కౌన్సిలర్ లోవరాజు అక్రమ అరెస్టు పట్ల నిరసన

 కౌన్సిలర్ లోవరాజు అక్రమ అరెస్టు పట్ల నిరసన   

  కాకినాడ, సెప్టెంబర్ 12 (ప్రజా అమరావతి): పిఠాపురం మున్సిపల్ దళిత కౌన్సిలర్ ఖండవిల్లి లోవరాజు అక్రమ అరెస్టుపై బిఎస్పీ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. ఈ కార్యక్రమంలో మాలమహానాడు, దళిత హక్కుల సంఘం నాయకులు భారీగా పాల్గొని నూకరాజు కుటుంబ సభ్యులకు సంఘీ భావం తెలిపారు. ఈ సందర్భంగా బిఎస్పీ జిల్లా అధ్యక్షుడు సబ్బుభాయ్ మాట్లాడుతూ వైకాపాలో ఉంటూ దళితులకు న్యాయం చేయలేని పక్షంలో బహుజన సమాజ్ పార్టీలో నెలరోజులు క్రితం చేరాడన్నారు. లోవరాజు సేవలు గుర్తించిన బిఎస్పీ అధిష్టానం పిఠాపురం మండల అధ్యక్షుడిగా బాధ్యతలు అప్పగించిన తరుణంలో లోవరాజు బిఎస్పీని బలోపేతం చేయడానికి కీలకమైన కార్యాచరణతో ముందుకు సాగుతున్న సమయంలో అధికార పార్టీ వైసీపీలో గుబులు పుట్టిస్తోందని సుబ్బు చెప్పారు. ఈ కారణంగానే లోవరాజును ఎలాగైనా నియంత్రణ చేసి వైకాపాకు జరుగుతున్న నష్టాన్ని తగ్గించుకోవాలనే కుట్రతో లోవరాజుని అక్రమ కేసుల్లో ఇరికించి ఇబ్బందులకు గురి చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఇది కేవలం వైకాపాకు చెందిన నేతలు చేస్తున్న దుర్మార్గపు చర్యని ప్రశ్నించారు. పోలీసులు  అక్రమంగా అరెస్టు చేసి జైలుకు పంపారని తెలిపారు. 

  రాజ్యాంగ బద్దంగా అరెస్టు చేస్తే ఎఫ్ఐఆర్ కాపీ, రిమాండ్ రిపోర్ట్ ఇవ్వాల్సిన బాధ్యత పోలీసులపై ఉందని కానీ లోవరాజు అరెస్ట్ విషంలో దానికి భిన్నంగా ఉందన్నారు. అరెస్టు చేసిన లోవరాజుకి బెయిల్ రాకుండా పోలీసులు కుట్ర బైట పడుతుందన్నారు. దీనిపై న్యాయపోరాటం చేస్తామని హెచ్చరించారు. రానున్న రోజుల్లో మనువాద పార్టీలు మనుగడ కోల్పోయే విధంగా బిఎస్పీ ప్రత్యామ్నాయ పార్టీగా ఎదుగుతుందన్నారు. ఎన్నికల సమయంలో మాలలకు మేనమామ, మాదిగలకు పెద్దన్నను అని  దళితులను మోసం చేసిన సీఎం జగన్ని నడిరోడ్డుపైకి లాగే సమయం తొందరలోనే ఉందన్నారు. 

  ఈ కార్యక్రమంలో లోవరాజు భార్య నాగమణి,  నాయకులు సిద్ధాంతుల కొండబాబు, చెంగలరావు, దారా సురేష్ తదితరులున్నారు.

Comments