రాజానగరం (ప్రజా అమరావతి);
వెలుగుబంద లేఅవుట్ లో ఇండ్ల నిర్మాణం వేగవంతం చెయ్యాలి
జిల్లాలో అతిపెద్ద లే అవుట్ గా వెలుగుబంద
ఇండ్ల నిర్మాణాలపై మరింత దృష్టి పెట్టాలి
- కలెక్టర్ డా. కె. మాధవీలత
జగనన్న కాలనీలో పేదలందరికీ ఇళ్ళు కార్యక్రమాన్ని మరింత వేగవతం చేసే విధానం లో భాగంగా వెలుగుబంద, తదితర కాలనీలను పరిశీలించడం జరిగిందని జిల్లా కలెక్టర్ డా. కె. మాధవీలత అన్నారు.
మంగళవారం రాజానగరం మండలం వెలుగుబంద జగనన్న హౌసింగ్ లే అవుట్ల ను ఎంఎల్ఏ జక్కంపూడి రాజా, మునిసిపల్ కమిషనర్ దినేష్ కుమార్ లతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ కె. మాధవీలత మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మంగా జగనన్న లే అవుట్ పరిధిలో ఇళ్ల నిర్మాణంవేగవంతం చేసేందుకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు. జిల్లాలో వెలుగు బంద లో అత్యధిక ఇళ్ల స్థలాలు అందుబాటులో ఉన్నాయని, ఇక్కడ మౌలిక సదుపాయాలు కల్పించేందుకు కూడా అత్యంత ప్రాధాన్యత ఇవ్వడం జరుగతుందన్నారు. 90 రోజుల కార్యక్రమంలో భాగంగా అర్హులైన పేదలు ఇంటి నిర్మాణం కోసం ధరకాస్తు చేసుకుంటే వారికి ఉచితంగా స్థలం అందించే కార్యక్రమాన్ని చేపడుతున్నామని, అందులో భాగంగా ఈరోజు అధికారులతో కలిసి వివిధ లే అవుట్ లని పరిశీలించడం జరిగిందని పేర్కొన్నారు.
రానున్నరోజుల్లో వెలుగుబంద జగనన్నకాలనీఇప్పటికే ఇంటి నిర్మాణం చేపట్టిన లబ్దిదారులతో మరికొందరికి స్పూర్తి కల్పించాలన్నారు. వివిధ దశల్లో ఉన్న ఇంటి నిర్మాణాలను మరింత వేగవంతం చేసే దిశలో అడుగులు వేయాలన్నారు. ఆర్థికంగా కూడా తగిన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. కేవలం ఈ లేఅవుట్ లో ఆశించిన స్థాయిలో ఇంటి నిర్మాణాలు చేసుకుంటున్నారని, మిగిలిన వారితో కూడా ఇంటి నిర్మాణం ప్రారంభింప చెయ్యాల్సి ఉందన్నారు. ఇప్పటికే ఆరు మంది "యమీనిటీ కార్యదర్శి" వారితో పాటు , వెల్ఫేర్ కార్యదర్శి నియమించిన దృష్ట్యా పనులు వేగవంతం చేయాలన్నారు. జిల్లాలో 60 వేల మంది ధరకాస్తు చేసుకోగా 51 వేల మంది కి ఇంటి నిర్మాణం చేపట్టేందుకు మంజూరు ఉత్తర్వులు ఇవ్వటం జరిగిందన్నారు. వారిలో సుమారు 12 వేల మంది ఇంటి నిర్మాణం పూర్తి చేశారన్నారు.
శాసన సభ్యులు జక్కంపూడి రాజా మాట్లాడుతూ రాజానగరం నియోజకవర్గం పరిధిలో సుమారు 20 వేల మంది కి ఎన్ పి ఐ లో భాగంగా ఇళ్ళ పట్టాలు పంపిణీ చేయడం జరిగిందన్నారు. అర్హులైన సొంత ఇళ్లు లేని ప్రతి ఒక్క పేద వానికి సొంత ఇంటి కల సాకారం చెయ్యడం జగన్ మోహన్ రెడ్డి యొక్క ఆశయం అన్నారు. ఆయా జగనన్న కాలనీల్లో ఇళ్లు కట్టుకుని నివాస యోగ్యం గా ఉండేలా మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. సాధ్యమైనంత మేరకు ఆయా గ్రామాల్లోని స్థలాలు కేటాయించాలని, సాధ్యం కాని పక్షంలో సమీపంలోనే స్థలాలు గుర్తించేందుకు జిల్లా కలెక్టర్, ఇతర అధికారులతో వివిధ జగనన్న కాలనీలను పర్యటించడం జరిగిందని జక్కంపూడి రాజా అన్నారు. ఇంకా ఎవరైనా అర్హులు మిగిలి ఉంటే వారికి కూడా స్థలాలు కేటాయించడం జరుగుతుందని అన్నారు.
లబ్ధిదారుని ఇంటికి వెళ్ళిన కలెక్టర్ , ఎమ్మెల్యే
వెలుగుబంద కాలనీలో ఇంటి నిర్మాణం చేసిన సత్తి వెంకట సుబ్బలక్ష్మి (9374) ఇంటికి వెళ్ళిన కలెక్టర్ మాధవీలత వారితో ముఖాముఖి సంభాషించి, అభినందించారు. ఇంటి నిర్మాణం కోసం ప్రభుత్వం ఇచ్చిన రూ.1,80,000 వేలకు అదనంగా మరో ₹ .20 వేలు ఖర్చు చేసినట్లు తెలిపారు. ఆ మొత్తాన్నికి బ్యాంకు రుణం మంజూరు చేశారని తెలిపారు. తమ చిరకాల స్వప్నం సొంత ఇంటి కల జగనన్న ద్వారా సాకారం అయిందని సుబ్బలక్ష్మి దంపతులు ముఖ్యమంత్రికి, ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ పర్యటనకు మునిసిపల్ కమిషనర్ కె. దినేష్ కుమార్, ఆర్డీవో ఏ. చైత్ర వర్షిణి, అడిషనల్ కమిషనర్ సత్యవేణి, హౌసింగ్ ఈ ఈ జీ.సోములు, తహశీల్దార్లు, డీ ఈ లు, ఏ ఈ లు, వర్క్ ఇన్స్పెక్టర్, స్థానిక ప్రజా ప్రతినిధులు తదితరులు హాజరయ్యారు.
addComments
Post a Comment