒక్కరికి నేరుగా బ్యాంకు నుండి డబ్బులు వారి ఖాతాలో జమ చేయడం జరుగుతున్నాయి అని ఆమె తెలిపారు. ఆర్ బి కె  ల్లో విత్తనాలు , ఎరువులు, పురుగు మందులు అందుబాటులో ఉంచడంతోపాటు ధాన్యం కొనుగోలు కూడా చేయడం జరుగుతుంది అని ఆమె తెలిపారు. అధిక వర్షాల వల్ల నష్టపోయిన రైతులకు 80% సబ్సిడీపై విత్తనాలు కూడా అందించడం జరుగుతుందని ఆమె తెలిపారు . ప్రతి గ్రామంలో హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్లను ఏర్పాటు చేసి అందులో 24 గంటలు ఏఎన్ఎం అందుబాటులో ఉండే విధంగా రెసిడెన్షియల్ కోటర్ ను నిర్మించడం జరిగిందని ఆమె తెలిపారు. అన్ని పాఠశాలలను అభివృద్ధి చేసి అన్ని రకాల వసతులు కల్పించి విద్యా వ్యవస్థకు పెద్ద  పీట వేసారని వీటితోపాటు లైబ్రరీలు కూడా నిర్మిస్తున్నామని ఆ గ్రామంలో ఉన్న నిరుద్యోగులు ఆన్లైన్ ద్వారా కంప్యూటర్ ద్వారా జ్ఞానాన్ని సమకూర్చుకోవచ్చునాను ఆమె తెలిపారు. పట్టణాల్లో ఉన్న అన్ని సదుపాయాలు గ్రామాలకు తీసుకురావడం జరుగుతుందని ఆమె అన్నారు.


       ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన నరసాపురం శాసనసభ్యులు ప్రభుత్వ చీఫ్ విఫ్ ముదునూరు ప్రసాదరాజు మాట్లాడుతూ 40 లక్షల రూపాయలతో గ్రామ సచివాలయ భవనం 22 లక్షల రూపాయలతో రైతుభరోసా కేంద్రం 17 లక్షల రూపాయలతో హెత్ క్లినిక్ మొత్తం సుమారు 80 లక్షల రూపాయలతో భవనాలు నిర్మించి ప్రారంభించడం జరిగిందని ఆయన తెలిపారు .ఈ గ్రామంలో 11 మంది సచివాలయ సిబ్బంది 22 మంది వాలంటీర్లు మొత్తం 33 మంది సిబ్బంది గ్రామంలో వివిధ సేవలు అందిస్తారని ఆయన అన్నారు. పుట్టిన బిడ్డ నుండి చనిపోయే వరకు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామని ఆయన తెలిపారు. ఇంటికి వచ్చి పెన్షన్లు , రేషన్ బియ్యం అందించడం జరుగుతుందని ఆయన అన్నారు. ఈ గ్రామంలో ఉన్న 1210 రేషన్ కార్డులకు 12 కోట్ల 40 లక్షల రూపాయలు సంక్షేమ పథకాలు ద్వారా అందించడం జరిగింది ఆయన తెలిపారు.


   ఈ కార్యక్రమంలో నరసాపురం సబ్ కలెక్టర్ శ్రీ సి.విష్ణుచరణ్, మున్సిపల్ చైర్ పర్సన్ బర్రె శ్రీ వెంకటరమణ, జడ్పిటిసి లు  బొక్క రాధాకృష్ణ , బాబ్జి లు,  సర్పంచ్ అందే వెంకటలక్ష్మి , ఏఎంసి చైర్మన్ కె. రవికుమార్ , అండ్రాజు చల్లారావు స్థానిక నాయకులు , ప్రజా ప్రతినిధులు  ,అధికారులు తదితరులు పాల్గొన్నారు .

Comments
Popular posts
అర్హులైన వారందరికీ వర్తించేలా వైయస్సార్‌ కళ్యాణమస్తు, వైయస్సార్‌ షాదీ తోఫా.
Image
శరన్నవరాత్రి మహోత్సవాల్లో ఆరవ రోజున శ్రీ కనకదుర్గమ్మ వారు శ్రీ మహాలక్ష్మి గా దర్శనమిస్తారు.
Image
శరన్నవరాత్రి మహోత్సవాల్లో ఏడవ రోజున శ్రీ కనక దుర్గమ్మ వారు శ్రీ సరస్వతి దేవి అలంకారంలో దర్శనం ఇస్తారు.
Image
అక్టోబరు 25న ఇ–క్రాపింగ్‌ జాబితాలు సచివాలయాల్లో ప్రదర్శన, షెడ్యూల్‌ వివరించిన సీఎం.
Image
భోగాపురం గ్రీన్‌ఫీల్డ్‌ అంతర్జాతీయ విమానాశ్రయం అభివృద్ధికి సహకరించాలని కేంద్ర మంత్రిని కోరిన ముఖ్యమంత్రి.
Image