వకుళమాత ఆలయం నుండి చెర్లోపల్లి కి లింక్ రోడ్డు ఏర్పాటుకు కసరత్తు*వకుళమాత ఆలయం నుండి చెర్లోపల్లి కి లింక్ రోడ్డు ఏర్పాటుకు కసరత్తు


*


*విద్యుత్, అటవీ, భూగర్భ గనుల శాఖ మంత్రి శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అధ్యక్షతన కీలక సమావేశం*


*తిరుపతి పద్మావతి అతిధి గృహం లో సమన్వయ సమావేశం* 


*హాజరైన తుడా చైర్మన్, చంద్రగిరి ఎమ్మెల్యే శ్రీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, టిటిడి ఈఓ శ్రీ ఏవి ధర్మా రెడ్డి, తిరుపతి కలెక్టర్ శ్రీ కే వెంకట రమణా రెడ్డి,  టిటిడి పాలక మండలి సభ్యుడు శ్రీ పోకల అశోక్ కుమార్, టిటిడి, తుడా, ఆర్ అండ్ బి అధికారులు* 


*వీలైనంత త్వరగా భూసేకరణ చేసి పనులు ప్రారంభించాలని ఆదేశించిన మంత్రి శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి*


*హైవే నుండి చెర్లోపల్లికి సుమారు 1.5 కిలోమీటర్ల లింక్ రోడ్డు* 


*చెన్నై, బెంగళూరు నుండి వచ్చే భక్తులకు ఇకపై సులువుగా చేరుకునేందుకు  హైవే నుండి నేరుగా అలిపిరికి మార్గం* 


*నగరవాసులకు ట్రాఫిక్ సమస్య నుండి కొంత ఉపశమనం* 


*తుడా మాస్టర్ ప్లాన్ తో అనుసంధిస్తూ నూతన రోడ్డు నిర్మాణంకు ప్రణాళికలు*తిరుపతి (ప్రజా అమరావతి): నగరంలో అభివృద్ధికి మరో కీలక అడుగు ముందుకు పడనుంది. వకుళామాత ఆలయం వద్ద జాతీయ హైవే నుండి చెర్లోపల్లి కి నూతన రోడ్డు నిర్మాణం కోసం కసరత్తు ప్రారంభించారు అధికారులు. ఈ రోడ్డు నిర్మాణం పూర్తయితే అటు చెన్నై నుండి, బెంగళూరు నుండి తిరుమలకు వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా ఇక నేరుగా హైవే మీదుగా చెర్లోపల్లి, జూ పార్క్ మార్గంలో అలిపిరి చేరుకునేందుకు వీలవుతుంది. తద్వారా భక్తులకు ఈ మార్గం సులువుగా మారడంతో పాటుగా రానున్న రోజుల్లో తిరుపతి నగరంలో ఇది ఒక కీలక రోడ్డుగా మారే అవకాశం ఉంది. మరోపక్క వకుళామాత ఆలయంకు చేరుకునే భక్తులకు ప్రయాణం మరింత సులభతరం కానుంది. ఇప్పటికే చెన్నై, బెంగళూరు నుండి వచ్చే భక్తులు మహిళా యూనివర్సిటీ మీదుగా, లేదా మరో రోడ్డు ద్వారా నగరం లోకి ప్రవేశించి అలిపిరికి చేరనుండడంతో, నగరంలో ట్రాఫిక్ కు ఇది అదనపు భారంగా మారింది. ఈ నేపథ్యంలో ఈ రోడ్డు నిర్మాణం త్వరితగతిన పూర్తి చేస్తే భక్తులకు, ఇటు నగరవాసులకు ట్రాఫిక్ సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. 


ఈ రోడ్డు నిర్మాణం పై విద్యుత్, అటవీ, భూగర్భ గనుల శాఖ మంత్రి శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అధ్యక్షతన మంగళవారం నాడు తిరుపతి లోని పద్మావతి అతిధి గృహంలో సమన్వయ సమావేశం జరిగింది. ఈ సమావేశం కు తుడా చైర్మన్, చంద్రగిరి ఎమ్మెల్యే శ్రీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, టిటిడి ఈఓ శ్రీ ఏవి ధర్మా రెడ్డి, తిరుపతి కలెక్టర్ శ్రీ కే వెంకట రమణా రెడ్డి,  టిటిడి పాలక మండలి సభ్యుడు శ్రీ పోకల అశోక్ కుమార్ తో పాటుగా, టిటిడి, తుడా, ఆర్ అండ్ బి అధికారులు హాజరయ్యారు. రోడ్డు నిర్మాణం కు కసరత్తు లో భాగంగా భూసేకరణ పై దృష్టి సారించాలని తిరుపతి కలెక్టర్ వెంకట రమణ రెడ్డి ని ఆదేశించారు మంత్రి శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. తుడా మాస్టర్ ప్లాన్ తో అనుసందించి రోడ్డు నిర్మాణం పనులు పూర్తి చేసినందుకు కసరత్తు చేస్తున్నారు. ఇదే అంశాన్ని టిటిడి బోర్డు సమావేశంలో చర్చించి ఆమేరకు ముందుకు సాగుతామన్న టిటిడి అధికారులు. మరో పక్క వకుళామాత ఆలయం వద్ద కల్యాణమండపం, టాయిలెట్స్ తో పాటు మరిన్ని సదుపాయాలు కల్పిచందుకు టిటిడి సిద్ధమైనట్టు అధికారులు వివరించారు. వాటితో పాటు గా వకుళమాత ఆలయ ప్రాంగణం సుందరీకరణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు. తుడా కూడా సుందరీకరణ లో భాగం అవుతుందని తెలిపారు చైర్మన్ శ్రీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి.

Comments