మాధవ్ డర్టీ పిక్చరుపై వైసీపీ డర్టీ పాలిటిక్స్

 *మాధవ్ డర్టీ పిక్చరుపై*

*వైసీపీ డర్టీ పాలిటిక్స్*


హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ డర్టీ పిక్చర్ ఉదంతంలో నిజాలు నిగ్గు తేల్చకుండా జగన్ ప్రభుత్వం నిస్సిగ్గుగా వ్యవహరిస్తోందని మాజీ మంత్రి, టిడిపి పొలిట్ బ్యూరో సభ్యుడు కాలవ శ్రీనివాసులు విమర్శించారు. బుధవారం రాయదుర్గంలో ఆయన విలేఖర్లతో మాట్లాడారు. ఎంపీ  మాధవ్ న్యూడ్ వీడియో వ్యవహారంపై రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, మహిళలు పెద్ద ఎత్తున నిరసనలు తెలిపారన్నారు. బాధ్యయుతమైన ఎంపీ పదవీలో మాధవ్ అసహ్యాకరమైన న్యూడ్ వీడియోతో పట్టుబడితే పార్టీ నుండి ఎందుకు సస్పెండ్ చేయలేదని జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించారు. నైతిక బాధ్యత వహించాలన్న ఆలోచన ఉంటే వెంటనే పార్లమెంట్ సభ్యత్వానికి మాధవ్ రాజీనామా చేయాలన్నారు. ఇవేవీ చేయకుండా జగన్ సర్కార్ కాలయాపన చేస్తోందన్నారు. న్యూడ్ వీడియోలో ఉన్నది గోరంట్ల మాధవా? కాదా? అన్న దానిపై ఎందుకు విచారణ చేయలేదని కాలవ నిలదీశారు. స్వయంగా జిల్లా ఎస్పీ పక్కిరప్పతో వైసీపీ సర్కార్ తప్పుడు స్టేట్ మెంట్ ఇప్పించిందన్నారు. నెల రోజుల తరువాత తీరిగ్గా  ఎంపీ. మాధవ్ సి.ఐ.డీకి ఫిర్యాదు చేయడంలో అంత్యర్యమేమిటని ప్రశ్నించారు. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి, హోం మంత్రి వనిత ఇరువురు మాధవ్ న్యూడ్ వీడియోను ఫారెన్సిక్ ల్యాబ్ కు పంపిచ్చామని మీడియా ముందు చెప్పినా, ఇంతవరకు ఎందుకు సదరు నివేదికను బయటపెట్టలేదని ప్రశ్నించారు.   మాధవ్ డర్టీ పిక్చరును పరిశీలించిన అమెరికాలోని ప్రైవేట్ ఫోరెన్సిక్ నిపుణులు  ఆ న్యూడ్ వీడియోలో ఉన్నది ఎంపీ మాధవ్ అని స్పష్టంగా తేల్చిచెప్పారన్నారు.  మాధవ్ తన న్యూడ్ వీడియోపై సి.ఐ.డి కి ఫిర్యాదు చేయకముందే సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ ఎందుకు మీడియా ముందుకు వచ్చి వివరణ ఇచ్చారన్నారు.  న్యూడ్ వీడియోలో ఉన్నది ఎంపీ గోరంట్ల మాధవ్ కాదనీ, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎందుకు చెప్పడంలేదని కాలవ శ్రీనివాసులు సూటిగా ప్రశ్నించారు. పచ్చి నిజాన్ని దాచి నగ్న సత్యాన్ని సమాధి చేసి, ప్రతిపక్షాలపై బురద జల్లే ప్రయత్నం వైసిపి సర్కార్ చేస్తోందన్నారు. జగ్మోహన్ రెడ్డి పెట్టె అక్రమ కేసులకు, ఉడత ఊపులకు తెలుగుదేశం పార్టీ భయపడే ప్రసక్తే లేదన్నారు. డర్టీ పిక్చర్ వ్యవహారంలో ఉన్నది ఎంపీ గోరంట్ల మాధవ్ అని దేశమంతా తెలుసునని ఆయన స్పష్టం చేశారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎంపీ. మాధవ్ ను సస్పెండ్ చేసి, న్యూడ్ వీడియో సంఘటనపై సీబీఐ విచారణ జరిపించాలని కాలవ శ్రీనివాసులు డిమాండ్ చేశారు.

Comments