స్థాయి సంఘం (స్టాండింగ్ కమిటీ) సమావేశంలో పలు ప్రజోపయోగకరమైన పనులకు ఆమోదం

 గుంటూరు (ప్రజా అమరావతి); నగర పాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోనీ మేయర్ ఛాంబర్ నందు మేయర్ గారి అధ్యక్షతన నిర్వహించిన స్థాయి సంఘం (స్టాండింగ్ కమిటీ) సమావేశంలో పలు ప్రజోపయోగకరమైన పనులకు ఆమోదం


తెలుపుతున్న  *గుంటూరు నగర పాలక సంస్థ మేయర్ కావటి శివ నాగ మనోహర్ నాయుడు* ,మరియు ఈ కార్యక్రమంలో నగర పాలక సంస్థ *కమిషనర్ కీర్తి చేకూరి IAS*,స్టాండింగ్ కమిటీ సభ్యులు (కార్పొరేటర్ లు) షేక్ ఫర్జానా,నిమ్మల వెంకటరమణ,పడాల సుబ్బారెడ్డి,షేక్ జుమ్మాబి,బొడ్డుపల్లి స్మితా పద్మజా,మల్లవరపు రమ్య,నగరపాలక సంస్థ SE భాస్కర్,CP మూర్తి,ఎగ్జామినర్ సుబ్బారావు,వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మేయర్  మాట్లాడుతూ,

 వెంకటేశ్వరరావు కాలనీ 1,2 మరియు 3వ లైన్ల యందు సి. సి రోడ్లు నిర్మించుటకు 43 లక్షలతో మరియు యల్.బి నగర్ 1,2 లైన్లో సి.సి ట్రైన్లో మరియు కల్వకు నిర్మించుటకు 47 లక్షల రూపాయలతో అంచనాలు సిద్ధం చేయడం జరిగింది.

 చెన్నం వారి వీధి క్రాస్ రోడ్ల యందు కొత్త యూజీడి పైపులైన్లు మరియు వ్యాన్ హాల్స్ ఏర్పాటు చేయుటకు 19.80 లక్షల రూపాయలతో అంచనాలు సిద్ధం చేయడం జరిగింది.

 కుమ్మరి బజార్ 1వ లైన్ నుండి 8 వరకు సిసి రోడ్డు మరియు సిసి డ్రైన్స్ నిర్మించుటకు 29.70 లక్షతో అంచనాల సిద్ధం చేయడం జరిగింది.

నందివెలుగు రోడ్డు లోని మున్సిపల్ కార్పొరేషన్ అప్పర్ ప్రైమరీ స్కూల్ నందు టాయిలెట్స్ మరియు కాంపౌండ్ వాల్ నిర్మించుటకు 11 లక్షల రూపాయలతో అంచనాలు సిద్ధం చేయడం జరిగింది.

 నగరపాలక సంస్థ ఎదురుగా గల గాంధీ పార్క్ నుండి హిమనీ స్వీట్స్ వరకు ఉన్నటువంటి పాత కల్వర్ట్ స్థలంలో నూతన కల్వర్టు నిర్మించుటకు 17 లక్షలతో అంచనాల సిద్ధం చేయడం జరిగింది.

నల్లచెరువు రిజర్వాయర్ మరమ్మతులకు 14 లక్షలతో అంచనాల సిద్ధం చేయడం జరిగింది.

 శ్రీనగర్ పుట్ట రోడ్డు నందుగల మెయిన్ రోడ్డునకు మరియు ఆటో రోడ్డులకు సిసి డ్రైన్ నిర్మించుటకు 27.70 లక్షలతో తయారుచేసిన అంచనాలకు ఆమోదం తెలపడం జరిగింది.

3వంతెనల వద్ద రోడ్డు మరమ్మత్తులు చేయుటకు మరియు సుందరీకరణ పనులు నిర్వహించుటకు 17.90 లక్షలతో తయారు చేసిన అంచనాలకు ఆమోదం తెలపడం జరిగింది.  

 సాయి కృష్ణ నగర్ నందు మరియు గుజ్జనగుండ్ల నాలుగో లైన్ నుండి బికారి కాంప్లెక్స్ వరకు సిసి రోడ్డు నిర్మించుటకు 19.60 లక్షలతో మరియు సీసీ కాలంలో మరి ఆర్సీసీ కల్వర్టులు నిర్మించుటకు 27.80 లక్షలతో తయారు చేసినఅంచనాలకు ఆమోదం తెలపడం జరిగింది.

స్వర్ణ భారతి నగర్ నందు సీసీ రోడ్డు 49.25 లక్షల రూపాయలతో నిర్మించుటకు తయారు చేసిన అంచనాలకు ఆమోదం తెలపడం జరిగింది.

జి.కె నగర్ 1,2 లైన్లు క్రాస్ రోడ్స్, మాతృశ్రీ కాలేజీ మరియు జానీ నిత్యుంజయ నగర్ 3వ లైన్ సిసి రోడ్ నిర్మించుటకు 41.20 లక్షల అంచనాలకు ఆమోదం తెలపడం జరిగింది.

రామనామ క్షేత్రం ప్రధాన రహదారి 80 అడుగులుగా విస్తరించుట,బి. టి రోడ్డు నిర్మాణం, సెంట్రల్ డివైడర్స్ మరియు త్రాగునీటి పైపులు షిఫ్టింగ్ పనులు ఇప్పటికే జరుగుతున్నాయని, సదరు ప్రాంతంలో నూతనంగా యు.జి.డి పైప్ లైన్ నిర్మించుటకు 42.00 లక్షలతో తయారు చేసిన అంచనాలకు ఆమోదం తెలుపుట జరిగింది.మరియు సుమారు 18 కోట్ల రూపాయల పనులకు ఆమోదం చేయటం జరిగినది



Comments