పంటను పరిశీలించాకే ఈ-క్రాప్ నమోదు
జిల్లా కలెక్టర్ బసంత కుమార్
పుట్టపర్తి, సెప్టెంబరు 30 (ప్రజా అమరావతి) ః
క్షేత్రస్థాయిలో పంటలను పరిశీలించిన తరువాతే ఈ క్రాప్ నమోదు చేయాలని జిల్లా కలెక్టర్ బసంత కుమార్ ఆదేశించారు. శుక్రవారం పుట్టపర్తి మండల పరిధిలోని గోకులం రోడ్డు లో ఉన్న నారాయణ స్వామి రైతు వరి పంట చేసుకున్న పంట పొలాలు సంబంధించిన రికార్డులను పరిశీలించారు. పుట్టపర్తి గ్రామీణ పరిధిలోనిగ్రామంలో సాగుభూమి విస్తీర్ణం, రైతుల సంఖ్య, పంటల పరిస్థితి, ఈ క్రాప్ నమోదుపైనా ఆరా తీశారు. క్షేత్రస్థాయిలో పంటలను పరిశీంచాలని ఆదేశించారు. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా, వేసిన ప్రతీ పంటనూ ఈ క్రాప్ చేయాలని సూచించారు. గ్రామంలో పనిచేసే విఆర్ఓలు, వ్యవసాయ సిబ్బందికి, ఆ గ్రామంలో పండే పంటలు, రైతుల పరిస్థితిపై అవగాహన ఉండాలని అన్నారు. క్షేత్రస్థాయిలో పర్యటించినప్పుడు మాత్రమే, గ్రామంపై సంపూర్ణ అవగాహన ఏర్పడుతుందని స్పష్టం చేశారు. అనంతరం బ్రాహ్మణపల్లి లో వేరుశనగ పంట వేసుకున్న మల్లికార్జున పంటను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఈ - క్రాఫ్ట్ యాప్ నందు నమోదు ప్రక్రియ ఈరోజు రాత్రి 12 గంటల లోపల 100% పూర్తిచేయాలని ఎలాంటి తప్పులు లేకుండా నమోదు ప్రక్రియ పూర్తిచేయాలని వ్యవసాయ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారి సుబ్బారావు, తాసిల్దార్ భాస్కర్ నారాయణ, ఏవో బ్రహ్మ, వ్యవసాయ విస్తరణ అధికారి ఆనంద నాయక్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు
addComments
Post a Comment