వ్యవసాయ గణాంకాలతో నే సంక్షేమ ప్రణాళికలు
జిల్లా కలెక్టర్ బసంత కుమార్
పుట్టపర్తి, సెప్టెంబర్ 9 (ప్రజా అమరావతి):
కేంద్ర ప్రభుత్వం ఐదేళ్లకు ఒకసారి నిర్వహించే వ్యవసాయం గణాంకాల ద్వారానే కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు సంక్షేమ పథకాల అమలకు ప్రణాళికలు రూపొందిస్తాయని జిల్లా కలెక్టర్ బసంత కుమార్ పేర్కొన్నారు
స్థానిక కలెక్టరేట్లోని కార్యాలయంలోని ముఖ్య ప్రణాళిక అధికారి కార్యాలయము నందు 11వ ప్రపంచ వ్యవసాయ గణనపై శిక్షణ తరగతులను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య ప్రణాళిక అధికారి కె విజయ్ కుమార్, అసిస్టెంట్ డైరెక్టర్ పాండురంగడు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారుఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ డిసెంబర్ 31 నాటికి మొదటి దశ వ్యవసాయ గణాంకాలను పూర్తి చేసేందుకు రెవెన్యూ అధికారులు సమాయత్తం కావాలన్నారు.
అగ్రికల్చర్ సెసెస్ ఇస్తున్న జిల్లాస్థాయి శిక్షణా తరగతులను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రభుత్వ పథకాలకు సంబంధించి డేటా సిద్ధంగా
ఉంచుకోవాలని తెలిపారు
మొదటి దశలో గ్రామంలోని అన్ని సర్వే, సబ్ పొట్టి దగ్గరడివిజన్లో కమతం , హక్కుదారులు కౌలు రైతులు వివరాలతో పాటు కుల , లింగ సమాచారం సేకరించాలన్నారు. రెండవ దశలో ప్రభుత్వం నిర్ణయించిన 20 శాతం గ్రామాల్లో పంట వివరాలు , నీటివసతి, కమత వర్గీకరణ చేయాలన్నారు. మూడవ దశలో అన్ని సర్వే , సబ్ డివిజన్లో పంటల దిగుబడి కి అయ్యే మొత్తం ఖర్చు , నికరవ్యవసాయ ఉత్పత్తిని తెలుసుకోవాలి అన్నారు. రెవెన్యూ గ్రామంలోని గ్రామ రెవెన్యూ అధికారుల్ని ఎన్యూమనేటర్ గాను, మండల సహాయక గణాంక అధికారి, మండల రెవెన్యూ ఇన్సఫెక్టర్ ల పర్యవేక్షకులు గాను, మండల తాసిల్దారులు పర్యవేక్షణలో ఈ గణన జరుగుతుందని అన్నారు. మండలంలోని అన్ని గ్రామాలలోనూ చిన్న , మధ్య , అధిక తరహా సాగు కమతాల వివరాలు సేకరించనున్నట్లు ఆయన తెలిపారు . ప్రతి సోమవారం స్పందన కార్యక్రమం నందు పై కార్యక్రమాలకు సంబంధించిన వివరాలను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తహసీల్దార్లకు తెలియజేయడం జరుగుతుందని తెలిపారు
ఈ శిక్షణ తరగతుల్లో కార్యాలయ గణాంక అధికారులు, జిల్లా, డివిజన్ ఉప, మండలగణాంకా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
addComments
Post a Comment