_బీసీ ద్రోహి గా జగన్‌ రెడ్డి చరిత్ర లో నిలిచిపోతారు_

 *_బీసీ ద్రోహి గా జగన్‌ రెడ్డి  చరిత్ర లో నిలిచిపోతారు_


*


*తెలుగుదేశం పార్టీ  బీసీ విభాగం "లోగో" ఆవిష్కరించిన టీడీపీ నాయకులు*


మంగళగిరి నియోజకవర్గ తెలుగుదేశం కార్యాలయం, డా MSS భవన్ లో  తెలుగుదేశం పార్టీ  బీసీ విభాగం "లోగో" ని ఆవిష్కరించిన నియోజకవర్గ  బీసీ ముఖ్య నాయకులు


తెలుగుదేశం పార్టీ బీ.సీ విభాగం మరియు సాధికార కమిటీల ప్రమాణస్వీకార మహోత్సవ కార్యక్రమము ఈ నెల 21 తేదీన విజయవాడ  A కన్వెన్షన్ లో  తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు "నారా చంద్రబాబునాయుడు"గారు ఆత్మీయ అతిథి గా జరుగు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపు ఈ *బీసీ లోగో ఆవిష్కరణ సందర్బంగా నియోజకవర్గ బీసీ సెల్ అధ్యక్షులు కారంపూడి అంకమ్మరావు మాట్లాడుతూ..*


బీసీలకి రాజ్యాధికారం ఇచ్చి, సమాజంలో బీసీ లకు ప్రాధాన్యతనిచ్చిన ఏకైక పార్టీ తెలుగుదేశం


రాష్ట్రంలో బీసీ కులాలు, వృత్తులను అణగదొక్కడమే లక్ష్యం గా జగన్ రెడ్డి ప్రభుత్వ విధానాలు


గత టీడీపీ ప్రభుత్వ హయాంలో చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో  బీసీల కులవృత్తులను కాపాడుతూ వారి జీవన ప్రమాణాలు పెంపొందించే విధంగా వృత్తిపరమైన పరికరాలు అందించి వారి జీవన మెరుగుపడే విధంగా ప్రతి ఏడాది 25 వేల కోట్ల నిధులు బడ్జెట్లో కేటాయించింది, 


బీసీ సబ్‌ ప్లాన్‌ నిధులు రూ.26వేల కోట్లు దారి మళ్ళించి,బీసీ ల వెన్ను విరిచిన ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం


వైసిపి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బీసీల సంక్షేమాన్ని తుంగలో తొక్కే విధంగా వ్యహరిస్తోంది 


56 కార్పొరేషన్లకు నిధులు కేటాయించకపోవడం బీసీలను దగా చేయడమే 


10 మంత్రి పదవులిచ్చి వందలాది బీసీలను హత్య చేయడం సామాజిక న్యాయమా.?


కేవలం అలంకారాలకు మాత్రమే పదవుల పంపకం చేపడుటున్నారు 


ఇక్కడ బీసీ లు లేనట్టు ఆంధ్ర ప్రజల్ని  తాకట్టు పెట్టి, తెలంగాణ వ్యక్తులకు రాజ్యసభ ఇవ్వాల్సిన అవసరం ఏంటి?


ఆంధ్రప్రదేశ్లో ఉన్న బీసీలను అవమానిస్తున్నారు, హత్యారాజకీయాలు చేస్తున్నారు, బీసీ నిధులు  మళ్లింపులు, అక్రమ కేసులు పెట్టి బీసీ లపై కక్షసాధింపులకు పాల్పడుతున్న వైసీపీ ప్రభుత్వానికి రానున్న ఎలక్షన్ లలో తగిన బుద్ధి చెప్తాం


ఈ బీసీ లోగో ఆవిష్కరణ కార్యక్రమంలో మంగళగిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ వ్యవహారాల సమన్వయకర్త నందం అబద్దయ్య, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి తమ్మిశెట్టి జానకి దేవి, మండల పార్టీ అధ్యక్షులు తోట పార్ధసారధి, టిడిపి రాష్ట్ర బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి గుత్తికొండ ధనుంజయ రావు, టీడీపీ రాష్ట్ర మైనారిటీ సెల్ కార్యదర్శి అబ్దుల్ మజీద్,పట్టణ బీసీ సెల్ అధ్యక్షులు వాకా మాధవరావు, మంగళగిరి మండల బీసీ సెల్ అధ్యక్షులు కటారి అప్పారావు, తాడేపల్లి మండల బీసీ సెల్ అధ్యక్షులు చావలి సురేష్, గుంటూరు పార్లమెంట్ బీసీ సెల్ కార్యనిర్వాహాక కార్యదర్శి వాకా మంగారావు నియోజకవర్గ తెలుగుయువత అధ్యక్షులు పడవల మహేష్, లీగల్ సెల్ల అధ్యక్షులు కూరపాటి మురళి రాజు, నియోజకవర్గ బీసీ సెల్ ఉపాధ్యక్షులు అన్నం నాగబాబు, పట్టణ తెలుగు యువత అధ్యక్షులు భోగి వినోద్, టిఎన్టియుసి అధ్యక్షులు గోసాల రాఘవ,మండల బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి మీనిగల వెంకటేష్, పట్టణ బీసీ సెల్ ఉపాధ్యక్షులు రుద్రు మురళీ, ఊట్ల శ్రీమన్నారాయణ, మున్నంగి శివ శేషగిరిరావు, తిరువీధుల బాపనయ్య,తాత కోటయ్య ఒడిశా నరేష్, నూతక్కి ఏడుకొండలు, తదితరులు పాల్గొన్నారు.

Comments