విజయవాడ, (ప్రజా అమరావతి);
*పశువులలో లంపీస్కిన్ వ్యాధి*
• *పశుపోషకులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వ్యాధిని అరికట్టడానికి ప్రభుత్వం తీసుకున్న చర్యలను వివరించిన పశుసంవర్థక శాఖ సంచాలకులు డా. ఆర్. అమరేంద్ర కుమార్*.
పశువులలో లంపీస్కిన్ వ్యాధిని కట్టడి చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుందని పశుసంవర్థక శాఖ సంచాలకులు డా. ఆర్. అమరేంద్ర కుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. పశువులలో లంపీస్కిన్ వ్యాధి లక్షణాలు, ప్రభలిన జిల్లాలు, పశుపోషకులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వ్యాధిని అరికట్టడానికి ప్రభుత్వం తీసుకున్న చర్యలు తదితర వివరాలను ఆ ప్రకటనలో వివరించారు.
*వ్యాధి లక్షణాలు, వ్యాధి ప్రభలిన జిల్లాలు, వ్యాధిని అరికట్టడానికి తీసుకున్న జాగ్రత్తలు, చర్యల వివరములు :*
• లంపీ స్కిన్ వ్యాధి ముఖ్యముగా పశువులకు కాప్రిపాక్స్ వైరస్ అనే వైరస్ ద్వారా వస్తుంది.
• ఈ వ్యాధి ముఖ్య లక్షణం చర్మం కింద కణుతులు, బొడిపెలు ఏర్పడటం. ఈ వ్యాధి దోమలు ఈగలు, పిడుదులు ద్వారా వ్యాప్తి చెందుతుంది.
• వ్యాధి సోకిన పశువులకు పాలు దిగుబడి తగ్గుతుంది, జ్వరం వస్తుంది, చర్మం కింద కణుతులు ఏర్పడతాయి.
• మన రాష్ట్రంలో శ్రీకాకుళం, విజయనగరం, పల్నాడు జిల్లాలో ఈ వ్యాధి నిర్ధారించబడినది. మొత్తంగా 52 పశువులు ఈ వ్యాధి బారిన పడ్డాయి.
• కృష్ణ, విశాఖపట్నం, గుంటూరు మరియు కర్నూలు జిల్లాలలో ఈ వ్యాధి లక్షణాలు ఉన్న పశువుల నుండి నమూనాలు సేకరించి నిర్ధారణ కోసం NIHSAD, Bhopal కు పంపడమైనది.
• ఈ జిల్లాలలో వ్యాధి అనుమానాస్పద పశువులను, మందనుండి వేరు చేసి వైద్యం అందించడం జరుగుతోంది. వ్యాధి నిరోధక టీకాలు “రింగ్ వాక్సినేషన్” పద్దతిలో చేయడం జరుగుతోంది. వ్యాధి సోకిన పశువుల గ్రామము / ప్రాంతముల నుండి ఐదు కిలోమీటర్ల మేరకు రింగ్ వాక్సినేషన్ పద్దతిలో టీకాలు చేయడం జరుగుతోంది. ఇప్పటివరకు 13,679 పశువులకు రింగ్ వాక్సినేషన్ పద్దతిలో టీకాలు వేయడం జరిగింది.
*లంపీస్కిన్ వ్యాధి నివారణ:*
• గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అడ్వైజరీ ప్రకారం Goat Pox వ్యాక్సిన్ ఇవ్వటం ద్వారా ఈ వ్యాధి వ్యాప్తిని నివారించవచ్చు.
• ఈ వ్యాధి సోకిన వెంటనే పశువులను మంద నుండి వేరు చేయాలి.
• వ్యాధి లక్షణలను బట్టి పశు వైద్యుని సలహా మేరకు యాంటీబయటిక్ , ఇతర మందులు వాడాలి.
• శరీరం మీద ఏర్పడిన పుండ్లకు యాంటీసెప్టిక్ ఆయింట్మెంట్స్ వాడటం ద్వారా పశువుల ఆరోగ్యాన్ని కాపాడవచ్చు.
• ఒకసారి వైరస్ పశు శరీరంలోనికి ప్రవేశించాక వాటి ప్రభావం ఉన్నంతవరకు వ్యాధి లక్షణాలు కనిపించి తర్వాత , తగ్గిపోతాయి.
*పశుపోషకులు తీసుకోవలసిన జాగ్రత్తలు:*
• రైతులందరూ పశువుల చావిడి శుభ్రంగా ఉంచి క్రిమి కీటకాలు, దోమలు ,ఈగలు రాకుండా చూసుకుని , పైన చెప్పిన జాగ్రత్తలు తీసుకుంటూ, పుండ్లు పడకుండా మందులు వాడితే ఈ వ్యాధి నుండి పశువులు త్వరగా కోలుకుంటాయి
• పశువు కొట్టాలను మరియు పరిశరాలను క్రిమిసంహారక మందులను పిచికారి చేసి పరిశుభ్రముగా ఉంచుకోవలెను.
• మందలో ఏదైనా పశువు అస్వస్థత అయినప్పుడు అశ్రద్ధ చేయకుండా మందనుండి వేరుచేసి, సమీప పశువైద్యునికి తెలియజేసి తగు వైద్యం పొందవలెను.
• కాబట్టి ఈ వ్యాధి గురించి రైతులు ఎక్కువగా భయపడవలసిన అవసరం లేదని, కాని అప్రమత్తంగా ఉండాలని తెలియజేయడమైనది.
*లంపీస్కిన్ వ్యాధిని అరికట్టడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న చర్యలు*:
• లంపీస్కిన్ వ్యాధి నివారణ టీకాల కార్యక్రమము, రాష్ట్రంలో ముమ్మరంగా సాగుతోంది రాష్ట్ర సరిహద్దు జిల్లాలలోని పశువైద్య సిబ్బందిని అప్రమత్తం చేసి, పశువులలో వ్యాధి నిరోధక టీకాలు చేయడం జరుగుతోంది. తగు సూచనలు మరియు సలహాలు అందించడం జరుగుతోంది. లంపీస్కిన్ వ్యాధి ప్రబలిన జిల్లాలలో మరియు సరిహద్దు జిల్లాలలో వ్యాధి నోరోధక టీకాలతో పాటు స్థానిక సంతలో పశుక్రయవిక్రయాలు తాత్కాలికంగా నిలిపివేయవలసినది తగు సూచనలు చేయడమైనది. మరియు అంతరాష్ట్ర పశువుల రవాణాపై చెక్ పోస్ట్ ల వద్ద తనిఖీలు ముమ్మరం చేయడమైనది.
• రాష్ట్రంలో 2,43,597 పశువులకు ఇప్పటివరకు టీకాలు వేయడం జరిగింది. వ్యాధి నివారణ టీకాల కార్యక్రమము ముమ్మరం కొనసాగుతోంది.
• లంపి స్కిన్ వ్యాధిని కట్టడి చేయడానికి పశు సంవర్ధక శాఖ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము అన్ని చర్యలు తీసుకోవడమైనది. లంపీ స్కిన్ వ్యాధి అదుపులో ఉన్నది. వ్యాధి బారిన పడిన పశువులు వైద్యానికి స్పందించి, త్వరిత గతిన కోలుకుంటున్నాయి.
ఈ వ్యాధి ఈగలు, దోమలు, గోమార్లు, పిడుదులు మరియు ఇతర క్రిమి కీటకాల ద్వారా వ్యాధి గ్రస్త పశువుల నుండి ఇతర పశువులకు వ్యాపిస్తుందని ప్రకటనలో డా. ఆర్. అమరేంద్ర కుమార్ వివరించారు.
addComments
Post a Comment