తిరుపతిలో ఘనంగా ప్రపంచ పర్యాటక దినోత్సవ సంబరాలు

 *తిరుపతిలో ఘనంగా ప్రపంచ పర్యాటక దినోత్సవ సంబరాలు*


ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్బంగా ఆంధ్రప్రదేశ్ పర్యాటక సంస్థ వారు తిరుపతి శిల్పారామంలో ఘనంగా సంబరాలు నిర్వహించారు.


ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖా మంత్రి రోజా తో కలిసి తిరుపతి ఎంపీ గురుమూర్తి హాజరయ్యారు.


ఈ కార్యక్రమంలో ఎ.పి టూరిజం శాఖ వారి ఆదర్వంలో ఏర్పాటు చేసిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు చూపరులను ఆకట్టుకొన్నాయి.


తదుపరి టూరిజం రంగంలో రాష్ట్ర పరిధిలో ప్రధాన భూమిక పోషించే  అతిద్య రంగానికి చెందిన పలు సంస్థల వారికి అవార్డ్స్ ప్రకటించారు.


ఆలాగే టూరిజం రంగంలో విశిష్ట సేవలు అందిస్తున్న పలువురు ఉద్యోగులకి అవార్డ్స్ ప్రదానం చేసారు.


ఈ కార్యక్రమంలో ఏపీ టూరిజం సీఈఓ కన్నబాబు, ఏపీ టూరిజం చైర్మన్ వరప్రసాద్ రెడ్డి, ఏపీ టూరిజం డిప్యూటీ సీఈఓ రాముడు, సీఈఓ శిల్పారామం శ్యాం మోహన్ రెడ్డి మరియు టూరిజం శాఖకు సంబందించిన పలువురు అధికారులు పాల్గొన్నారు.

Comments