పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కార్యాచరణ

 *పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల  కార్యాచరణ*గుంటూరు, (ప్రజా అమరావతి): ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి  తూర్పు రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఉమ్మడి ప్రకాశం జిల్లా ప్రజా ప్రతినిధులతో సమీక్ష సమావేశం నిర్వహించి పట్టభధ్రులు ఎమ్మెల్సీ ఎన్నికల్లో పాటించాల్సిన వ్యూహాలను భవిష్యత్తు కార్యాచరణను ప్రకటించి ప్రజా ప్రతినిధులకు దిశానిర్దేశం చేశారు. అక్టోబర్ 1వ తేదీ నుంచి ఓటర్ల నమోదు ప్రక్రియ ప్రారంభమవుతుందని, ప్రతి ఒక్కరు కూడా నియోజకవర్గాల వారీగా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఒక ఇన్చార్జును నియమించుకొని, అతని పర్యవేక్షణలో పట్టభద్రుల ఎన్నికల్లో పార్టీ నాయకులను, కార్యకర్తలను భాగస్వామ్యం చేసుకుంటూ ప్రతి పోలింగ్ స్టేషన్ పరిధిలో పట్టబధ్రులను గుర్తించి, తదుపరి ఓటర్ల నమోదు ప్రక్రియ గురించి మండలాల వారీగా "పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల డ్రైవ్"ను నిర్వహించి వారికి అవగాహన కల్పించి, ఓటర్ల నమోదు కార్యక్రమాన్ని చేపట్టి, నియోజకవర్గ పరిధిలోని పోలింగ్ స్టేషన్ పరిధిలో నమోదైన ఓటర్ల వివరాలను ప్రతిరోజు ఎమ్మెల్సీ అభ్యర్థికి పంపాలని ప్రజాప్రతినిధులను కోరారు.

Comments