ప్రభుత్వ పథకాలను అర్హులైన లబ్ధిదారులకు అందించాలి

 సర్వీసులను పెండింగ్ ఉంచరాదు*


*: ప్రభుత్వ పథకాలను అర్హులైన లబ్ధిదారులకు అందించాలి*


*: ఉద్యోగులు బయోమెట్రిక్ అటెండెన్స్ నమోదు తప్పనిసరిగా సకాలంలో చేయాలి*


*: జిల్లా కలెక్టర్ బసంత్ కుమార్*


*: గాండ్లపెంట మండలంలోని గాండ్లపెంట, కురుమామిడి, కటారుపల్లి గ్రామ సచివాలయాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్..*


గాండ్లపెంట (శ్రీ సత్యసాయి జిల్లా), సెప్టెంబర్ 20 (ప్రజా అమరావతి):


సచివాలయాలకు వస్తున్న సర్వీసులను ఎలాంటి పెండింగ్ ఉంచకుండా గడువులోగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ బసంత్ కుమార్ సచివాలయ ఉద్యోగులను ఆదేశించారు. మంగళవారం గాండ్లపెంట మండలంలోని గాండ్లపెంట, కురుమామిడి, కటారుపల్లి గ్రామ సచివాలయాలను జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.


ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సచివాలయానికి వస్తున్న ప్రతి సర్వీసులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలన్నారు. సర్వీసులను ఎలాంటి పెండింగ్ ఉంచరాదన్నారు. ప్రభుత్వ పథకాలను అర్హులైన లబ్ధిదారులకు అందించేందుకు ఉద్యోగులు శ్రద్ధ పెట్టి పని చేయాలన్నారు. ఉద్యోగులు బయోమెట్రిక్ అటెండెన్స్ నమోదును తప్పనిసరిగా సకాలంలో చేయాలన్నారు. పూర్తిగా 100 శాతం అటెండెన్స్ నమోదు చేయాలని సూచించారు. సచివాలయాల పరిధిలోని పాఠశాలలను తనిఖీ చేయాలని, మధ్యాహ్న భోజనం కింద విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించేలా చూడాలని, ఎగ్, చిక్కి నాణ్యతగా ఉండేలా చూడాలన్నారు. ఆయా సచివాలయాల పరిధిలో చేపడుతున్న ప్రభుత్వ ప్రాధాన్యత భవన నిర్మాణాలను గడువులోగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. సచివాలయం పరిధిలో ఈ క్రాప్ బుకింగ్ ప్రక్రియ, ఈకెవైసి ప్రక్రియలను సకాలంలో పూర్తి చేయాలన్నారు.  సచివాలయ ఉద్యోగులు సమయానికి సచివాలయానికి రావాలని, మధ్యాహ్నం కూడా అందుబాటులో ఉండాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఉద్యోగులు బాధ్యతగా విధులను నిర్వహించాలని సూచించారు.


ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆయా సచివాలయాలలో రిజిస్టర్లను తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో,తహసీల్దార్,  రవి,  ఈ ఓ పి ఆర్ డి  సునీత, ఏపీవో, మంజునాథ,వివిధ శాఖల అధికారులు, సచివాలయ ఉద్యోగులు, తదితరులు పాల్గొన్నారు.


 

Comments
Popular posts
అర్హులైన వారందరికీ వర్తించేలా వైయస్సార్‌ కళ్యాణమస్తు, వైయస్సార్‌ షాదీ తోఫా.
Image
శరన్నవరాత్రి మహోత్సవాల్లో ఆరవ రోజున శ్రీ కనకదుర్గమ్మ వారు శ్రీ మహాలక్ష్మి గా దర్శనమిస్తారు.
Image
శరన్నవరాత్రి మహోత్సవాల్లో ఏడవ రోజున శ్రీ కనక దుర్గమ్మ వారు శ్రీ సరస్వతి దేవి అలంకారంలో దర్శనం ఇస్తారు.
Image
అక్టోబరు 25న ఇ–క్రాపింగ్‌ జాబితాలు సచివాలయాల్లో ప్రదర్శన, షెడ్యూల్‌ వివరించిన సీఎం.
Image
భోగాపురం గ్రీన్‌ఫీల్డ్‌ అంతర్జాతీయ విమానాశ్రయం అభివృద్ధికి సహకరించాలని కేంద్ర మంత్రిని కోరిన ముఖ్యమంత్రి.
Image