జిల్లా కలెక్టర్ శ్రీ కె వి ఎన్ చక్రధర్ బాబు విశేషంగా కృషి చేయడంతో జిల్లాకు జాతీయ పురస్కారం లభించింది.



నెల్లూరు సెప్టెంబరు 26 (ప్రజా అమరావతి);


జిల్లా కలెక్టర్ శ్రీ కె వి ఎన్ చక్రధర్ బాబు విశేషంగా కృషి చేయడంతో జిల్లాకు జాతీయ పురస్కారం లభించింది. 


వివరాల్లోకి వెళితే....


ఈ ఏడాది ఏప్రిల్ 28 తేదీ నుండి ఆగస్టు 15వ తేదీ వరకు  నిర్వహించిన ఆజాదీసే అంత్యోదయ తక్ కార్యక్రమాన్ని నూటికి నూరు శాతం లక్ష్యాలను సాధించినందుకు దేశ స్థాయిలోనే జిల్లాకు ఆరో స్థానం దక్కింది.


సోమవారం న్యూఢిల్లీ  లోడీ రోడ్ లోని ఇండియన్ హాబిటట్ సెంటర్ - డెకరండ కన్వెన్షన్ హాల్ లో నిర్వహించిన టాప్ ర్యాంకింగ్ జిల్లాల అభినందన కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వ గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ నాగేంద్రనాథ్ సిన్హా చేతుల మీదుగా గౌరవ పురస్కారాన్ని జిల్లా పరిషత్  సీఈవో శ్రీమతి వాణి, జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ శ్రీ శ్రీకాంత్ ప్రదీప్ కుమార్ అందుకున్నారు.


 జిల్లా కలెక్టర్  వారి తరఫున జడ్పీ సీఈవో, ఎల్ డి ఎం లు  న్యూఢిల్లీలో  ప్రశంసా పత్రాలు,  జ్ఞాపికలను స్వీకరించారు. జిల్లా కలెక్టర్ తో పాటు జెడ్పిసిఓ పేరుతో రెండు ప్రశంసా పత్రాలు అందజేశారు. 

Comments