శరన్నవరాత్రి మహోత్సవాల్లో ఆరవ రోజున శ్రీ కనకదుర్గమ్మ వారు శ్రీ మహాలక్ష్మి గా దర్శనమిస్తారు.



ఇంద్రకీలాద్రి: సెప్టెంబర్ 30 (ప్రజా అమరావతి);


శరన్నవరాత్రి మహోత్సవాల్లో ఆరవ రోజున శ్రీ కనకదుర్గమ్మ వారు శ్రీ మహాలక్ష్మి గా దర్శనమిస్తారు.


మంగళప్రదమైన దేవత ఈ మహాలక్ష్మి దేవి.


జగన్మాత మహాలక్ష్మి స్వరూపంలో దుష్టరాక్షస సంహారాన్ని చేయటం ఒక అద్భుత ఘట్టం. మూడు శక్తుల్లో ఒక శక్తి అయినా శ్రీ మహాలక్ష్మి అమితమైన పరాక్రమాన్ని చూపించి హలుడు అనే రాక్షసుడిని సంహరించింది.  లోక స్థితికారిణిగా  ధన, ధాన్య, ధైర్య, విజయ, విద్య, సౌభాగ్య, సంతాన, గజలక్ష్ములుగా వరాలు ప్రసాదించే అష్టలక్ష్మి సమిష్టిరూపమైన అమృతస్వరూపిణిగా శ్రీ దుర్గమ్మ ఈరోజు మహాలక్ష్మి దేవిగా భక్తులను అనుగ్రహిస్తారు.

 శ్రీ మహాలక్ష్మీ అమ్మవారిని దర్శించడం వలన భక్తులందరికీ ఐశ్వర్యప్రాప్తి, విజయము లభిస్తుంది.


Comments