అత్యంత ప్రమాదకర మలుపులను గుర్తించాలి .



రాజమహేంద్రవరం, (ప్రజా అమరావతి);


- అత్యంత ప్రమాదకర మలుపులను గుర్తించాలి .



 - రహదారి ప్రమాదాలపై సమాచారం ఇస్తే రూ.5 వేల పారితోషికం

రహదారి ప్రమాదాలు సంభవించకుండా పటిష్టమైన చర్యలు..

.. కలెక్టర్.. మాధవీలత 


జిల్లాలో రహదారి ప్రమాదాలు ద్వారా మరణాలు సంభవించకుండా నివారించెం దుకు  పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ డా. మాధవీలత అధికారులను ఆదేశించారు.


శుక్రవారం  స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరం లో  జిల్లా స్థాయి రహదారి  భద్రతా కమిటీ  సమీక్షా సమావేశం  జిల్లా కలెక్టర్  డా. మాధవీలత అధ్యక్షతన జరిగింది.


ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ  జిల్లాలో జాతీయ, రాష్ట్ర రహదారులపై  ప్రమాదకరమైన మలుపులను గుర్తించి ఆ ప్రదేశాల్లో స్పీడ్ బ్రేకర్స్, ప్రధాన హెచ్చరిక బోర్డులను వాహన చోదకులకు గుర్తించే విధంగా ఏర్పాటు చేయ్యాలన్నారు.


ఈ సందర్భంగా గత సమావేశం లో  తీసుకున్న పలు అంశాలపైచర్చిచ్చారు.


 ప్రమాదం జరిగిన తొలి అరగంట ఎంతో కీలక మని, ఆ సమయంలో ప్రథమ చికిత్స అందిస్తే ప్రాణాలను కాపాడటం సాధ్యమవుతుందని చెప్పారు.  రోడ్డు ప్రమాదాలు జరిగిన వెంటనే స్పందించి , సమాచారం అందించి ఆదుకునే వారికి ప్రభుత్వం పరంగా రూ .5 వేల రూపాయలు పారి తోషికం అందించే విధంగా అవగాహన కల్పిం చాలని కలెక్టర్ మాధవీలత సూచించారు. యువత మితిమీరిన వేగంతో వాహనాలు నడపడం, కనీస జాగ్రత్తలు తీసుకోకపోవడం వంటి నిర్లక్ష్యాలు కూడా ప్రమాదాలకు కారణమవుతున్నాయని చెప్పారు.  జిల్లాలో అత్యంత ప్రమాద కరమైన బ్లాక్ స్పాట్స్ 15 గుర్తించామన్నారు. ఆయా ప్రదేశాల్లో రాష్ట్ర, జాతీయ రహదారులు, పోలీసు, రవాణా శాఖ ల ద్వారా శాశ్వత పరిష్కారం కోసం సమగ్ర నివేదికను అందచేయాలని ఆదేశించారు. హెల్మెట్ లేకుండా, విచ్చల విడిగా వాహనాలు ఎక్కడ పడితే అక్కడ నిలుపుదల, మద్యం తాగి వాహనాలు నడపడం వంటి వాటిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వాహనాల వేగ నియంత్రణకు తక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు.



రోడ్ ప్రమాదాలు నివారించే విధంగా రద్దీ ఉన్న ప్రాంతాల్లో డివైడర్లు ఏర్పాటు, నిర్ధారించేందుకు పోలీస్, ఆర్ అండ్ బి, మున్సిపల్, ఆర్ టి ఓ అధికారులతో కమిటి  చెయ్యాలన్నారు.  రిజిస్ట్రేషన్ పునరుద్ధరణ, లేకుండా నడపడానికి వ్యతిరేకంగా కేసులు నమోదు చేయడం జరుగుతుందన్నారు.

ట్రాఫిక్ నియంత్రణలో భాగంగా రద్దీ వున్నా అన్ని ప్రదేశాల్లో పోలీస్ విధులు నిర్వహించేలా  చర్యలు తీసుకోవాలన్నారు.

రాజమహేంద్రవరం మున్సిపల్ పరిధి లో మంజూరు అయినా అన్ని రహదారులను యుద్ధప్రతిపదికన వేయాలన్నారు.

దివాన్‌చెరువు నుండి కొవ్వూరు మధ్య రోడ్డు, గామన్ వంతెన, రాజానగరం నుండి కాకినాడ రహదారి (ADB) మధ్య చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న ఫ్లైఓవర్ పనులపై చర్చించారు. జిల్లా లో 2022 జనవరి  నుంచి  ఆగస్టు వరకు 622 రోడ్ ప్రమాదాలు జరగ్గా 219 మంది  మరణించారని, 678మంది స్వల్ప గాయలతో బయట పడ్డారని ఆర్టీఓ వివరించారు.  వాటిలో ఏ ఏ సమయాల్లో ప్రమాదాలు జరుగుతున్నాయి అనే వాటిపై గణాంకాలు భవిష్యత్ కార్యాచరణ అత్యంత అవసరం అన్నారు.  ఉదయం 6 - 9 మధ్య 62,  ఉదయం 9 -12 మధ్య 78, మ.12 - 3 మధ్య 102, సా.3 - 6 మధ్య 113, సా.6 - రా 9 మధ్య 131, రా 9 .- 12 మధ్య 65, అర్థ రాత్రి 12 - తెల్ల వారుజామున 31,  తెల్ల వారుఝాము 3 నుంచి ఉ.6 వరకు 40 ప్రమాదాలు జరిగాయన్నారు.




ఈ కార్యక్రమం లో మున్సిపల్ కమీషనర్ కె. దీనష్ కుమార్, పి.డి.నేషనల్ హైవేస్  ఆధారిటీ ఆఫ్ ఇండియా డి. సురేంద్ర నాధ్,  అడిషినల్ కమీషనర్, సత్య వేణి, అడిషనల్ ఎస్.పి. జి. వెంకటేశ్వరరావు, జిల్లా ట్రాన్స్ పోర్ట్ అధికారి, ఎస్ యంవి. కృష్ణారా వు, మోటర్ వెహికల్ ఇన్ స్పె క్టర్లు,ఎస్. ఎస్. రంగనాయ కులు, జి. రామ నారాయన్, సి. హెచ్ సంపత్, ఆర్. అండ్ బి, ఈ. ఈ, ఏ. శ్రీకాంత్, డియంహెచ్ఓ డా.ఎన్. వసుంధర, ఆర్.అండ్ బి, డి.ఈ.ఈలు,బి. వి. మధు సూదన రావు, పి. భాస్కర రావు, డి. ఎస్. పి. లు, జె. వి. సంతోష్ కుమార్, బి. శ్రీధర్, కొవ్వూరు మునిసిపల్ కమీషనర్.. బి. శ్రీకాంత్, కారుణ్య చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, కె. రామ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.




Comments
Popular posts
ఉత్తరాఖండ్‌ అసెంబ్లీ సెక్రటేరియట్‌లోని 228 మంది ఉద్యోగులను డిస్మిస్‌ చేస్తూ హైకోర్టు నిర్ణయం సరైనదేనని పేర్కొంది.
Image
ఇంటర్నెట్‌లో గూగుల్ సెర్చ్‌లో సైబర్ క్రైమ్ కేసులు పెరుగుతున్నాయి.
Image
న్యాయప్రక్రియకు..రాజ్యాంగపరమైన చట్టాలకు లోబడి వికేంద్రీకరణ చేయబోతున్నాం.
Image
*ఆంథ్ర రత్న జయంతి జూన్ 2* *స్వాతంత్ర్య పోరాటయోధుడు, ఉపాధ్యాయుడు,చీరాల పేరాల ఉద్యమనాయకుడు గాంధేయవాది మన తెలుగువాడు ఆంధ్రరత్న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య జయంతి జూన్ 2.* *కృష్ణా జిల్లా, పెనుగంచిప్రోలు గ్రామంలో 1889 జూన్ 2 న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య జన్మించాడు. ఆయన పుట్టిన మూడవ రోజునే తల్లి సీతమ్మ, మూడో ఏట తండ్రి కోదండ రామస్వామి మరణించారు. అప్పటినుండి పినతండ్రి, నాయనమ్మల సంరక్షణలో పెరిగాడు. కూచిపూడిలోను, గుంటూరులోను ప్రాథమిక విద్య జరిగింది. హైస్కూలులో చదివే సమయంలోనే 'జాతీయ నాట్య మండలి' స్థాపించి సంగీత, నాటక కార్యక్రమాలు నిర్వహించాడు. అయితే చదువుపై అంత శ్రద్ధ చూపకపోవడంచేత మెట్రిక్యులేషనులో తప్పాడు. తరువాత బాపట్ల లో చదివి ఉత్తీర్ణుడయ్యాడు*. *నడింపల్లి వెంకటలక్ష్మీ నరసింహారావు అనే ఒక మిత్రుని సాయంతో 1911లో స్కాట్లండు లోని ఎడింబరో విశ్వ విద్యా లయంలో ఎం.ఎ. చదివాడు*. *తరువాత ఆనంద కుమార స్వామి తో కలసి కొంతకాలం పనిచేశాడు. ఆ సమయంలో 'నందికేశ్వరుడు' రచించిన 'అభినయ దర్పణం' అనే గ్రంథాన్ని “The Mirror of Gesture,” అన్న పేరుతో సంస్కృతం నుండి ఆంగ్లంలోకి అనువదించాడు. ఇది 1917లో 'కేంబ్రిడ్జ్ - హార్వర్డ్ యూనివర్శిటీ ప్రెస్' వారిచే ప్రచురించబడింది.* *తిరిగివచ్చాక, రాజమండ్రి లోను, బందరు లోను కొంతకాలం ఉపాధ్యాయుడిగా పనిచేసాడు. తన స్వతంత్ర భావాల కారణంగా పైవారితో పడక ఆ ఉద్యోగాలు వదలిపెట్టాడు. తరువాత గోపాల కృష్ణయ్య స్వాతంత్ర్య సంగ్రామం లో దూకాడు*. *బ్రిటీష్ ప్రభుత్వం 1919లో చీరాల-పేరాల గ్రామాలను కలిపి పురపాలక సంఘంగా చేయడంతో ప్రజలపై పన్నుల భారం అధికమై పురపాలక సంఘం రద్దు చేయాలని ఉద్యమించారు. ప్రస్తుతం ప్రకాశం జిల్లా లో ఉన్న చీరాల, పేరాల గ్రామాల జనాభా ఆ కాలంలో 15000. జాండ్రపేట, వీరరాఘవపేట గ్రామాలను చీరాల, పేరాలతో కలిపి చీరాల యూనియన్ అని వ్యవహరించే వారు. ఈ యూనియన్ నుంచి ఏడాదికి నాలుగు వేల రూపాయలు వసూలయ్యేవి. మద్రాసు ప్రభుత్వం 1919 లో చీరాల-పేరాలను మున్సిపాలిటీగా ప్రకటించింది. పన్ను ఏడాదికి 40,000 రూపాయలయ్యింది. సౌకర్యాలు మాత్రం మెరుగు పడలేదు. ఇక్కడ ఉన్న నేతపని వారు, చిన్నరైతులు పన్ను చెల్లించలేక మున్సిపాలిటీని రద్దు చేయాలని ప్రభుత్వానికి ఎన్నో వినతి పత్రాలు సమర్పించారు. ఫలితం లేదు. దాంతో వారు దుగ్గిరాల గోపాలకృష్ణయ్య నాయకత్వంలో ఆందోళన ప్రారంభించారు. ఇది స్వాతంత్ర్య పోరాటంలో ఒక ముఖ్యమైన ఘట్టం. ఆంధ్ర దేశం అంతా తిరిగి బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ప్రచారం చేశాడు. నిషేధాన్ని ఉల్లంఘించి బరంపురంలో ఉపన్యాసం చేసినందుకు ఒక సంవత్సరం పాటు జైలు శిక్ష అనుభవించాడు.చీరాల పేరాల ఉద్యమం -మద్రాస్ ప్రసిడెన్సీని కంపింపజేసింది.. ఆ ఉద్యమం మిగతా ప్రాంతాలకు వ్యాపిస్తుందేమోనని ఆంగ్లేయపాలకులు భయకంపితులయినారు..చివరికి జాతీయకాంగ్రీసు జోక్యంతో ఉద్యమం ముగిసింది...* *తెలుగు నాట జానపద కళా రూపాల పునరుద్ధరణకు, గ్రంథాలయాల వ్యాప్తికి గోపాలకృష్ణయ్య ఇతోధికంగా కృషి చేశాడు. 'సాధన' అనే పత్రిక నడిపాడు*. *ఆయన ప్రచారం చేసిన జానపద కళారీతులు - తోలుబొమ్మలాట, జముకుల కథ, బుర్రకథ, వీధి నాటకాలు, సాము గరిడీలు, గొల్ల కలాపం, బుట్ట బొమ్మలు, కీలు గుర్రాలు, వాలకాలు, గోసంగి, గురవయ్యలు, సరదా కథ, కిన్నెర కథ, కొమ్ము బూర,జోడు మద్దెల, పల్లె సుద్దులు, తూర్పు భాగోతం, చుట్టు కాముడు, పిచ్చికుంట్లవాళ్ళ కథ, సాధనా శూరులు, పలనాటి వీర విద్యావంతులు - వగైరా* *గోపాలకృష్ణయ్య నియమ తత్పరుడు. 'శ్రీరామదండు' అనే ఆధ్యాత్మిక, జాతీయతా స్వచ్ఛంద సమూహాన్ని ఏర్పాటు చేశాడు.* *1921 లో గుంటూరులో ఒక సభలో "ఆంధ్ర రత్న" అన్న బిరుదుతో ఆయనను సత్కరించారు.* *ఈ మహనీయుని త్యాగాలకు తెలుగుజాతి సర్వదా ఋణపడివుంది*. *ఉపాధ్యాయ సేవా కేంద్రం,విజయవాడ*
Image
ఒక్క ఇల్లూ కట్టని చిన్న సైకో ఆర్కే ఇళ్లు కూల్చేస్తున్నాడు
Image