దొంగతనం కేసు లో నిందితుల అరెస్ట్..

 విజయవాడ (ప్రజా అమరావతి);


దొంగతనం కేసు లో నిందితుల అరెస్ట్..విజయవాడ, కృష్ణలంక కి చెందిన దాసరి శ్రీనివాసరావు అను వ్యక్తి భవానిపురం లో

ని రామకృష్ణ లారీ ట్రాన్స్ పోర్ట్ ఆఫీస్ నందు గుమస్తాగా పనిచేస్తున్నట్లు, వారికి గవర్నర్ పేట పీ.యస్ పరిధి లోని హనుమాన్ పేట్ లో కూడా ట్రాన్స్ పోర్ట్ ఆఫీస్ కూడా వున్నట్లు 19.05.2022 వ తేది రాత్రి సుమారు 11.50 గంటలకు హనుమనపేట్ నందు గల ఆఫీస్ కు

తన యొక్క మోటార్ సైకిల్ పై పాత ప్రభుత్వ హాస్పిటల్ రోడ్ గుండా వెళుతుండగా పాత

ప్రభుత్వ హాస్పిటల్ మెయిన్ గేటు దాటిన తర్వాత ఫిర్యాది వెనుక నుండి గుర్తు తెలియని

వ్యక్తులు పల్సర్ బండి మీద వచ్చి ఫిర్యాది చొక్కా జేబులో వున్నా POCO M3 మొబైల్ ఫోన్ ను లాక్కొని వెళ్లిపోయినట్లు గవర్నర్ పేట్ పోలీస్ వారికి ఇచ్చిన పిర్యాదు పై Cr.No.126/2022 U/s 382 IPC గా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంబించినారు..ఈ సంఘటన పై ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమీషనర్ గౌరవ శ్రీ. కాంతి రాణా టాటా,IPS

ఆదేశాల మేరకు, డిప్యూటీ పోలీస్ కమీషనర్ శ్రీ విశాల్ గున్ని IPS సూచన

మేరకు మరియు సౌత్ ACP శ్రీ Dr. B.రవి కిరణ్ ఆధ్వర్యంలో గవర్నర్ పేట్ పోలీస్ స్టేషన్

ఇన్స్పెక్టర్ శ్రీ డి. సురేష్ మరియు వారి సిబ్బందితో కలిసి సంఘటన స్ధలం కి చేరుకొని సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా నిందితులను గుర్తించి అదుపులోనికి తీసుకొని వారి వద్ద

నుండి చోరి కాబడిన మొబైల్ ఫోన్ మరియు 27 మోటార్ సైకిల్ లను (Bullet-5, Pulsar- 16, Splendor-2, HF Deluxe-1, Access-1 Activa-1 Dio-1) స్వాధీనం చేసుకోవడం జరిగింది..


నిందితుల వివరాలు :


1. కగ్గ ఆంజనేయులు@ అంజి@ మార్క్ 93 s/o సుబ్బారావు (లేట్), 20 సం.లు, వలివేరు (V), చుండూరు (M), బాపట్ల (Dist).2. చొప్పవరపు వెంకటేష్ @ వెంకీ s/o సాయి బాబు, 22 సం.లు, వలివేరు (V), చుండూరు (M), బాపట్ల(Dist).

3. మన్నవ సాయి వంశి @ పిల్ల వంశి S/O సాంబశివరావు @ శివ, 22 సం.లు (V), తెనాలి (M), గుంటూరు (Dist)


4.భిరోది భాను ప్రకాష్ @ భాను @ నేపాల్ @ ఎర్రోడు S/O బుద్ధ బహుదూర్, 22 సం.లు, (V), తెనాలి (M), గుంటూరు (Dist)


5.పటాస్ గౌస్ ఖాస్ @ గౌస్ S/O మొహిద్దిన్ ఖాన్, 29 సం.లు, యడ్లపల్లి, చుండూరు (M),బాపట్ల (Dist). వారందరిని అరెస్టు చేయడం జరిగింది..


వివరాలలోకి వెళితే నిందితులు అందరు చెడు వ్యసనాలకు బానిసై జల్సాలకు

అలవాటు పడి దొంగతనాలు చేయడం ప్రారంభించినారు. ఆ క్రమంలోనే పొన్నూరు,

గుంటూరు, గుడివాడ, తణుకు, విజయవాడ మరియు తెలంగాణాలోని నేలకొండపల్లి, కోదాడ లలో మోటార్ సైకిల్ లను దొంగతనాలు చేసినట్లు దర్యాప్తు లో తేలింది. వీటితో పాటు మొబైల్ ఫోన్లు కూడా దొంగతనలు చేసినట్లుగా సమాచారం కలదు. వాటి గురుంచి కూడా విచారించాల్సి వుంది..


దర్యాప్తు లో భాగంగా సంఘటన స్థలంనకు చేరుకొని చుట్టుపక్కల పరిశీలించి,

సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా నిందితుల వివరాలు సేకరించి గవర్నర్ పేట్ ఇన్స్పెక్టర్ శ్రీ D

సురేష్ గారు వారి సిబ్బంది తో కలిసి పై నిందితులను అదుపులోకి తీసుకొని వారి వద్ద నుండి చోరి కాబడిన 27 మోటార్ సైకిల్ లని మరియు ఒక మొబైల్ ఫోన్ ను స్వాధీనం చేసుకోవడం జరిగింది..


దొంగతనం ఫిర్యాదు అందిన వెంటనే వివరాలను సేకరించి నిందితులను అరెస్ట్ చేసి

వారి వద్ద నుండి చోరి కాబడిన 27 మోటార్ సైకిల్ లని మరియు ఒక మొబైల్ ఫోన్ ను

స్వాధీనం చేసుకోవడంలో కీలక పాత్ర పోషించిన గవర్నర్ పేట్ ఇన్స్పెక్టర్ శ్రీ సురేష్ మరియు

ఎస్సై శ్రీ జి.ఫణేంధర్ మరియు వారి సిబ్బందిని నగర పోలీస్ కమీషనర్ గౌరవ శ్రీ. కాంతి రాణా టాటా,IPS, డిప్యూటీ పోలీస్ కమీషనర్ శ్రీ. విశాల్ గున్ని IPS , సౌత్ ACP శ్రీ Dr.

బి.రవి కిరణ్ మరియు ఇతర పోలీస్ అధికారులు అభినందించినారు...

Comments