చంద్రబాబు ఇవ్వకుంటే కొడాలి నానికి రాజకీయ జీవితం ఉండేదా*- చంద్రబాబు ఇవ్వకుంటే కొడాలి నానికి రాజకీయ జీవితం ఉండేదా* 


 *- భిక్ష పెట్టిన చంద్రబాబును నీచంగా మాట్లాడడం తగదు*

 *- ఎన్టీఆర్ కుటుంబ సభ్యులనూ కించపర్చడం సరికాదు* 

 *- కొడాలి నానికి ఇంకోసారి ఎమ్మెల్యే అయ్యే పరిస్థితి లేదు* 

 *- గుడివాడ మాది అని చెప్పుకోవడానికి సిగ్గు పడుతున్నారు* 

 *- రానున్న కాలంలో కొడాలి నానికి ప్రజలే బుద్ధి చెబుతారు* 

 *- ఆప్కాబ్ మాజీ చైర్మన్ పిన్నమనేని వెంకటేశ్వరరావు*  గుడివాడ, ఆగస్టు 25 (ప్రజా అమరావతి): 2004 లో గుడివాడ టీడీపీ సీటును చంద్రబాబు ఇవ్వకుంటే ఎమ్మెల్యే కొడాలి నానికి రాజకీయ జీవితం ఉండేదా అని ఆప్కాబ్ మాజీ చైర్మన్ పిన్నమనేని వెంకటేశ్వరరావు ప్రశ్నించారు. ఆదివారం స్థానిక భాస్కర్ థియేటర్లోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత కొన్ని రోజులుగా గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని నోటిని అదుపులో పెట్టుకోకుండా మాట్లాడుతున్న మాటలు చాలా జుగుప్సాకరంగా ఉన్నాయని చెప్పారు. ఈ విషయం రాష్ట్ర ప్రజలందరికీ అర్ధమైందన్నారు. ఎమ్మెల్యే కొడాలి నానికి, ఆయన పక్కన ఉన్నవారికి అర్ధమవుతోందో, లేదో తెలియని పరిస్థితి ఉందన్నారు. సీఎం జగన్మోహనరెడ్డి ఈ వ్యాఖ్యలను వింటున్నారో, లేదో తెలియడం లేదన్నారు. తాను రాజకీయాల్లోకి వచ్చి 33 ఏళ్ళు దాటిందని, ఎన్నడూ ఇటువంటి భాషను ఎమ్మెల్యే కొడాలి నాని తప్ప ఎవరూ ఉపయోగించినట్టు చూడలేదన్నారు. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి మంత్రివర్గంలో ఐదేళ్ళ పాటు మంత్రిగా పనిచేశానన్నారు. కాంగ్రెస్ నుండి తెలుగుదేశం పార్టీలోకి వచ్చానని, చంద్రబాబు హయాంలో ఆప్కాబ్ చైర్మన్ గా పనిచేశానని తెలిపారు. గుడివాడలో ఎమ్మెల్యేగా ఉన్నానని చెప్పుకోవడానికి అర్హత లేని కొడాలి నానిని వెంటనే పదవి నుండి తప్పించడానికి ఎన్నికల కమిషన్, అసెంబ్లీ స్పీకర్ తగు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఎన్టీఆర్ ను దేవుడిగా ఎమ్మెల్యే కొడాలి నాని చెప్పుకుంటూ వస్తున్నారన్నారు. అదే ఎన్టీఆర్ కుటుంబ సభ్యులను కించపర్చే విధంగా ఎందుకు మాట్లాడుతున్నాడో అర్ధం కావడం లేదన్నారు. ఆడవాళ్ళను అడ్డం పెట్టుకుని మాట్లాడకూడదని ఒకవైపు ఎమ్మెల్యే కొడాలి నాని చెబుతూనే మరోవైపు అదే ఆడవాళ్ళను అడ్డం పెట్టుకుని అడ్డమైన భాష వినియోగిస్తూ మహిళల పరువు, ప్రతిష్ఠలను బజారుకీడ్చుతున్నాడని దుయ్యబట్టారు. 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా, ప్రస్తుతం ప్రతిపక్షనేతగా ఉన్న చంద్రబాబును కించపర్చడం శోచనీయమన్నారు. చంద్రబాబు ఇవ్వకుంటే ఎమ్మెల్యే కొడాలి నానికి రాజకీయ జీవితమే ఉండేది కాదన్నారు. రెండుసార్లు ఎమ్మెల్యేగా గెల్చిన తర్వాత రాజకీయ భిక్ష పెట్టిన చంద్రబాబును ఎంత నీచంగా మాట్లాడుతున్నావో, వాళ్ళ కుటుంబ సభ్యులను ఎంతగా కించపరుస్తున్నావో అన్నది ప్రజలు గమనిస్తున్నారన్నారు. ఎమ్మెల్యే కొడాలి నానికి మతిస్థిమితం లేదని వదిలేసే పరిస్థితి గుడివాడ ప్రజలకు దాపురించిందన్నారు. ఇంకోసారి కొడాలి నాని ఎమ్మెల్యే అయ్యేది లేదన్నారు. కొడాలి నాని వ్యాఖ్యలను గుడివాడ ప్రజలు ఏహ్యభావంతో చూస్తున్నారన్నారు. ఇక్కడి ప్రజలు గుడివాడ మాది అని చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడే పరిస్థితి వచ్చిందన్నారు. బూతుల మంత్రి నియోజకవర్గమా అని రాష్ట్ర ప్రజలు చులకనగా మాట్లాడుతున్నారన్నారు. ఎన్టీఆర్ ప్రాతినిధ్యం వహించిన గుడివాడ నియోజకవర్గం నుండి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన కొడాలి నాని ఉపయోగిస్తున్న భాష వల్ల ప్రజల పరువు, ప్రతిష్ఠలను బజారున పడేశాడన్నారు. రానున్న కాలంలో ఎమ్మెల్యే కొడాలి నానికి ప్రజలు తగిన బుద్ధి చెబుతారన్నారు. ఎమ్మెల్యే కొడాలి నాని ఏనాడూ ప్రజల్లోకి రాలేదన్నారు. మంత్రిగా ఉన్నప్పుడు కూడా గ్రామాలను పట్టించుకోలేదన్నారు. కనీసం రోడ్డు సదుపాయాలను కూడా కల్పించలేదన్నారు. తాను మంత్రిగా ఉన్నపుడు మాత్రమే అభివృద్ధి పనులు జరిగాయన్నారు. గుడివాడ నియోజకవర్గంలో ఎమ్మెల్యే కొడాలి నాని కొత్తగా ఏదైనా అభివృద్ధి పని చేశాడని చెప్పుకోవడానికి కూడా లేదన్నారు. ఎవరూ ఏం చేయలేరన్న ధీమాతో వ్యవహరించవద్దని, రోడ్డుపై నిలదీసే పరిస్థితి వస్తుందన్నారు. ఏది మాట్లాడుతున్నా టీడీపీ నేతలు, కార్యకర్తలు ఊరుకుంటున్నారని అనుకుంటే పొరపాటని అన్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే రోడ్డుపై కొట్టించుకునే దుస్థితి వస్తుందని, ఖబడ్డార్ అంటూ పిన్నమనేని వెంకటేశ్వరరావు అన్నారు. ఈ సమావేశంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత పిన్నమనేని బాబ్ది పాల్గొన్నారు.

Comments
Popular posts
స్పందన" లేని పంచాయతీ కార్యదర్శి సస్పెన్షన్
Team Sistla Lohit's solidarity for Maha Padayatra
Image
విజయవాడ, ఇంద్రకీలాద్రి (prajaamaravati): October, 18 :- దసర శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మూడవరోజు నిజ ఆశ్వయు శుద్ద విదియ, సోమవారం ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ కనకదుర్గమ్మ శ్రీ గాయత్రీ దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తారు. ముక్తా విద్రుడు హేమ నీల థవళచ్ఛాయైర్ముఖై స్త్రీక్షణైః యుక్తా మిందునిబద్థరత్నమకుటాం తత్వార్థవర్ణాత్మికామ్, గాయత్రీం వరదాభయాంకుశకశాం శుభ్రం కపాలం గదాం శంఖం చక్ర మదారవింద యుగళం హస్తైర్వహంతీంభజే శరన్నవరాత్రి మహత్సవములలో శ్రీ కనకదుర్గమ్మ వారుశ్రీ గాయత్రీ దేవిగా దర్శనమిస్తారు. సకల మంత్రాలకీ మూలమైన శక్తిగా వేదమాతగా ప్రసిద్ది పొంది ముక్తా, విదృమా హేమనీల దవలవర్ణాలతో ప్రకాశించు పంచకుముఖాలతో దర్శమిచ్చే సంద్యావందన దేవత గాయత్రీదేవి. ఈ తల్లి శిరస్సుయందు బ్రహ్మా, హృదయమందు విష్ణువు, శిఖయందు రుద్రుడు నివశిస్తుండగా త్రిముర్త్యాంశగా గాయంత్రి దేవి వెలుగొందుచున్నది. సమస్త దేవతా మంత్రాలకు గాయత్రి మంత్రంతో అనుబంధంగా ఉంది. గాయత్రీ మంత్రంతో సంప్రోక్షణ చేసిన తరువాతే నివేదిన చేయబడతాయి. ఆరోగ్యం లభిస్తుంది. గాయత్రీ మాతను వేదమాతగాకొలుస్తూ, గాయత్రీమాతను దర్శించడం వలన సకల మంత్రసిద్ది ఫలాన్ని పొందుతారు. దసరా అనే పేరు 'దశహరా'కు ప్రతిరూపమని కొందరంటారు. అంటే పాపనాశని అని అర్థం. అమ్మవారి అలంకారమునకు రంగులు వేర్వేరుగా ఉంటాయి. దసరా పండుగ అనగానే దేశం నలుమూలలా చిన్న, పెద్ద అందిరిలోనూ భక్తి ప్రపత్తులతో పాటు ఉత్సహం, ఉల్లాసాలు తొణికిసలాడుతాయి. నవరాత్రులలో దేవికి విశేషపూజలు చేయటంతోపాటు బొమ్మల కొలువులు, అలంకారాలు, పేరంటాల వంటి వేడుకలను జరుపుకుంటుంటారు.
Image
అమరావతి రైతుల మహా పాదయాత్ర చరిత్ర పుటల్లో నిలిచిపోతుంది
Image
మహిషమస్తక నృత్త వినోదిని స్ఫుటరణన్మణి నూపుర మేఖలా జనరక్షణ మోక్ష విధాయిని జయతి శుంభ నిశుంభ నిషూధిని.
Image