గ్రామాల్లో దీర్ఘకాలికంగా ఉన్న భూసంబంద సమస్యలను సమగ్ర భూసర్వే ద్వారా పరిష్కారం


నెల్లూరు సెప్టెంబర్ 24 (ప్రజా అమరావతి);


గ్రామాల్లో దీర్ఘకాలికంగా ఉన్న భూసంబంద సమస్యలను సమగ్ర భూసర్వే ద్వారా పరిష్కారం


చూపుతున్నట్లు రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, పుడ్ ప్రాసెసింగ్ శాఖామాత్యులు  శ్రీ కాకాణి గోవర్ధన రెడ్డి అన్నారు. 


శనివారం సాయంత్రం సర్వేపల్లి నియోజకవర్గం పొదలకూరు మండలం నేదురుమల్లి సచివాలయ పరిధిలోని యర్రబల్లి గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని మంత్రి కాకాణి నిర్వహించారు. గ్రామంలో అడుగుపెట్టిన మంత్రికి స్థానిక నాయకుల ఆధ్వర్యంలో గ్రామస్థులు  అపూర్వ స్వాగతం పలికారు. ఇంటింటికీ వెళ్ళి ప్రభుత్వం నుండి పోందిన లబ్దికి సంబంధించిన పత్రాలను అందజేస్తున్న సందర్బంలో మహిళలు మంత్రికి ఎదురేగి గుమ్మడికాయ తో దిష్టి తీస్తు తమ అభిమానాన్ని చాటుకున్నారు.


తొలుత గ్రామంలో 60 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన సిమెంట్ రోడ్లను మంత్రి కాకాణి ప్రారంభించారు.


అనంతరం మంత్రి కాకాణి మీడియాతో మాట్లాడుతూ సుధీర్ఘకాలంగా సరైన రోడ్డు వసతి లేక  ఎన్నో ఇబ్బందులు ఎదోర్కొన్న యర్రబల్లి గ్రామస్థులకు పరిష్కారం చూపామన్నారు. గడప కు మన ప్రభుత్వం కార్యక్రమ సందర్బంగా గ్రామాలలో పర్యటిస్తున్నప్పుడు ప్రభుత్వ సంక్షేమ పథకాలు సంపూర్ణంగా అందాయని, ప్రతి ఒక్కరూ ప్రభుత్వ పనితీరు పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తున్నారన్నారు. కేవలం మొక్కుబడిగా కాకుండా ఆయా గ్రామాల్లోని చిన్న చిన్న అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి గ్రామస్థుల విన్నపాలను సత్వర పరిష్కారానికి కృషి చేస్తున్నామన్నారు. గ్రామాల్లో దీర్ఘకాలికంగా ఉన్న భూసంబంద సమస్యలను సమగ్ర భూసర్వే ద్వారా పరిష్కారానికి కృషి చేస్తున్నామన్నారు 


ఈ కార్యక్రమంలో ఎంపిడివో నగేష్ కుమారి తహశీల్దారు ప్రసాద్, సర్పంచ్ ఉడతా రమేష్,  మండల స్థాయి అధికారులు, సచివాలయ సిబ్బంది ,వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు. 


Comments