మొగల్తూరు: సెప్టెంబర్ 24 (ప్రజా అమరావతి);
నాడు నేడు పాఠశాలలో అదనపు గదులునిర్మాణం , మరుగుదొడ్లు, ప్రహరీ గోడలు నిర్మాణాలను పరిశీలించిన స్పెషల్ చీఫ్ సెక్రటరీ బి. రాజశేఖర్,
అడ్వైజర్ మురళి, సర్వశిక్షా అభియాన్ ఎస్ పి డి శ్రీనివాస్ , జిల్లా కలెక్టర్ శ్రీమతి పి. ప్రశాంతి .
శనివారం నాడు- నేడు పనుల జరుగుతున్న మెగల్తూరు మండలం ముత్యాలపల్లి గ్రామంలో ని. SBM ZP H S లోజరుగుతున్న పనులను పరిశీలించారు. నాడు నేడు పాఠశాల అభివృద్ధిలో ఏమైనా సాంకేతిక ఇబ్బందులు తలెత్తితే వెంటనే దృష్టికి తీసుకురావాలని వారు అన్నారు. అదనపు తరగతి గదుల నిర్మాణం గురించి సంబంధిత AE, ఇంజినీరింగ్ అసిస్టెంట్ ను అడిగి తెలుసుకున్నారు. అదనపు గదులు నిర్మాణం కు వచ్చిన స్టీల్ , సిమ్మింట్ , ఇసుక , కంకర తదితర మెటీరియల్ ఎంతవచ్చింది , ఎంత వినియోగిచారు, ఇంకా ఎంత నిల్వలు ఉన్నాయి ఫిజికల్ గాను రిజిస్టర్ ను పరిశీలించారు.
విద్యార్థులకు నాణ్యతతో కూడిన పౌష్టిక ఆహారం అందిస్తున్నది లేనిది పరిశీలించి ఆహారాన్ని రుచి చూసి సంతృప్తి వ్యక్తం చేశారు . జగనన్న విద్యాకానుక కిట్లను వారు పరిశీలించారు.
అదే కాంపౌండ్ లో ఉన్న ఎలిమెంటరీ పాఠశాలల్లోని విద్యార్థుల క్లాస్ రూములు లను వారు పరిశీలించి విద్యార్థులతో మాట్లాడారు ఒకటి , రెండు క్లాస్ లను వేరు చేయాలని వారు సంబంధిత హెడ్మాస్టర్ ను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో నర్సాపురం సబ్ కలెక్టర్ సి విష్ణు చరణ్, డీఈవో ఆర్ వెంకట రమణ, సమగ్ర శిక్ష అభియాన్ సమన్వయకర్త శ్యామ్ సుందర్, హెచ్ ఎం, బాలనాగవేణి,
ఏ ఈ అశోక్ , ఇంజినీరింగ్ అసిస్టెంట్ హిమబిందు తదితరులు పాల్గొన్నారు.
addComments
Post a Comment